యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'ఖేలో ఇండియా - నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్' పథకం ద్వారా గ్రామీణ మరియు స్థానిక/గిరిజన ఆటలు ప్రోత్సహిస్తున్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
Posted On:
25 JUL 2023 5:26PM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2016 నుంచి కేంద్ర ప్రాయోజిత పథకంగా 'ఖేలో ఇండియా - నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్' పధకాన్ని అమలు చేస్తోంది. పథకం లో భాగంగా 'గ్రామీణ, దేశీయ/గిరిజన ఆటలు ప్రోత్సహించడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. గ్రామీణ, దేశీయ/గిరిజన ఆటల అభివృద్ధికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అమలు జరుగుతోంది.
ఖేలో ఇండియా పథకం సబ్-కంపోనెంట్ గా అమలు జరుగుతున్న ‘గ్రామీణ మరియు దేశీయ/గిరిజన ఆటల ప్రోత్సాహం ’ కింద మల్లఖంబ్, కలరిపయట్టు, గట్కా, థాంగ్-టా, సిలంబం , యోగాసన్‌లు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరికరాల మద్దతు, కోచ్‌ల నియామకం, కోచ్‌ల శిక్షణ మరియు అథ్లెట్లకు స్కాలర్‌షిప్‌లు పొందుతున్నాయి.
ఖేలో ఇండియా పథకంలో భాగంగా అమలు జరుగుతున్న ‘ఖేలో ఇండియా సెంటర్స్’ కార్యక్రమం కింద దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థను క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది తక్కువ ఖర్చుతో కూడిన, సమర్థవంతమైన క్రీడా శిక్షణ విధానం అమలు జరుగుతోంది. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు యువకులకు కోచ్‌లుగా, మెంటార్‌లుగా మాజీ క్రీడాకారులను నియమించవచ్చు.యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోస్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ క్రీడాకారులకు వివిధ క్రీడా విభాగాలలో కోచ్‌లుగా నియమించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈరోజు లోక్‌సభలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1942643)