గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అవశేషాల, వ్యర్ధాల, మురుగునీటి నిర్వహణ
Posted On:
27 JUL 2023 4:02PM by PIB Hyderabad
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కింద పారిశుద్ధ్యం రాష్ట్ర అంశం. కనుక, దేశంలోని పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య ప్రాజెక్టులకు ప్రణాళిక, రూపకల్పన, అమలు చేయడం, నిర్వహించడం రాష్ట్రాలు/ యుఎల్‌బిల బాధ్యత. అయితే, చెత్త, వ్యర్ధాలు, మురుగునీటికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి సహాయాన్ని అందించడం ద్వారా గహ & పట్టణ వ్యవహారాల (ఎంఒహెచ్‌యుఎ) మంత్రిత్వ శాఖ ఆ ప్రక్రియను సులభతరం చేస్తుంది. దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితం (ఒడిఎఫ్) చేయాలన్న లక్ష్యంతో, దేశంలోని పట్టణ ప్రాంతంలో ఉత్పత్తి చేసిన మున్సిపల్ ఘన్ వ్యర్ధాలను (ఎంఎస్‌డబ్ల్యు) శాస్త్రీయంగా ప్రాసెస్ చేసేందుకు భారత ప్రభుత్వం 2 అక్టోబర్ 2014న స్వచ్ఛ భారత్ మిషన్- అర్బన్ (ఎస్‌బిఎం-యు). సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్ళేందుకు, శాస్త్రీయమైన ఘన వ్యర్ధాల నిర్వహణ, స్థిరమైన పారిశుద్ధ్యం, ఉపయోగించిన నీటి శుద్ధి అంటే వినియోగించిన నీటి నిర్వహణ (యుడబ్ల్యుఎం) కోసం ఒక లక్షజనాభాకన్నా తక్కువ జనాభా ఉన్న ప్రజల కోసం ఐదేళ్ళ కాలానికి 1 అక్టోబర్ 2021న స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం-యు) 2.0ను ప్రారంభించింది. మురుగునీటి కవరేజ్, సెప్టేజ్ నిర్వహణను మెరుగుపరచడం, లక్ష ఆ పై జనాభా ఉన్న పట్టణ స్థానిక సంస్థలలో, అన్ని రాజధాని నగరాలలో, వారసత్వ నగరాల అభివృద్ధి, ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) నగరాలు, ప్రధాన నదుల పక్కన, కొండప్రాంత రాష్ట్రాలు, ద్వీపాలు, పర్యాటక ప్రదేశాలకు సార్వత్రికంగా రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం 500 నగరాలలో 25 జూన్ 2015న అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (ఎఎంఆర్‌యుటి - అమృత్)ను ప్రారంభించింది. సార్వత్రిక మురుగునీరు కవరేజ్, సెప్టేజ్ నిర్వహణ ను అందించడంలో సాధించిన ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళేందుకు రెండవ దశలో అంటే అమృత్ 2.0 ను 1 అక్టోబర్ 2021న 500 అమృత నగరాలలో ప్రారంభించింది.
ఎస్‌బిఎం-యు 2.0 కింద వ్యర్ధాల నుంచి ఎరువు (డబ్ల్యుఐసి), వ్యర్ధాల నుంచి ఇంధనం (డబ్ల్యుఐఇ), బయో మెథనేషన్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలు (ఎంఆర్ఎఫ్),సంప్రదాయంగా వస్తున్న వ్యర్ధాలు విసర్జించే ప్రదేశాల నివారణ, నిర్మాణ & కూల్చివేత వ్యర్ధాలు తదితరాలు సహా వివిధ మునిసిపల్ ఘన వ్యర్ధాల (ఎంఎస్‌డబ్ల్యు) నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సహాయాన్నికేంద్ర వాటా (సిఎస్) సహాయాన్ని అందిస్తోంది.
అంతేకాక, యుడబ్ల్యుఎం కాంపొనెంట్ కింద 1) మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టిపి)లు/ ఎస్‌టిపి కమ్ ఎఫ్ఎస్‌టిపి, 2) ఎస్‌టిపి వరకు పంపింగ్ కేంద్రాలు, పంపింగ్ మెయిన్/ గ్రావిటీ మెయిన్ ప్రొవిజన్ సహా అవరోధం & మళ్ళింపు (ఐ&డి) వ్యవస్థల ఏర్పాటు 3) సెప్టిక్ ట్యాంకులలోని వ్యర్ధాలను తొలిగించేందుకు తగినంత సంఖ్యలో పరికరాలను సేకరించడానికి సిఎస్ నిధులను ఇస్తారు. ఎస్‌బిఎం-యు 2.0 కింద సిఎస్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేస్తారు. ఈ నిధులను రాష్ట్ర వాటాతో కలిపి నగర పాలక సంస్థలకు పంపిణీ చేస్తారు. కాగా, నగర వారీ గణాంకాలను జాతీయ స్థాయిలో నిర్వహించడం లేదు.
అమృత్ కింద, ఉనికిలో ఉన్న మురుగునీటి వ్యవస్థల పెంపుదల, ఇప్పటికే ఉన్న ఎస్‌టిపిల పునరావాసం, పెంపుదల, కొత్త ఎస్‌టిపీల నిర్మాణాలు సహా భూగర్భ మురుగు నీటి వ్యవస్థల నెట్‌వర్క్ లో ఆమోదయోగ్యమైన అంశాలు.
రాష్ట్రాలు/ నగర స్థానిక సంస్థలకు సాంకేతిక సహాయం కోసం గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల (ఎంహెచ్‌యుఎ) మంత్రిత్వ శాఖ మురుగునీరు, మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, ఘన వ్యర్ధాల నిర్వహణ మాన్యువళ్ళను తీసుకురావడమే కాక మురుగునీటిని, ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం తగిన సాంకేతికతలను ఎంచుకునేందుకు పలు సలహాలను, మార్గదర్శకాలను జారీ చేసింది. నీటి రంగంలో రుజువు చేసుకున్న సంభావ్య అంతర్జాతీయ సాంకేతికతలను గుర్తించేందుకు టెక్నాలజీ సబ్ మిషన్‌ను ప్రారంభించేందుకు అమృత్ 2.0 కార్యాచరణ మార్గదర్శకాలు అందిస్తోంది. క్రమబద్ధమైన వీడియో కాన్ఫరెన్సులు/ వెబినార్లు/ వర్క్ షాపుల/ ప‌్రాంత పర్యటనల ద్వారా నియమిత కాల పర్యవేక్షణ & ప్రాజెక్టుల పురోగతి సమీక్లల ద్వారా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సామర్ధ్య నిర్మాణం, సాంకేతికత సహాయాన్ని మంత్రిత్వ శాఖ అందిస్తోంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి, అడ్డంకులను తొలగించడానికి మిషన్ డైరెక్టొరేట్ ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలకు మద్దతును అందిస్తోంది.
ఎస్‌బిఎం- యు కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణలో సాధించిన పురోగతిని క్రమం తప్పకుండా అంచనా వేస్తారు. ఇందుకోసం పట్టణ పాలక సంస్థలు వ్యర్ధ రహిత నగరాలు, పట్టణాలు (జిఎఫ్‌సి) ను బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్), ఒడిఎఫ్ +,ఒడిఎఫ్ ++& స్టార్ రేటింగ్ లను ధృవీకరించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ (ఎస్ఒపి)లు అభివృద్ధి చేశారు.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్‌బిఎం-యు, అమృత్ పురోగతిని ట్రాక్ చేయడం అనేది వీడియో కాన్ఫరెన్సులు, వెబినార్లు, వర్క్‌షాప్‌లు మొదలైన వాటి ద్వారా, అంకితమై ఎస్‌బిఎం-యు, అమృత్ పోర్టళ్ళ ద్వారా కాలానుగుణ సమీక్ష, మూల్యాంకనం చేస్తారు. అమృత్ కింద క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు అమలును ్రపతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నియమించిన స్వతంత్ర సమీక్ష & పర్యవేక్షణ ఏజెన్సీలు (ఐఆర్ఎంఎ)లు, పే జల్ సర్వేక్షణ్ నగరాల పారిశుద్ధాన్ని, వ్యర్ధాల నిర్వహణ పురోగతిని అంచనా వేస్తాయి.
ఈ సమాచారాన్ని గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయం మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ లోక్‌సభకు నేడు ఇచ్చిన లిఖిత సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1943567)