హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శక్తివంతమైన గ్రామం కార్యక్రమం

Posted On: 26 JUL 2023 4:59PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, రాష్ట్రాలు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న 19 జిల్లాల్లోని 46 బ్లాకుల్లోని ఎంపిక చేసిన గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 2023 ఫిబ్రవరి 15న కేంద్ర ప్రాయోజిత పథకంగా వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని ప్రభుత్వం ఆమోదించింది. 

టూరిజం, సాంస్కృతిక వారసత్వం, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, వ్యవసాయం/హార్టికల్చర్‌తో సహా సహకార సంఘాల అభివృద్ధి, ఔషధ మొక్కలు/మూలికల పెంపకం మొదలైన వాటి ద్వారా జీవనోపాధికి అవకాశాల కల్పన కోసం ఎంపిక చేసిన గ్రామాలలో జోక్యానికి సంబంధించిన కేంద్రీకృత రంగాలను ఈ కార్యక్రమం ప్రతిపాదించింది. అనుసంధానం లేని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీని అందించడం, గృహాలు, గ్రామ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, టెలివిజన్, టెలికాం కనెక్టివిటీతో సహా ఇంధనం వంటివి కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజలు ఉండేందుకు తగిన ప్రోత్సాహకాలను కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

అన్ని జనాభా లెక్కల గ్రామాలు/పట్టణాలు, సెమీ అర్బన్, పట్టణ ప్రాంతాలలో 0-10 కి.మీ పరిథిలో ఉంటాయి. 16 రాష్ట్రాలు, 2 యుటీ లలో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద ఉన్న మొదటి నివాసం నుండి దూరం (వైమానిక దూరం) భూ సరిహద్దులకు ఆనుకుని, రహదారి, వంతెనలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, క్రీడలు, త్రాగునీటికి సంబంధించిన అవసరమైన మౌలిక సదుపాయాలలో గుర్తించిన ఖాళీల కోసం పనులు/ప్రాజెక్ట్‌లు, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ, కమ్యూనిటీ సెంటర్, చిన్న తరహా పరిశ్రమలు మొదలైనవి సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం కింద ఆమోదించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహుల్, స్పితి జిల్లాల్లో ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న బ్లాకుల్లోని ఎంపిక చేసిన గ్రామాలు వీవీపీ పరిధిలోకి వచ్చాయి. చమోలి, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో ఉత్తర సరిహద్దుకు ఆనుకుని ఉన్న బ్లాకుల్లోని ఎంపిక చేసిన గ్రామాలు కూడా వీవీపీ  పరిధిలోకి వచ్చాయి.

రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ ఈ విషయాన్ని తెలిపారు.

*****


(Release ID: 1943564) Visitor Counter : 198


Read this release in: English , Urdu