సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం
Posted On:
25 JUL 2023 5:06PM by PIB Hyderabad
మాన్యువల్ స్కావెంజర్‌గా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం– 2013.. జూన్12, 2013న అమల్లోకి వచ్చింది. ఇది మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్‌లను మనుషులతో శుభ్రం చేయించడాన్ని, ప్రమాదకర పనిని నిషేధిస్తుంది. అంతేకాకుండా మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్‌ల ప్రమాదకర క్లీనింగ్‌ను నివారించడానికి ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టింది:-
నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కేఎఫ్డీసీ) యొక్క స్వచ్ఛత ఉద్యమి యోజన కింద, సఫాయి కర్మచారులు, మాన్యువల్ స్కావెంజర్లు & వారిపై ఆధారపడిన వారికి మరియు శుభ్రపరిచే అన్ని కార్యకలాపాల పూర్తి యాంత్రీకరణ కోసం పారిశుద్ధ్య సంబంధిత సాధనాలు/వాహనాల సేకరణ కోసం శుభ్రపరిచే బాధ్యత కలిగిన పట్టణ స్థానిక సంస్థలు & ఇతర ఏజెన్సీలకు రాయితీ రుణాలు అందించబడతాయి.
మాన్యువల్ స్కావెంజర్స్ (ఎస్ఆర్ఎంఎస్) పునరావాసం కోసం సెంట్రల్ సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద మాన్యువల్ స్కావెంజర్స్‌తో పాటు, పారిశుధ్య కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారికి కూడా మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్‌లను యాంత్రికంగా శుభ్రపరచడానికి సాధనాలు/వాహనాల సేకరణకు రూ. 5.00 లక్షలు మూలధన రాయితీగా అందిస్తారు.
పట్టణ స్థానిక సంస్థల అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు మొదలైన వారితో మునిసిపాలిటీలలో వర్క్‌షాప్‌లు నిర్వహించబడతాయి, వారికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన శుభ్రపరిచే పద్ధతులు మరియు మురుగు కాలువలు & సెప్టిక్ ట్యాంక్‌లను యాంత్రికంగా శుభ్రపరచడం గురించి వారికి అవగాహన కల్పిస్తారు. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో(యూఎల్బీలు) దాదాపు 203 వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయి.
పారిశుద్ధ్య కార్మికుల కోసం స్వల్ప వ్యవధి శిక్షణా కార్యక్రమం (ఆర్పీఎల్) నిర్వహించబడుతుంది, ఇందులో వారికి మెకనైజ్డ్ క్లీనింగ్, సురక్షితమైన & ఆరోగ్యకరమైన శుభ్రపరిచే పద్ధతులు, భద్రతా జాగ్రత్తలు, పీపీఈ కిట్‌ల వాడకంలో శిక్షణ ఇస్తారు. 2021–-22 మరియు 2022–-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా సుమారు 26946 మంది పారిశుధ్య కార్మికులకు ఇటువంటి శిక్షణ అందించబడింది.
ప్రమాదకర శుభ్రతను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు, ప్రభుత్వం 'నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్' (నమస్తే) అనే కొత్త పథకాన్ని రూపొందించింది. దీని లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి:-
మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ (ఎస్ఎస్డబ్ల్యూలు) ప్రమాదకర క్లీనింగ్‌లో నిమగ్నమైన మాన్యువల్ స్కావెంజర్స్ (ఎంఎస్) వ్యక్తుల యొక్క అధికారికీకరణ మరియు పునరావాసం.
శిక్షణ పొందిన మరియు ధృవీకరించబడిన పారిశుధ్య కార్మికుల ద్వారా మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంకుల సురక్షితమైన మరియు యాంత్రిక శుభ్రపరిచే ప్రచారం.
నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (నమస్తే) కింది ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది:
– భారతదేశంలో పారిశుధ్య పనిలో మరణాలు సున్నాకు తగ్గించడం
– అన్ని పారిశుధ్య పనులు అధికారిక నైపుణ్యం కలిగిన కార్మికులచే నిర్వహించబడతాయి
–పారిశుద్ధ్య కార్మికులు మానవ మలంతో ప్రత్యక్ష సంబంధంలోకి రాకూడదు
–మెకనైజ్డ్ పారిశుధ్య సేవలను సురక్షితంగా అందజేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్‌లను (ఈఆర్ఎస్యూ) బలోపేతం చేయడం మరియు కెపాసిటేటింగ్ చేయడం
–పారిశుద్ధ్య కార్మికులు స్వయం సహాయక బృందాలుగా సమిష్టి చేయబడతారు మరియు పారిశుద్ధ్య సంస్థలను నడపడానికి అధికారం కలిగి ఉంటారు
– మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ పారిశుధ్య కార్మికులు (ఎస్ఎస్డబ్ల్యూలు) మరియు వారిపై ఆధారపడినవారు కూడా పారిశుద్ధ్య సంబంధిత పరికరాల కొనుగోలు కోసం మూలధన రాయితీని అందించడం ద్వారా జీవనోపాధిని పొందగలరు.
–రిజిస్టర్డ్ ప్రైవేట్ శానిటేషన్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ (పీఎస్ఎస్ఓలు) మరియు నైపుణ్యం కలిగిన & సర్టిఫైడ్ పారిశుధ్య కార్మికుల నుండి మాత్రమే సేవలను పొందేందుకు పారిశుధ్య సేవలను కోరుకునేవారిలో (వ్యక్తులు మరియు సంస్థలు) అవగాహన పెంచబడింది.
ఏబీపీఎంజేఏవై కింద ఆరోగ్య బీమా పథకం ప్రయోజనాలను ఎస్ఎస్డబ్ల్యూలు & మాన్యువల్ స్కావెంజర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు విస్తరించడం.
ఎస్ఎస్డబ్ల్యూలకు వృత్తిపరమైన భద్రతా శిక్షణ.
మాన్యువల్ స్కావెంజర్స్ (ఎస్ఆర్ఎంఎస్) పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం కింద పునరావాస ప్రయోజనాలు అందించబడ్డాయి.
గుర్తించబడిన మరియు అర్హులైన 58,098 మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబానికి వన్-టైమ్ నగదు సహాయం రూ. 40,000/- అందించబడింది.
2313 మంది ఇండెంటిఫైడ్ మాన్యువల్ స్కావెంజర్లు మరియు వారిపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ స్వయం ఉపాధి ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి మూలధన సబ్సిడీ కింద రూ. 5,00,000 అందించబడింది.
22294 ఇండెంటిఫైడ్ మాన్యువల్ స్కావెంజర్లు మరియు వారిపై ఆధారపడిన వారికి రూ. 3000 స్టైఫండ్ తో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించబడింది. శిక్షణ కాలంలో నెలకు 3,000/-. విజయవంతంగా శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన శిక్షణ ధృవీకరణ పత్రాలు మరియు స్థిరమైన ఉపాధి కోసం సహాయం కూడా అందించబడతాయి.
గుర్తించబడిన మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) కింద ఆరోగ్య బీమా కల్పిస్తున్నారు.
2013 మరియు 2018 సంవత్సరాల్లో మాన్యువల్ స్కావెంజర్ల గుర్తింపు కోసం రెండు సర్వేలు నిర్వహించబడ్డాయి. ఈ రెండు సర్వేల ప్రకారం 58,098 అర్హులైన మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించారు.
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1943029)
Visitor Counter : 136