హోం మంత్రిత్వ శాఖ
అదృశ్యమైన మహిళలు
Posted On:
26 JUL 2023 5:01PM by PIB Hyderabad
తప్పిపోయిన బాలికలు, మహిళలందరి నివేదికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) దాని ప్రచురణ "క్రైమ్ ఇన్ ఇండియా"లో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సంకలనం చేసి ప్రచురిస్తుంది. ప్రచురించిన నివేదికలు 2021 సంవత్సరం వరకు అందుబాటులో ఉంటాయి. 2019-2021 సంవత్సరం నుండి తప్పిపోయిన బాలికలు, మహిళల వివరాలు రాష్ట్రం/UT వారీగా (మహారాష్ట్రతో సహా) ‘అనుబంధం-II’లో ఉన్నాయి.
‘పోలీసు’, పబ్లిక్ ఆర్డర్’ భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని రాష్ట్ర సబ్జెక్ట్‌లు. మహిళలపై నేరాల విచారణ, ప్రాసిక్యూషన్‌తో సహా శాంతిభద్రతలు, పౌరుల జీవితాలు, ఆస్తుల రక్షణ వంటి బాధ్యతలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటాయి. చట్టాలలో ఉన్న నిబంధనల ప్రకారం అటువంటి నేరాలను ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటాయి. అయితే, భారతదేశ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది.
- లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధం కోసం క్రిమినల్ లా (సవరణ), చట్టం 2013 రూపొందించారు. ఇంకా, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి మరణశిక్షతో సహా మరింత కఠినమైన శిక్షా నిబంధనలను సూచించడానికి క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2018 రూపొందించారు. అత్యాచారం కేసుల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయడం, ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ట్రయల్స్‌ను 2 నెలల్లో పూర్తి చేయడం కూడా ఈ చట్టం ఇంటర్-ఎలియా ఆదేశిస్తుంది.
- ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అన్ని అత్యవసర పరిస్థితుల కోసం పాన్-ఇండియా, ఒకే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నంబర్ (112) ఆధారిత వ్యవస్థను అందిస్తుంది, ఫీల్డ్ రిసోర్స్‌లను కంప్యూటర్ సహాయంతో ఆపద ఉన్న ప్రదేశానికి పంపుతుంది.
- స్మార్ట్ పోలీసింగ్, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌కు సహాయం చేయడానికి సాంకేతికతను ఉపయోగించి, సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లు మొదటి దశలో 8 నగరాల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో మరియు ముంబై) మంజూరు చేశారు.
- పౌరులు అశ్లీలమైన కంటెంట్‌ను నివేదించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) 20 సెప్టెంబర్, 2018న సైబర్-క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
- చట్ట అమలు సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా లైంగిక నేరస్థులపై విచారణ, ట్రాకింగ్‌ను సులభతరం చేయడానికి ఎంహెచ్ఏ 20 సెప్టెంబర్ 2018న “లైంగిక నేరస్థులపై జాతీయ డేటాబేస్” (ఎన్డిఎస్ఓ)ని ప్రారంభించింది.
- క్రిమినల్ లా (సవరణ) చట్టం 2018 ప్రకారం లైంగిక వేధింపుల కేసుల్లో సమయానుకూల దర్యాప్తును పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి పోలీసుల కోసం ఎంహెచ్ఏ 19 ఫిబ్రవరి 2019న ఆన్‌లైన్ విశ్లేషణాత్మక సాధనం “లైంగిక నేరాల కోసం ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్”ని ప్రారంభించింది.
- పరిశోధనను మెరుగుపరచడానికి, సెంట్రల్, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలలో డిఎన్ఏ విశ్లేషణ యూనిట్లను బలోపేతం చేయడానికి ఎంహెచ్ఏ చర్యలు తీసుకుంది. చండీగఢ్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిఎన్ఏ అనాలిసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ఇందులో ఉంది. గ్యాప్ అనాలిసిస్ మరియు డిమాండ్ అసెస్‌మెంట్ తర్వాత స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్‌లో డిఎన్ఏ అనాలిసిస్ యూనిట్‌ల ఏర్పాటు మరియు అప్‌గ్రేడ్ చేయడానికి కూడా ఎంహెచ్ఏ మంజూరు చేసింది.
- లైంగిక వేధింపుల కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ మరియు లైంగిక వేధింపుల సాక్ష్యం సేకరణ కిట్‌లోని ప్రామాణిక కూర్పు కోసం ఎంహెచ్ఏ మార్గదర్శకాలను నోటిఫై చేసింది. మానవశక్తిలో తగిన సామర్థ్యాన్ని సులభతరం చేసేందుకు, దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు, వైద్యాధికారులకు శిక్షణ, నైపుణ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ శిక్షణలో భాగంగా ఓరియంటేషన్ కిట్‌గా రాష్ట్రాలు/యుటిలకు 14,950 లైంగిక వేధింపుల సాక్ష్యాధారాల సేకరణ కిట్‌లను పంపిణీ చేసింది.
- దేశంలోని అన్ని జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్‌లు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల ఏర్పాటు బలోపేతం కోసం ఎంహెచ్ఏ రెండు ప్రాజెక్టులను ఆమోదించింది.
- పైన పేర్కొన్న చర్యలతో పాటు, మహిళలపై నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేసింది, అవి www.mha.gov.inలో అందుబాటులో ఉన్నాయి.
- దీనికి అదనంగా, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలో 733 వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు హింసకు గురైన, ఆపదలో ఉన్న మహిళలకు సమగ్ర మద్దతు, సహాయాన్ని అందిస్తాయి, వైద్య సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, పోలీసు సహాయం, మానసిక-సామాజిక కౌన్సెలింగ్‌తో సహా అనేక రకాల సేవలను అందిస్తాయి.
***
(Release ID: 1943552)
Visitor Counter : 176