సహకార మంత్రిత్వ శాఖ
నూతన సహకార రంగ విధానం
Posted On:
26 JUL 2023 5:47PM by PIB Hyderabad
నూతన జాతీయ సహకార విధానాన్ని రూపొందించేందుకు సహకార రంగంలోని నిపుణులు, జాతీయ/ రాష్ట్రాలు/ జిల్లా/ ప్రాథమిక స్థాయి సహకార సంఘాల ప్రతినిధులు/ సహకార కార్యదర్శులు, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆర్‌సీలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాల నుంచి అధికారులతో శ్రీ సురేష్ ప్రభాకర ప్రభు అధ్యక్షతన 2 సెప్టెంబర్ 2022న జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సహకార్ సే సమృద్ధి అన్న ఉద్దేశ్యాన్ని సాధించడంలో, సహకార ఆధారిత ఆర్ధికాభివృద్ధి నమూనాను ప్రోత్సహించడం, దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం, అట్టడుగు స్థాయివరకూ తన విస్త్రతిని పెంచడానికి నూతన జాతీయ సహకార విధానం రూపకల్పన తోడ్పడుతుంది. ఈ విషయంలో, ముందుగా వాటాదారులతో సంప్రదింపులు జరపడమే కాక నూతన విధానాన్ని రూపొందించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ రాష్ట్రాలు/ యఊటీలు, జాతీయ సహకార సమాఖ్యలు, సంస్థలు, సాధారణ ప్రజల నుంచి కూడా సిఫార్సులను, సూచనలను ఆహ్వానించారు. జాతీయ స్థాయి కమిటీ నూతన విధాన ముసాయిదాను రూపొందించేందుకు సేకరించిన అభిప్రాయాలను, విధానపరమైన సూచనలను & సిఫార్సులను విశ్లేషించనుంది.
సహకార రంగంలో మంత్రిత్వ శాఖ చేపట్టిన పలు చొరవలను/ సంస్కరణలను చేపట్టింది. జాబితాను అనెక్చర్-1లో చూడవచ్చు.
.ఈ విషయాన్ని రాజ్యసభకు నేడు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో సహకార మంత్రి శ్రీ అమిత్‌షా పేర్కొన్నారు.
***
(Release ID: 1943078)
Visitor Counter : 181