మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పాడి పరిశ్రమాభివృద్ధికి జాతీయ కార్యక్రమం
Posted On:
25 JUL 2023 5:32PM by PIB Hyderabad
కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ (డిఎహెచ్‌డి) 2014 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమాభివృద్ధి కోసం జాతీయ కార్యక్రమం (ఎన్‌పిడిడి) అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం 2021 జూలై సవరించి/పునఃసమన్వయం చేసింది. ఈ రూపంలో 2021-22 నుంచి 2025-26 వరకు రెండు భాగాలుగా కింద పేర్కొన్న ప్రత్యేక లక్ష్యాలతో అమలు చేస్తోంది:
- ‘ఎన్‌పిడిడి’లోని ‘ఎ’ భాగం నాణ్యమైన పాల పరీక్ష మౌలిక సదుపాయాల సృష్టితోపాటు బలోపేతంపై దృష్టి సారిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగాగల రాష్ట్ర సహకార పాడి సమాఖ్యలు/జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలు/’ఎస్‌హెచ్‌జి’లు/పాల ఉత్పత్తిదారు/రైతు ఉత్పత్తిదారు సంస్థలకు ప్రాథమిక శీతలీకరణ సౌకర్యాలు కల్పిస్తుంది.
- ‘ఎన్‌పిడిడి’లోని ‘ఎ’ భాగం ‘సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమ’ పథకం కింద పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలు పెంచడంపై దృష్టి పెడుతుంది. ఇందుకోసం రైతులకు సంఘటిత మార్కెట్ సౌలభ్యం పెంచుతుంది. పాడి ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాల ఉన్నతీకరణతోపాటు ఉత్పత్తిదారు యాజమాన్య సంస్థల సామర్థ్యం పెంచే బాధ్యతను కూడా నిర్వర్తిస్తుంది.
ఈ మేరకు బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర 9 రాష్ట్రాల్లో ‘ఎన్‌పిడిడి’ పథకంలోని ‘బి’ భాగాన్ని రూ.1568.28 కోట్లతో అమలు చేస్తోంది. ఈ మొత్తంలో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా) నుంచి అధికారిక అభివృద్ధి సహాయం (ఒడిఎ)కింద రుణంగా రూ.924.56 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.475.54 కోట్లు, రాష్ట్రం/భాగస్వామ్య సంస్థ (పిఐ) వాటాగా రూ.168.18 కోట్ల వంతున నిధులు అంతర్భాగంగా ఉంటాయి.
*****
(Release ID: 1942656)