ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రిటిక‌ల్ కేర్ ఆసుప‌త్రి బ్లాకుల వ్య‌వ‌స్థాప‌న‌పై తాజా స‌మాచారం


పిఎం-ఎబిహెచ్ఐఎం కింద 5 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ జ‌నాభా ఉన్న అన్ని జిల్లాల‌లో 602 క్రిటిక‌ల్ కేర్ ఆసుప‌త్రి బ్లాకుల స్థాప‌న‌కు తోడ్పాటునందించేందుకు ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 28 JUL 2023 3:27PM by PIB Hyderabad

పిఎం - ఆయుష్మాన్ భార‌త్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ మిష‌న్ (పిఎం- ఎబిహెచ్ఐఎం - ప్ర‌ధాన‌మంత్రి ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య మౌలిక స‌దుపాయాల మిష‌న్‌) కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం (సిఎస్ఎస్‌) భాగాల కింద  ఆర్ధిక సంవ‌త్స‌రం 2021-22 నుంచి 2025-26 ప‌ధ‌క కాలంలో 5 ల‌క్ష‌ల‌క‌న్నా అధిక జ‌నాభా క‌లిగిన అన్ని జిల్లాల్లో 602 క్రిటిక‌ల్ కేర్ ఆసుప‌త్రి బ్లాకుల‌ను (సిసిబి) ఏర్పాటు చేసేందుకు తోడ్పాటును అందించేందుకు నిబంధ‌న‌ను అందిస్తోంది. రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఈ ప‌థ‌కం కింద కేటాయించిన సిసిబిల సంఖ్య‌ను అనెక్చ‌ర్‌-1లో ఇవ్వ‌డం జ‌రిగింది. జాతీయ ఆరోగ్య మిష‌న్‌కు చెందిన ఉనికిలో ఉన్న చ‌ట్రం, వ్య‌వ‌స్థ‌లు, సంవిధానాన్ని అనుస‌రించి పిఎం-ఎబిహెచ్ఐఎం సిఎస్ఎస్ భాగాలు అమలు చేస్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి అందుకున్న ప్ర‌తిపాద‌న‌లకు నిబంధ‌న‌ల‌కు & రాష్ట్ర‌, కేంద్ర అధికారులు సంయుక్తంగా హాజ‌ర‌య్యే నేష‌న‌ల్ ప్రోగ్రామ్ కోఆర్డినేష‌న్ క‌మిటీ (ఎన్‌పిసిసి) స‌మావేశంలో వివ‌ర‌ణాత్మ‌క చ‌ర్చ ప్ర‌కారం మొత్తం వ‌న‌రుల కోశంలో అందుబాటులో ఉన్న వ‌న‌రుల ప్ర‌కారం భార‌త ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలుపుతుంది. 
ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ శుక్ర‌వారం లోక్‌స‌భ‌కు ఇచ్చిన లిఖితపూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 1943872) సందర్శకుల సూచీ సంఖ్య : : 104
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Tamil