ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన అమలు

Posted On: 25 JUL 2023 5:48PM by PIB Hyderabad

       కేంద్ర ప్రభుత్వ ఆహార తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoFPI)  దేశవ్యాప్తంగా 2017-18 నుండి ఛత్రం  ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY)ని అమలు చేస్తోంది. PMKSY అనేది అందులో భాగంగా ఉండే స్కీముల  యొక్క సమగ్ర ప్యాకేజీ.  దీని లక్ష్యం వ్యవసాయ క్షేత్రం నుండి రిటైల్ దుకాణం  వరకు సమర్థవంతమైన సరఫరా శృంఖల నిర్వహణ కోసం  ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనను సృష్టించడం. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి   ఇది ప్రోత్సాహం అందిస్తుంది. రైతులకు మంచి ధరలను అందించడంలో సహాయపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, వ్యవసాయ ఉత్పత్తుల వృధాను తగ్గించడమే కాక ఆహార పదార్ధాల తయారీ ప్రక్రియ  స్థాయిని పెంచడం ద్వారా  ఎగుమతులను వృద్ధి చేస్తుంది. దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకోసం  ఆహార పదార్ధాల తయారీలో భాగంగా ఉండే స్కీముల కింద,  గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.  

మెగా ఫుడ్ పార్క్స్ పథకం (MFP) (01.04.2021 నుంచి నిలిపివేశారు)
సమీకృత శీతల శృంఖల, విలువ కూర్పు మౌలిక సదుపాయం (కోల్డ్ చైన్)
వ్యవసాయ పదార్ధాల ప్రవర్తన సముదాయం (APC) కోసం మౌలిక సదుపాయాల కల్పన
ఆహార పదార్ధాల తయారీ  మరియు సంరక్షణ సామర్ధ్యాల  సృష్టి/విస్తరణ (CEFPPC)
ముందు వెనుక సంబంధాల సృష్టి (CBFL) (01.04.2021 నుంచి నిలిపివేశారు)
ఆపరేషన్ గ్రీన్స్(OG): దీర్ఘకాలిక జోక్యాలు
ఆహార భద్రత మరియు  నాణ్యతకు పూచీ ఇచ్చే మౌలిక సదుపాయం – నాణ్యతా నియంత్రణ / ఆహార పరీక్ష / శోధన ప్రయోగశాల
(FTL) ఏర్పాటు / స్థాయి పెంపు
మానవ వనరులు & సంస్థలు (HRI)

PMKSY కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు చేయడం ఉండదు. 19 జూలై 2023 నాటికి  పైన పేర్కొన్న PMKSY కాంపోనెంట్ స్కీమ్‌ల క్రింద మొత్తం 96 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లను తమిళనాడు రాష్ట్రంలో  ఆమోదించడము జరిగింది. ఇందుకు అందించిన మొత్తం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూ. 376.40 కోట్లు.  ఈ ప్రాజెక్టుల అమలుకోసం  ఇప్పటికే అందులో రూ. 206.52 కోట్లు విడుదలయ్యాయి.

       తమిళనాడు, అస్సాం మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో PMKSY కింద ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌ల అమలు కోసం  సృష్టించిన  ప్రయోజనాలు / సౌకర్యాల గురించి  అనుబంధంలో ఇవ్వడం జరిగింది.

          15వ ఫైనాన్స్ కమిషన్ కాలవ్యవధి 2021-22 నుండి 2025-26 మధ్య ఆర్ధిక సంవత్సరాల మధ్యకాలం కోసం PMKSYలోని  వివిధ కాంపోనెంట్ స్కీమ్‌ల కింద  MoFPI ప్రతిపాదించిన లక్ష్యాల వివరాలు మరియు వాటికి అనుగుణంగా 19-07-2023 వరకు సాధించిన విజయాలలో అందుబాటులో ఉన్న నిధులతో 233 ప్రాజెక్టులు ఆమోదించడం ఉన్నాయి.  
         PMKSYలోని  వివిధ కాంపోనెంట్ స్కీమ్‌ల కింద తమిళనాడులో 96, అస్సాంలో 50, రాజస్థాన్ లో 48 ఆహార తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్) ప్రాజెక్టులను ఆమోదించడం ద్వారా వరుసగా 4.29 లక్షల , 0.39 లక్షల, 1.52 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది / చేకూరవచ్చు.  దేశవ్యాప్తంగా PMKSYకింద వివిధ కాంపోనెంట్  స్కీమ్‌లను  ప్రారంభించినప్పటి నుంచి మొత్తం 47.52 లక్షల మంది రైతులకు  ప్రయోజనం చేకూరింది / చేకూరవచ్చు.
       PMKSYలోని వివిధ కాంపోనెంట్ స్కీమ్‌ల కింద మొత్తం 13.09 లక్షల మందికి (ప్రత్యక్ష,  పరోక్ష) ఉపాధి కల్పనకు  PMKSY ప్రారంభించినప్పటి నుంచి సహాయం అందించడం జరిగింది.
      కేంద్ర ఆహార పదార్ధాల తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  

 

***


(Release ID: 1943870) Visitor Counter : 141


Read this release in: English , Urdu