యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అథ్లెట్లు, అథ్లెట్ ల సహాయక సిబ్బందికి డోపింగ్ నిరోధక నిబంధనలు, మార్గదర్శకాల గురించి సమాచారం అందించడానికి యాంటీ డోపింగ్ హెల్ప్ లైన్ నంబర్ (1800-119-919) ను ప్రారంభించిన నాడా: : శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 25 JUL 2023 5:27PM by PIB Hyderabad

క్రీడా విభాగాల సక్రమ నిర్వహణలో నైతిక ప్రవర్తనా నియమావళిని  కీలక అంశంగా భారత ప్రభుత్వం రాజీ లేని ధోరణి తో ఉంది. అథ్లెట్లు, అథ్లెట్ సహాయక సిబ్బంది, కోచ్ లు, రిఫరీలు, అధికారులు, స్పోర్ట్స్ సైన్స్ , వైద్య సిబ్బంది, వాలంటీర్లు, మేనేజర్లు, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు లేదా

సంరక్షకులు, అలాగే ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్ఎస్ఎఫ్) ఆఫీస్ బేరర్ల సహా క్రీడలలో పాల్గొనే భాగస్వాములందరికీ వేధింపులు, వివక్ష లేని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

వ్యక్తులు అత్యున్నత స్థాయి నైతిక నియమాలు పాటించడం కూడా క్రీడకు అత్యవసరం.

 

క్రీడాకారుల డోపింగ్/మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఈ దిశగా  భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ (ఎన్ఎస్ఎఫ్) సహకారంతో యువ అథ్లెట్లతో సహా భాగస్వాములందరికీ యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

ఇందుకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

 

i. గుర్తింపు పొందిన ఎన్ఎస్ఎఫ్ లు సంబంధిత క్రీడా విభాగాల అభివృద్ధికి భారత ప్రభుత్వం నుండి ఆర్థిక , ఇతర మద్దతుకు అర్హులు. వార్షిక శిక్షణ , పోటీల క్యాలెండర్ (ఎసిటిసి) యంత్రాంగం ద్వారా ప్రతి ఎన్ఎస్ఎఫ్ ఈ మంత్రిత్వ శాఖకు చేసిన పని వివరాలను అందిస్తుంది రాబోయే సంవత్సరానికి వివిధ విద్యా , అవగాహన కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేస్తుంది.

 

ii.అథ్లెట్లు, అథ్లెట్ల సహాయక సిబ్బందికి డోపింగ్ నిరోధక నిబంధనలు, మార్గదర్శకాల గురించి సమాచారం అందించడానికి నాడా యాంటీ డోపింగ్ హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. హెల్ప్ లైన్ నంబర్: 1800-119-919; క్రీడలలో ఏదైనా మాదకద్రవ్యాల దుర్వినియోగం లేదా డోపింగ్ కార్యకలాపాలను నివేదించడానికి, నాడా "స్పీక్ అప్!" పోర్టల్ ను కూడా అందిస్తోంది. ఇది అథ్లెట్లు, ఇతరులు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంటీ డోపింగ్ రూల్ ఉల్లంఘన (ఎ డి ఆర్ వి) లను నివేదించడానికి ఉద్దేశించబడింది; నాడా యాంటీ డోపింగ్ రూల్స్ పాటించకపోవడం; లేదా, క్రీడల్లో డోపింగ్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలహీనపరిచే ఏదైనా చర్య లేదా తప్పిదం. ఇన్ ఫార్మర్ ల, పంచుకున్న సమాచార  ఖచ్చితమైన గోప్యతను పాటించేలా నాడా దృష్టి పెడుతుంది.

 

iii. పోటీపడే అథ్లెట్లకు సహాయం చేయడానికి, అవసరం ఆధారంగా. డోపింగ్ నిరోధక నిబంధనలు, డోపింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లకు అవగాహన కల్పించేందుకు నాడా ఎన్ ఎస్ ఎఫ్ ల సహకారంతో అథ్లెట్లకు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలు ఆరోగ్యంపై డోపింగ్ దుష్ప్రభావాలు, అథ్లెట్లపై దాని పర్యవసానాల గురించి అవగాహన  కల్పిస్తాయి. తద్వారా ఎన్ఎస్ఎఫ్ లు డోపింగ్ నియంత్రణను అమలు చేయడానికి వీలు కల్పిస్తాయి.

 

iv.శాయ్ సెంటర్లు/ సాయ్ ట్రైనింగ్ సెంటర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు/ యూనివర్సిటీలు, స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్స్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులలో క్రీడా ఈవెంట్లు/ ట్రైనింగ్ సెషన్ల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు.

 

v.ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) జారీ చేసిన నిషేధిత పదార్ధాల సమాచారాన్ని నాడా క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది.

ఇలాంటి అవగాహన కార్యక్రమాల సందర్భంగా డోపింగ్ కంట్రోల్ హ్యాండ్ బుక్స్, సమాచారాన్ని వివిధ ప్రాంతీయ భాషల్లో కరపత్రాల రూపంలో క్రీడాకారులకు చేర వేస్తారు. కఠినమైన బాధ్యతా సూత్రాలు, సప్లిమెంట్ల వాడకంలో ఇమిడి ఉన్న ప్రమాదాలు, క్రీడలో నైతిక విలువలు, డోప్ నియంత్రణ ప్రక్రియ, ఆరోగ్య ప్రమాదాలు , డోపింగ్ పర్యవసానాలు, చికిత్సా వినియోగ మినహాయింపులు ,నిషేధిత పదార్థాలు మొదలైన కీలక అంశాలను అవగాహన సెషన్లు కవర్ చేస్తాయి. 2022-2023లో నాడా మొత్తం 169 యాంటీ డోపింగ్ అవగాహన, ఎడ్యుకేషన్ సెషన్లు/ వర్క్ షాప్ లు నిర్వహించింది.

 

vi.క్రీడాస్ఫూర్తి , తగిన నైతిక ప్రవర్తన ప్రధాన విలువలకు అనుగుణంగా తగిన ప్రవర్తన ఆకాంక్ష అన్ని సమయాల్లో ఉందని భాగస్వాములందరికీ తెలియజేయడం ద్వారా క్రీడల్లో సురక్షితమైన, సానుకూల వాతావరణాన్ని నిర్ధారించడానికి 2022 జూన్ 15న శాయ్ వివరణాత్మక సూచనలు జారీ చేసింది. పాటించడానికి ఈ క్రింది చర్యలు కూడా సూచించింది:-

 

దేశవాళీ/ అంతర్జాతీయ శిబిరాలు, పోటీల్లో పాల్గొనే సమయంలో మహిళా అథ్లెట్లతో కూడిన బృందంలో మహిళా కోచ్ తప్పనిసరిగా ఉండాలి.

 

*క్రీడల్లో లైంగిక వేధింపుల నివారణకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మార్గదర్శకాలు పాటిస్తున్నట్టు, అమలు చేస్తున్నట్టు ధృవీకరించడానికి,  ఉల్లంఘనను బాధ్యతాయుతమైన అధికారులకు నివేదించేలా ధృవీకరించడానికి అన్ని జాతీయ కోచింగ్ క్యాంపులు , విదేశీ ఎక్స్పోజర్లలో కాంప్లయన్స్ ఆఫీసర్ ను నియమించాలి.

 

*ఏదైనా నేషనల్ కోచింగ్ క్యాంప్ , ఫారిన్ ఎక్స్ పోజర్ ప్రారంభించడానికి ముందు అథ్లెట్లు, కోచ్ లు , సహాయక సిబ్బంది అందరికీ ప్రీ-క్యాంప్ సెన్సిటైజేషన్ మాడ్యూల్స్ డిజైన్ చేసి అందించాలి.

జాతీయ కోచింగ్ క్యాంపుల్లో మహిళా కోచ్ లు/సహాయక సిబ్బంది సంఖ్యను సంబంధిత ఎన్ ఎస్ ఎఫ్ ల ద్వారా పెంచాలి.

 

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు.

 

*****


(Release ID: 1942645) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Kannada