భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రితో చర్చలు జరిపిన యూరోపియన్ కమీషనర్
పర్యావరణం, మహాసముద్ర & మత్సశాఖల యూరోపియన్ కమీషనర్ వర్జీనిజస్ సింకేవియస్ తో మంత్రి శ్రీ కిరెన్ రిజిజుతో చర్చలు
బ్లూ ఎకానమీ, మెరైన్ లిట్టర్, మెరైన్ బయో-డైవర్సిటీ, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (ఎంపీఏ) మరియు ఓషన్ అండ్ ఫిషరీస్ విభాగలలో సహకారంపై చర్చించిన ఇరుపక్షాలు
Posted On:
26 JUL 2023 7:04PM by PIB Hyderabad
కేంద్ర కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు మరియు యూరోపియన్ యూనియన్ (ఈయు) పర్యావరణం, మహా సముద్రం & మత్స విభాగాలయూరోపియన్ కమీషనర్ శ్రీ వర్జీనిజస్ సింకేవియస్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఈరోజు( 26 జూలై 2023న) న్యూఢిల్లీలో జరిగింది. బ్లూ ఎకానమీ, మెరైన్ లిట్టర్, మెరైన్ బయోడైవర్సిటీ, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (ఎంపీఏ) మరియు ఓషన్ అండ్ ఫిషరీస్ డైలాగ్ల గురించి చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించబడింది. బ్లూ ఎకానమీ, మెరైన్ లిట్టర్, మెరైన్ బయోడైవర్సిటీ, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (ఎంపీఏలు) మరియు ఓషన్ అండ్ ఫిషరీస్ డైలాగ్ల గురించి చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
ముఖ్యాంశాలు:
- డయ్యూ సమ్మిట్ మరియు ‘ఓషన్ 20 డైలాగ్’లో జరిగిన బ్లూ ఎకానమీకి సంబంధించిన జీ-20 కార్యకలాపాలను భారతదేశం ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించింది.
- బ్లూ ఎకానమీ అనేది ఇరు పక్షాలకు ముఖ్యమైన ఎజెండా మరియు సంయుక్తంగా స్థిరమైన అభ్యాసాలను మరియు పర్యావరణ వ్యవస్థల పరిరక్షణను ప్రాధాన్యతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.
- భారతదేశానికి యూరోపియన్ యూనియన్ (ఈయు) ఓషన్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ కోసం సాంకేతిక మద్దతును అందించాలి.
- అంటార్కిటిక్ మహాసముద్రాలలోని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ (ఎంపీఏల) కోసం ఈయు ప్రతిపాదనకు భారతదేశం మద్దతు ఇచ్చింది. అంటార్కిటిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ (సీసీఏఎంఎల్ఆర్)పరిరక్షణపై కన్వెన్షన్ ఆమోదించినప్పుడు 1% సముద్ర ప్రాంతాల పరిరక్షణకు దారి తీస్తుంది.
- సముద్ర కాలుష్యం ఆందోళన కలిగించే ముఖ్యమైన అంశంగా శ్రీ రిజిజు ద్వారా ఈ చర్చల్లో హైలైట్ చేయబడింది. ఈయు కమీషనర్ సముద్రాలను శుభ్రపరచడం మాత్రమే కాకుండా వాటి మూలం నుండి ప్లాస్టిక్లను నివారించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న ఒప్పందం వీలైనంత త్వరగా సాధించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- • జాతీయ అధికార పరిధి దాటిన ప్రాంతాల సముద్ర జీవ వైవిధ్యం (బీబీఎన్జీ): భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ సముద్ర జీవవైవిధ్యం యొక్క ఆవిష్కరణ మరియు డాక్యుమెంటేషన్లో నిమగ్నమై ఉంది. ఈ ప్రయత్నంలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వినూత్న మరియు నాన్-ఇన్వాసివ్ విధానాలను ఉపయోగించడంలో ఈయు తో సహకారాన్ని కోరుతోంది.
*******
(Release ID: 1943100)
Visitor Counter : 102