సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు
Posted On:
26 JUL 2023 7:21PM by PIB Hyderabad
గత సంవత్సరం మార్చి ఒకటవ తేదీ నాటికి మంది కేంద్ర ప్రభుత్వ శాఖలలో 9,64,359 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ఖర్చుల శాఖలోని వేతన పరిశోధన యూనిట్స్ (పి ఆర్ యు) వార్షిక నివేదికలో తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు / శాఖలు / కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సి పి ఎస్ యులు)/ ఆరోగ్య & విద్యా సంస్థలతో సహా స్వయంపాలిత సంస్థలు , ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైన వాటిలో ఖాళీల భర్తీకి నేరుగా గాని, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ మొదలైన రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా గానీ నియామకాలు చేస్తున్నారు.
వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలలో ఏర్పడే ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ. రోజ్గార్ మేళాలో భాగంగా ఉద్యోగాల ఖాళీలను ఒక ప్రత్యేక కార్యక్రమంగా 'మిషన్ మోడ్' లో భర్తీ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళాలను నిర్వహించి కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు/కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సి పి ఎస్ యులు)/ స్వయంపాలిత సంస్థలు/ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైన వాటిలో కొత్తగా నియామకాలు చేస్తున్నారు.
తమ పరిధిలో ఏర్పడే ఖాళీలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేంద్ర సిబ్బంది & శిక్షణ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు / శాఖలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ వస్తోంది.
కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు & పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1943476)
Visitor Counter : 155