సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య ఆధారిత సామర్థ్య పెంపునకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు


వికసిత్ భారత్ ను నిర్మించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉద్యోగులలో సమర్థత పెరగాలి: డాక్టర్ జితేంద్ర సింగ్

స్మార్ట్, ప్రజలకు మైత్రీ పూర్వక (సిటిజన్ ఫ్రెండ్ల , భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ శ్రామిక శక్తిని పెంపొందించడానికి మిషన్ కర్మయోగికి సంబంధించిన ఆరు ఉప-కమిటీ నివేదికలను విడుదల చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 25 JUL 2023 6:40PM by PIB Hyderabad

ప్రభుత్వోద్యోగులలో యోగ్యత ఆధారిత సామర్థ్యాన్ని పెంపొందించాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పి ఎం ఒ , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.

 

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ)లో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) నిర్వహించిన వర్క్ షాప్ లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సామర్ధ్యం పెంపు  అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వంలో సిబిసి ఉండాలనే నిర్ణయం సామర్థ్య పెంపు ప్రక్రియ దిశలో ఒక ముందడుగు అని అన్నారు.

 

ఇది వికసిత్ భారత్ ను నిర్మించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్స్ (ఎన్ ఎస్ సి ఎస్ టిఐ) ఫ్రేమ్ వర్క్ మిషన్ కర్మయోగితో అనుసంధానించబడిందని, ఇది ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలు , సామర్థ్యాలను పెంచడానికి శిక్షణా సంస్థలు ఏకీకృత , ప్రామాణిక విధానాన్ని అవలంబించేలా చేస్తుందని చెప్పారు. ఇంకా మరింత సమర్థవంతమైన , బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రోత్సహిస్తుందని  పేర్కొన్నారు.  ఎన్ ఎస్ సి ఎస్ టిఐ ప్లాట్ ఫామ్ , దాని ఎనిమిది ఎక్సలెన్స్  పిల్లర్స్ ను 18 జూలై 2022 న ప్రారంభించి పబ్లిష్ చేశారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ స్మార్ట్, ప్రజలకు మైత్రీ పూర్వక (సిటిజన్ ఫ్రెండ్ల , భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ శ్రామిక శక్తిని పెంపొందించడానికి మిషన్ కర్మయోగికి సంబంధించిన ఆరు ఉప-కమిటీ నివేదికలను విడుదల చేశారు.  నెలల తరబడి సిబిసి, సబ్ కమిటీ సభ్యులు, నిపుణులు , అనేక సి ఎస్ టి ఐ ల సభ్యుల సమిష్టి ప్రయత్నాలు, 2023 జూన్ 19 న ప్రధాన మంత్రి సమక్షంలో నిర్వహించిన జాతీయ శిక్షణా సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చల ఫలితంగా ఈ నివేదికలు వెలువడ్డాయి. ఇవి  ఎన్ ఎస్ సి ఎస్ టిఐ (నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్) పోర్టల్ లో మరింత సి ఎస్ టి ఐ ని నమోదు చేయడం , అక్రిడిటేషన్ ప్రక్రియను పెంచడం గురించి నొక్కి

చెప్పాయి.

 

కాన్ క్లేవ్ అనంతరం అక్రిడిటేషన్లకు విశేష స్పందన లభించిందని, ప్రస్తుతం పోర్టల్ లో 200కు పైగా సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, మరిన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వీటిలో 58 సంస్థలు అక్రిడిటేషన్ చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.

 

2021 అక్టోబర్ 12న జరిగిన సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ (సీటీఐ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సీటీఐ అధిపతులతో ఆరు సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ సబ్ కమిటీలు వర్క్ షాప్ ల ద్వారా సిబిసితో క్రియాశీలకంగా నిమగ్నమై వివిధ ఫ్రేమ్ వర్క్ అంశాలను అంచనా వేస్తాయి. ఇంకా శిక్షణ అవసరాలను గుర్తించడం, విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం , సాధారణ విజ్ఞాన భాండాగారాన్ని సృష్టించడం, సామర్థ్య నిర్మాణం ఫై డిజిటల్ ప్రపంచానికి మార్పు చెందడం, అధ్యాపకుల సామర్థ్యాలను పెంచడం, నిర్వహించిన శిక్షణలను సమర్థవంతంగా అంచనా వేయడం వంటి దృష్టి రంగాలపై మేధోమథనం జరిపి సిఫార్సులను అందిస్తాయి. పాలనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తాయి.

 

అక్రిడిటేషన్ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి , సమర్థవంతమైన అక్రిడిటేషన్ ను bసులభతరం చేయడానికి ఈ వర్క్ షాప్ సంస్థలకు సహాయపడుతుంది. ఈ వర్క్ షాప్ లు సిఎస్ టిఐలకు వివిధ సేవలు , రంగాలకు చెందిన సివిల్ సర్వెంట్ల మధ్య సహకరించడానికి , నెట్ వర్క్ చేయడానికి అవకాశాలను అందిస్తాయి, వారు కలిసి రావడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి , నెట్ వర్క్ లను నిర్మించడానికి వీలు కల్పిస్తుంది.

 

మిషన్ కర్మయోగి అనేది సామర్థ్య ఆధారిత అభ్యాసం . సామర్థ్య పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతదేశంలో పౌర సేవను ఆధునీకరించడానికి రూపొందించిన ప్రభుత్వ చొరవ. బ్యూరోక్రటిక్ వ్యవస్థను మరింత చురుకైన , ఫలితాల ఆధారిత సంస్థగా మార్చాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.

 

మిషన్ ప్రధాన లక్ష్యాలను నడుపుతూ,  ప్రభుత్వ యాజమాన్యంలోని, లాభాపేక్ష లేని ఎస్ పి వి అయిన కర్మయోగి భారత్ ను డిఓపిటి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఐజిఒటి (ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రైనింగ్)  కర్మయోగి ప్లాట్ ఫామ్ ను సొంతం గా నిర్వహించడం, నడపడం, మెరుగుపరిచే బాధ్యతను చేపట్టింది .

 

ప్రభుత్వోద్యోగులు తమ పాత్రను సమర్థవంతంగా, తెలివిగా, సమర్థత తో నిర్వర్తించడానికి వీలుగా "నియమ ఆధారిత" l,  "సామర్థ్య ఆధారిత" అభ్యాసం కంటే "పాత్ర-ఆధారిత" అనే కీలక సూత్రం ఆధారంగా ప్రభుత్వ అధికారులందరికీ ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని పెంపొందించే అవకాశాన్ని సృష్టించడం మిషన్ కర్మయోగి లక్ష్యం.

 

 

*******



(Release ID: 1942661) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi