సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తోన్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వయోభారంతో ఇబ్బందులు పడుతున్న కళాకారులకు నెలకు రూ.6 వేలు అందజేత
Posted On:
27 JUL 2023 4:35PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ "వెటరన్ ఆర్టిస్ట్స్‌కు ఆర్థిక సహాయ పథకం" పేరుతో 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ కళాకారుల కోసం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. వారంతా తమ ప్రత్యేక కళలు మరియు సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక రంగాలలో గణనీయమైన సహకారం అందించారు. కానీ వయోభారం కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ పథకం కింద ఆర్థిక సహాయంగా 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఎంపిక చేసిన కళాకారులకు నెలకు రూ.6000/- ఇవ్వబడుతుంది. లబ్దిదారుల వార్షిక ఆదాయం రూ. 48,000/- కంటే తక్కువ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మరియు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. రాష్ట్రాల వారీగా మంజూరైన నిధుల విషయానికొస్తే 'వెటరన్ ఆర్టిస్ట్స్‌కు ఆర్థిక సహాయ పథకం' అనేది కేంద్ర రంగ పథకం. దీని కింద నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది మరియు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా అందించబడదు. పేర్కొన్న పథకం కింద గత మూడు సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో విడుదల చేసిన నిధులు మరియు మద్దతు పొందిన కళాకారుల సంఖ్య క్రింద ఇవ్వబడింది:
గత మూడు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో అనుభవజ్ఞులైన కళాకారులకు ఆర్థిక సహాయం కోసం పథకం కింద లబ్ధిదారులు:
(రూ. లక్షల్లో)
క్ర.సం.
|
రాష్ట్రాలు
|
2020-21 ఆర్థిక సంవత్సరం
|
2021-22 ఆర్థిక సంవత్సరం
|
2022-23 ఆర్థిక సంవత్సరం
|
2023-24 ఆర్థిక సంవత్సరం (24.07.2023 నాటికి)
|
|
|
పంపిణీ చేయబడ్డ మొత్తం
|
లబ్ధిదారుల సంఖ్య
|
పంపిణీ చేయబడ్డ మొత్తం
|
లబ్ధిదారుల సంఖ్య
|
పంపిణీ చేయబడ్డ మొత్తం
|
లబ్ధిదారుల సంఖ్య
|
పంపిణీ చేయబడ్డ మొత్తం
|
లబ్ధిదారుల సంఖ్య
|
|
మొత్తము
|
871.31
|
2000
|
1542.17
|
3029
|
1859.18
|
3651
|
189.29
|
990
|
ఈ రోజు రాజ్యసభలో సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఈ సమాధానం ఇచ్చారు.
*****
(Release ID: 1943549)
Visitor Counter : 110