మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్–112 (ఈఆర్ఎస్ఎస్)తో చైల్డ్ హెల్ప్‌లైన్ ఏకీకరణ 9 రాష్ట్రాల్లో పూర్తయింది.
ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాలలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 24x7 పనిచేసే ప్రత్యేక మహిళా శిశు అభివృద్ధి కంట్రోల్ రూమ్ (డబ్ల్యూసీడీ సీఆర్) ఏర్పాటు చేయబడింది
Posted On:
26 JUL 2023 4:52PM by PIB Hyderabad
మిషన్ వాత్సల్య పథకం ప్రకారం, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్, 2015 (2021లో సవరించిన విధంగా) కింద నిర్వచించిన విధంగా రాష్ట్రాలు మరియు జిల్లాలు పిల్లల కోసం 24x7 హెల్ప్‌లైన్ సేవను అమలు చేయడం తప్పనిసరి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్-112 (ఈఆర్ఎస్ఎస్-112) హెల్ప్‌లైన్‌తో చైల్డ్ హెల్ప్‌లైన్‌ను ఏకీకృతం చేయడానికి ఒక నిబంధన కూడా ఉంది. చైల్డ్ హెల్ప్‌లైన్ బదిలీ దశలవారీగా జరుగుతుంది. మొదటి దశలో, 9 రాష్ట్రాలలో.. అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ, గోవా, గుజరాత్, లడఖ్, పుదుచ్చేరి మరియు మిజోరాంలలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్-112తో చైల్డ్ హెల్ప్‌లైన్‌ని అనుసంధానం చేయడం పూర్తయింది.
గత ఐదేళ్లలో చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్రాల వారీగా వచ్చిన కాల్‌ల సంఖ్య అనుబంధం-Iలో ఉంది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందిన నివేదిక ప్రకారం, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్-112 అమలులోకి వచ్చినప్పటి నుండి 26.05 కోట్లకు పైగా కాల్స్ నిర్వహించబడ్డాయి. అయితే, రాష్ట్రాల వారీగా కాల్ వివరాలను కేంద్రం నిర్వహించడం లేదు.
జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ & రక్షణ) చట్టం, 2015లోని సెక్షన్ 2(25) ప్రకారం.. సంక్షోభంలో ఉన్న పిల్లల కోసం ఇరవై నాలుగు గంటల అత్యవసరంగా అందించే సేవగా చైల్డ్‌లైన్ సేవలను నిర్వచించడం జరిగింది. ఇది సంక్షోభంలో ఉన్న పిల్లల అత్యవసర లేదా దీర్ఘకాలిక సంరక్షణ మరియు పునరావాస సేవకు అనుసంధానిస్తుంది. ‘1098’ అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించబడిన జాతీయ టోల్ ఫ్రీ 24x7 హెల్ప్‌లైన్ నంబర్. 2019లో సవరించబడిన లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 మరియు దాని కింద రూపొందించిన నియమాలు కూడా చట్టం కింద కేసులను నివేదించడానికి చైల్డ్‌లైన్ సేవలను అందిస్తాయి.
చైల్డ్ హెల్ప్‌లైన్ సేవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే.. భద్రతా వలయం నుండి బయట పడిన ఏ బిడ్డకైనా అత్యవసర మరియు తక్షణ ప్రతిస్పందనను అందించడానికి మరియు పిల్లలను ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక సేవలకు కనెక్ట్ చేయడానికి మద్దతు ఇవ్వడం. అంతేకాకుండా అవసరమైన సహాయం చేయడం. ఇది వైద్యం, ఆశ్రయం, న్యాయ సహాయం, భావోద్వేగ మద్దతు లేదా మార్గదర్శకత్వం అందించడం వంటి సహాయసహకారాలు అందించడం. చైల్డ్‌లైన్ ఆపద పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు మరియు వారి పునరావాసం, పునరుద్ధరణ లేదా సామాజిక పునరేకీకరణ కోసం అందుబాటులో ఉన్న సేవల మధ్య కీలకమైన లింక్‌గా పనిచేస్తుంది. వివిధ అవసరాలు ఉన్న పిల్లలకు, ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు దేనికైనా కాల్ చేసే పిల్లలకు, ఇది ఒక -పాయింట్ కాంటాక్ట్‌గా పనిచేస్తుంది. ఇది మద్దతు, సలహా మరియు క్రియాశీల జోక్యానికి తక్షణ ప్రాప్యతను అందిస్తుంది.
సేవల అమలు కోసం 31.03.2023న చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేయబడింది. రాష్ట్ర స్థాయిలో మిషన్ వాత్సల్య పథకం కింద చైల్డ్ హెల్ప్‌లైన్, మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేయడానికి గుర్తించబడిన రాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి/సామాజిక న్యాయం & సాధికారత శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ, జిల్లా స్థాయిలో మెజిస్ట్రేట్పర్యవేక్షణలో ఉంది.
ఇక రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో చైల్డ్ హెల్ప్‌లైన్ పనితీరును సమీక్షించడానికి, జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో మిషన్ వాత్సల్య పథకం యొక్క రాష్ట్ర స్థాయి పర్యవేక్షణతోపాటు చైల్డ్ హెల్ప్‌లైన్ యొక్క కాలానుగుణ పనితీరును సమీక్షిస్తారు. చైల్డ్ హెల్ప్‌లైన్ యొక్క సమీక్షలో చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రభావం, ప్రతిస్పందన సమయం కోసం కీలకమైన పనితీరు సూచికలు తప్పనిసరిగా ఉండాలి.
మిషన్ వాత్సల్య పథకం మార్గదర్శకాల ప్రకారం.. చైల్డ్ హెల్ప్‌లైన్ రాష్ట్ర మరియు జిల్లా పరిపాలన యంత్రాంగం సమన్వయంతో నడుస్తుంది కాబట్టి, ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 24x7 ప్రత్యేక మహిళా శిశు అభివృద్ధి కంట్రోల్ రూమ్ (డబ్ల్యూసీడీసీఆర్) ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్-112 (ఈఆర్ఎస్ఎస్-112)తో అనుసంధానించబడింది. జిల్లా మేజిస్ట్రేట్ యొక్క మొత్తం పర్యవేక్షణలో పని చేసే జిల్లా బాలల రక్షణ యూనిట్.. జిల్లాలో పిల్లల సేవా బట్వాడా మరియు సంరక్షణ మరియు రక్షణను నిర్ధారించే నోడల్ ఏజెన్సీ. డీసీపీయూ అన్ని బాలల రక్షణ చట్టాలు, పథకాలను అమలు చేయడానికి మరియు మిషన్ వాత్సల్య పథకం మార్గదర్శకాలలో నిర్దేశించిన విధంగా పిల్లల రక్షణ లక్ష్యాల సాధనకు కృషి చేస్తుంది.
***
(Release ID: 1943598)
Visitor Counter : 91