ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకం కింద 1,19,224 క్లెయిములకు చెల్లింపులు

Posted On: 25 JUL 2023 5:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకం బ్యాంక్/పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. 18-70 సంవత్సరాల మధ్య వయస్సులో, ఆదాయం సంపాదించే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరాద్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.

        పథకం ప్రారంభించిన నాటి నుంచి 28.06.2023 వరకు బీమా సంస్థలు ఆమోదించిన, తిరస్కరించబడిన క్లెయిమ్‌ల సంఖ్య:

 

జాతీయ స్థాయిలో పీఎంఎస్‌బీవై క్లెయిముల సమాచారం

చెల్లించిన క్లెయిముల సంఖ్య

1,19,224

తిరస్కరించిన క్లెయిముల సంఖ్య

30,549

సమాచార మూలం: పీఎంఎస్‌బీవై కింద నమోదులు జరిపే సాధారణ బీమా సంస్థలు

 

31.05.2023 నాటికి పీఎంఎస్‌బీవై కింద నమోదైన వ్యక్తుల సంఖ్యను రాష్ట్రాల వారీగా అనుబంధంలో చూడవచ్చు..

****


(Release ID: 1942654) Visitor Counter : 144


Read this release in: English , Urdu