హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ క్రైమ్‌ను పరిశోధించడానికి అధిక వ్యయం

Posted On: 25 JUL 2023 4:58PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని ఏడవ అధికరణం  ప్రకారం ‘పోలీస్’ , ‘శాంతి భద్రతలు ’ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు లు తమ  చట్ట అమలు సంస్థల ద్వారా సైబర్ నేరాలతో సహా నేరాలను నిరోధించడం, గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రాసిక్యూషన్‌కు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులపై  చట్ట నిబంధనల ప్రకారం చట్ట అమలు సంస్థలు చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సామర్థ్యం పెంచేందుకు  వివిధ పథకాల కింద సలహాలు, ఆర్థిక సహాయం అందజేస్తోంది. 

సైబర్ నేరాలను సమగ్రంగా విచారించి నివారించడానికి  యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం వివిధ కార్యక్రమాలు చేపట్టింది. వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవడం ద్వారా సైబర్ నేర పరిశోధన ఖర్చు తగ్గించి చట్ట అమలు సంస్థల బాధితులకు ఉపయోగపడేలా  కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:

i . దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో దర్యాప్తు చేసి నేరాలను నిరోధించడానికి  ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C) ప్రారంభమయ్యింది

ii . ఆన్‌లైన్  ఆఫ్‌లైన్ విధానంలో అన్ని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు విచారణా అధికారులకు  ప్రారంభ దశ సైబర్ ఫోరెన్సిక్ సహాయాన్ని అందించడానికి 'నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఇన్వెస్టిగేషన్)' న్యూఢిల్లీలో ఏర్పాటయింది. 

iii. సైబర్ నేరాల దర్యాప్తులో అన్ని అంశాల్లో   విచారణ అధికారులు, న్యాయ అధికారులు, ప్రాసిక్యూటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి  సర్టిఫికేషన్‌తో పాటు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్స్, ప్రాసిక్యూషన్ మొదలైన కీలకమైన అంశాలపై ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణ కోసం  ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (MOOC) ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటయింది. 

iv. పోలీసు సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు , జ్యుడీషియల్ ఆఫీసర్లకు విచారణ మరియు ప్రాసిక్యూషన్‌ను మెరుగ్గా నిర్వహించడానికి శిక్షణా పాఠ్యాంశాలు తయారు చేయబడ్డాయి.  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు  తదనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు  నిర్వహించాలని కేంద్రం సూచించింది.  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, బీపీఆర్ అండ్ డి  ద్వారా  36118ఎల్ఈఏలు, 2022 మంది జ్యుడీషియల్ అధికారులు, 2240 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శిక్షణ పొందారు.

v. మహిళలు, పిల్లల కు సంబంధించిన  సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన సంఘటనలు ప్రజలు తెలియజేయడానికి   వీలుగా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (https://cybercrime.gov.in) ఏర్పాటయింది. . ఈ పోర్టల్‌ ద్వారా అందిన  సైబర్ క్రైమ్ సంఘటనలు,  ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడం,  వాటిపై తదుపరి చర్యలు చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర/కేంద్రపాలిత  చట్ట అమలు సంస్థలు నిర్వహిస్తాయి.

vi ఆర్థిక మోసాలను తక్షణమే ఫిర్యాదు చేయడానికి, మోసగాళ్లు నిధులు స్వాహా చేయకుండా చూడడానికి  ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ప్రారంభించబడింది. ఆన్‌లైన్ సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సహాయం పొందడానికి టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ ప్రారంభించబడింది.

vii. మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ (CCPWC) పథకం కింద, రూ. 122.24 కోట్లు  అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సమకూర్చింది., దర్యాప్తు సాధనాలు, మానవవనరులను ఎక్కువ చేసి చట్ట అమలు సంస్థల  సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి,  సైబర్ నేర పరిశోధన ఖర్చు తగ్గించడానికి ఈ చర్యలు అమలు జరుగుతున్నాయి. 

viii. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయం   మెరుగుపరచడానికి, నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి  రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం /యూటీల ద్వారా అందిన సమాచారాన్ని ఇతర రాష్ట్రాలతో పంచుకుని నేరాలు అరికట్టడానికి  ఏడు జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్‌లు ఏర్పాటు అయ్యాయి. 

ix సైబర్ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాల కేసుల్లో అవసరమైన ఫోరెన్సిక్ మద్దతును అందించడానికి, సాక్ష్యాలను భద్రపరచడం ,ఐటీ  చట్టం నిబంధనల ప్రకారం  సాక్ష్యాధారాల  విశ్లేషణ చేయడం, దర్యాప్తు సమయాన్ని తగ్గించడం కోసం   'నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (సాక్ష్యం)' హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యింది. 

x. అత్యాధునిక ఆయుధాలు, శిక్షణ గాడ్జెట్లు, అధునాతన కమ్యూనికేషన్/ఫోరెన్సిక్ పరికరాలు, సైబర్ పోలీసింగ్ పరికరాలు మొదలైన వాటి కొనుగోలు కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘పోలీసుల ఆధునికీకరణ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయం’ పథకం కింద హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయాన్ని కూడా అందించింది.

 

లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఈ వివరాలు తెలిపారు.

***


(Release ID: 1942638) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Tamil