వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై మేధోమథనం నిర్వహించిన వినియోగదారుల వ్యవహారాల శాఖ


బ్లాక్ చెయిన్, వి డి ఎలు, వెబ్ 3ల స్వీకరణ: అవి వినియోగదారులకు విసురుతున్న సవాళ్లు ప్రధాన ఇతివృత్తం

Posted On: 25 JUL 2023 5:21PM by PIB Hyderabad

వెబ్ 3 ఎకోసిస్టమ్ లో లోతుగా ప్రవేశించడానికి , వినియోగదారులు,  వివిధ భాగస్వాములకు పూర్తి రక్షణ కల్పించడానికి డి ఒఓసిఎ - వాటాదారుల మధ్య నిర్మాణాత్మక సంభాషణ కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖ వర్చువల్ డిజిటల్ ఆస్తులు, వెబ్ 3 రంగం వినియోగదారులపై నేడు ఇక్కడ మేధోమథన సెషన్ ను నిర్వహించింది.

 

డిఓసిఎ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ స్వాగతం పలుకుతూ, వెబ్ 2  ఆన్ లైన్ లావాదేవీలో అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు మెటావర్స్ లేదా వెబ్ 3 లో మరింత సంక్లిష్టంగా మారుతాయని అన్నారు. ఐడెంటిటీల రద్దు కారణంగా వెబ్ 3లో చట్టాలు,  నియంత్రణ అమలు కష్టం. అందువల్ల వెబ్ 3 లో వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కూడా కష్టమవుతుంది. వెబ్ 2 లో ప్లాట్ ఫామ్ బాధ్యతలను ఏర్పాటు చేయడంలో నేడు ప్రపంచం పోరాడుతున్నందున, వికేంద్రీకృత వెబ్ 3 లో ప్లాట్ ఫాం బాధ్యత మరింత క్లిష్టంగా మారుతుంది. వర్చువల్ డిజిటల్ ఆస్తులు, వెబ్ 3 పై సమిష్టి దృక్పథం దేశాల మధ్య అవసరం. వర్చువల్ డిజిటల్ ఆస్తులు , వెబ్ 3 వల్ల తలెత్తే సమస్యలను వినియోగదారుల వ్యవహారాల శాఖ వినియోగదారులకు మాత్రమే పరిమితం చేస్తుందని ఆయన తెలిపారు.

 

మూడు ప్రధానాంశాలపై మేధోమథనం సెషన్ జరిగింది: మొదటిది, వరల్డ్ వైడ్ వెబ్ , వర్చువల్ డిజిటల్ ఆస్తులను , దాని నేపథ్య సాంకేతికతలను అర్థం చేసుకోవడం : రెండవది, వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుండి వినియోగదారులకు రానున్న ప్రమాదాలను,  వెబ్ 3 బ్లాక్ చెయిన్ ప్రమాదాలు, భద్రతా బెదిరింపులను ఎలా తగ్గించాలి అర్థం చేసుకోవడం: మూడవది, వి డి ఎలు , వెబ్ 3 కోసం ఇప్పటికే ఉన్న ఇంకా అభివృద్ధి చెందుతున్న చట్టాలు , నిబంధనల ద్వారా వినియోగదారుల రక్షణ.

 

వెబ్ 3 అసోసియేషన్ కు చెందిన పలువురు కీలక వ్యక్తులు ఈ సెషన్ కు హాజరై పై కీలక అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పలువురు న్యాయవాదులు కూడా ఈ సెషన్ కు హాజరై వెబ్ 3 న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించారు.

 

ఆర్థిక వ్యవహారాల శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఫైనాన్షియల్ అకడమిక్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ , వినియోగదారుల రక్షణలో వినియోగదారుల నష్టాలను తగ్గించడానికి పనిచేస్తున్న కార్యకర్తలు, మీడియా సిబ్బంది ,పాత్రికేయులు ఈ సెషన్ కు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.విలువైన సూచనలు ఇచ్చారు. ఇంకా చాలామంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పలువురు భాగస్వాములు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

చర్చల లో ద్వారా ఈ క్రింది సూచనలు ప్రతిపాదించబడ్డాయి: వర్చువల్ డిజిటల్ అసెట్స్ , వెబ్ 3 టెక్నాలజీలతో సంబంధం ఉన్న సంభావ్య వినియోగదారుల ప్రమాదాలు , సవాళ్లను గుర్తించడం, వికేంద్రీకృత అనువర్తనాలలో డేటా గోప్యత,  భద్రత కోసం బలమైన ఫ్రేమ్ వర్క్ లను రూపొందించడం, వెబ్ 3 రంగం

సంక్లిష్టతలను నావిగేట్ చేయడంలో వినియోగదారుల విద్య ,అవగాహన పాత్రను విశ్లేషించడం, వర్చువల్ డిజిటల్ ఆస్తుల రంగంలో మోసం , మార్కెట్ అవకతవకలను నివారించడానికి వినియోగదారుల కేంద్రీకృత నిబంధనలను ఏర్పాటు చేయడం.

 

ఆర్ట్, గేమింగ్, రియల్ ఎస్టేట్ , ఫైనాన్స్ వంటి పరిశ్రమలపై వర్చువల్ డిజిటల్ అసెట్స్ మార్పుల ప్రభావాన్ని , ఈ మార్పులు వినియోగదారుల అనుభవాన్ని ఎలా మారుస్తాయనే అంశాలను కూడా చర్చించారు.

 

పరిశ్రమ భాగస్వాములు , విధాన

రూపకర్తల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని పెంపొందించడానికి వినియోగదారుల వ్యవహారాల విభాగం ఈ సెషన్ ఫలితాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎదురు చూస్తోంది.

ఈ కార్యక్రమంలో పంచుకున్న ఆలోచనలు,  అంతర్దృష్టులు భవిష్యత్తు విధాన రూపకల్పనకు పునాదిగా పనిచేస్తాయి, వెబ్ 3 పర్యావరణ వ్యవస్థ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి. కీలక భాగస్వాములు, విషయ నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం డిపార్ట్ మెంట్  ఎప్పటి నుంచో ఆనవాయితీగా పెట్టుకుంది.

 

****


(Release ID: 1942634) Visitor Counter : 116


Read this release in: English , Urdu , Hindi