నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పోర్టులలో డ్రెడ్జింగ్కు నిధులు
Posted On:
28 JUL 2023 3:16PM by PIB Hyderabad
పోర్టులు,షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకం సాగరమాల. దేశంలో పోర్టు ల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించినదిఈ పథకం.
సాగర మాల పథకం కింద, పోర్టులు,షిప్పింగ్,జల మార్గాల మంత్రిత్వశాఖ పోర్టుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, కోస్తా బెర్త్ ప్రాజెక్టులకు, డ్రెడ్జింగ్, రోడ్ , రైలు ప్రాజెక్టులు, చేపల హార్బర్లు, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు
కోస్తా కమ్యూనిటీ అభివృద్ధికి, క్రూయిజ్ టెర్మినల్, ఇతర ప్రాజెక్టులకు, ఆర్ఒ పాక్స్ ఫెర్రీ సర్వీసు వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రధాన పోర్టులు కాని పోర్టులు ( నాన్ మేజర్ పోర్టులు)
సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పాలనాపరమైన నియంత్రణలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి ,వాటికి సంబంధించిన పత్రాలు పరిశీలించిన మీదట, సాగర మాల నిధుల మంజూరు మార్గదర్శకాలకు అనుగుణంగా
సాగర మాల పథకం కింద వీటిని మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సాగర మాలపథకం కింద బేపోర్ పోర్టులో మౌలిక సదుపాయాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదు.
సాగరమాల పథకం కింద డ్రెడ్జింగ్కు నిధుల మంజూరు వివరాలు దీనితో జతపరచడమైనది (అనుబంధం –1)
కేరళ ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం, బేపోర్ పోర్టుల 340 మీ పొడవైన వార్ఫ్పోర్టుల. దీనికి మూడు ఫిక్స్డ్ క్రేన్లు, 5 మోబైల్ క్రేన్లు, 1 కంటైనర్ హాండ్లింగ్ క్రేన్ లు, 2 రీచ్ స్టాకర్లు, 3 టగ్స్ ఉన్నాయి. వీటి ద్వారా
షిప్పింగ్ కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తున్నారు. కేరళ ప్రభుత్వం బేపోర్ పోర్టును మరింతగా అభివృద్ధి చేసేందుకు , మరింత మంది ప్రయాణికులు, కార్గో రవాణాకు చర్యలు చేపడుతోంది. ఈ చర్యలలో పెద్ద నౌకల కోసం
కాపిటల్ డ్రెడ్జింగ్, వార్ఫ్ పోడవు పెంపు, గోడౌన్లు, కార్గో నిర్వహణ కార్యకలాపాలకు , అనుసంధానతకు అవసరమైన భూమిని సేకరించడం వంటివి ఉన్నాయి.
***
(Release ID: 1943877)
Visitor Counter : 120