ఆర్థిక మంత్రిత్వ శాఖ
‘వివాద్ సే విశ్వాస్ I- ‘ఎంఎస్‌ఎంఇ’లకు ఊరట’ కింద 137 సంస్థలకు ఉపశమనం
Posted On:
25 JUL 2023 5:41PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ‘వివాద్ సే విశ్వాస్ I- ‘ఎంఎస్‌ఎంఇ’లకు ఊరట’ పథకం కింద 2023 జూన్ 1నాటికి 137 సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలకు ఉపశమనం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు తెలిపారు. ఈ పథకాన్ని 17.04.2023న ప్రారంభించినందున గత ఏడాది నిధులు కేటాయించలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 01.06.2023 నాటికి 1,103 ‘ఎంఎస్‌ఎంఇ'ల క్లెయిములు పరిష్కరించాల్సి ఉందని మంత్రి వివరించారు.
*****
(Release ID: 1942642)