సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వంలో నియమిత పౌర ఉద్యోగులు
Posted On:
26 JUL 2023 7:22PM by PIB Hyderabad
దేశంలో 2022 మార్చి ఒకటవ తేదీ నాటికి 9,64,359 మంది నియమిత పౌర ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఖర్చుల శాఖలోని వేతన పరిశోధన యూనిట్ (పి ఆర్ యు) వార్షిక నివేదికలో తెలిపారు.
తమ పరిధిలో ఏర్పడే ఖాళీలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కేంద్ర సిబ్బంది & శిక్షణ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు / శాఖలు ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ వస్తోంది.
వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలలో ఏర్పడే ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ. రోజ్గార్ మేళాలో భాగంగా ఉద్యోగాల ఖాళీలను ఒక ప్రత్యేక కార్యక్రమంగా 'మిషన్ మోడ్' లో భర్తీ చేయడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ మేళాలను నిర్వహించి ఆరోగ్య & విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర మంత్రిత్వ శాఖలు/శాఖలు/కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
(సి పి ఎస్ యులు)/ స్వయంపాలిత సంస్థలు మొదలైన వాటిలో కొత్తగా నియామకాలు చేస్తున్నారు.
దేశంలో రైల్వే, రక్షణ (సివిల్), హోమ్ వ్యవహారాలు, తపాలా & రెవెన్యూ మంత్రిత్వ శాఖలలో / శాఖలలో 2022 మార్చి ఒకటవ తేదీ నాటికి మంజూరైన ఉద్యోగాలు 36,20,782 కాగా ఉద్యోగాల ఖాళీలు 8,39,821 ఉన్నట్లు ఖర్చుల శాఖలోని వేతన పరిశోధన యూనిట్ (పి ఆర్ యు) వార్షిక నివేదికలో తెలిపారు.
కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు & పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1943475)
Visitor Counter : 107