వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పప్పులు మరియు వంట నూనెల ఉత్పత్తి

Posted On: 25 JUL 2023 5:06PM by PIB Hyderabad

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్‌) నేల ఆరోగ్యం, నేలలో సూక్ష్మ జీవపదార్థం, వాతావరణ మార్పులపై  స్థితిస్థాపకత మొదలైన వాటికి సంబంధించి వివిధ వ్యవసాయ పర్యావరణాలలో పప్పుధాన్యాల సాగుపై ప్రభావాన్ని అంచనా వేసింది.

జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, న్యూట్రి తృణధాన్యాలు, పత్తి & నూనె గింజలు మరియు హార్టికల్చర్ సమగ్ర అభివృద్ధి మిషన్ (ఎంఐడిహెచ్‌) కింద ఉద్యాన పంటలతో సహా వివిధ రకాల పంటల ఉత్పత్తి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. భారత ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కెవివై) కింద రాష్ట్ర నిర్దిష్ట అవసరాలు/ప్రాధాన్యాల కోసం రాష్ట్రాలకు సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.

రైతులను వరికి ప్రత్యామ్నాయ పంటలను అనుసరించేలా ప్రోత్సహించేందుకు వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ (డిఎ&ఎఫ్‌డబ్ల్యూ) అసలైన హరిత విప్లవ రాష్ట్రాలలో ఆర్‌కివివై కింద పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాన్ని (సిడిపి)ని కూడా అమలు చేస్తోంది. 2013-14 నుండి హర్యానా, పంజాబ్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లు పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతక తృణధాన్యాలు, న్యూట్రి తృణధాన్యాలు, పత్తి మొదలైన ప్రత్యామ్నాయ పంటల వైపు పయనిస్తున్నాయి. రైతుల పొలంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రదర్శించడం సిడిపి లక్ష్యంగా పెట్టుకుంది. “4.85 మిలియన్ హెక్టార్ల వైవిధ్యీకరణ” పైలట్ ప్రాజెక్ట్ ఈ ఐదేళ్లలో (2023-24 నుండి 2027-28 వరకు) దేశంలోని 14 ఆగ్రో ఎకోలాజికల్ రీజియన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో  ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్,జార్ఖండ్‌, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, మరియు పశ్చిమ బెంగాల్‌లో మోడీపురంలోని ఐకార్‌-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ (ఐఐఎఫ్‌ఎస్‌ఆర్‌)కి ఆమోదించబడింది.


నూనెగింజల ఉత్పత్తి దేశీయ వంటనూనెల డిమాండ్‌కు సరిపోనప్పటికీ పెరిగిన పప్పుధాన్యాల ఉత్పత్తి దేశీయ ఉత్పత్తిలో పప్పుల దిగుమతిని దాదాపు 9 శాతానికి తగ్గించింది. నూనెగింజలు మరియు పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి ప్రభుత్వం దేశంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) అమలు చేస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద రైతులకు మెరుగైన పద్ధతులపై క్లస్టర్ ప్రదర్శనలు, పంటల విధానంపై ప్రదర్శనలు, అధిక దిగుబడినిచ్చే రకాలు/హైబ్రిడ్‌ల విత్తనోత్పత్తి మరియు పంపిణీ, మెరుగైన వ్యవసాయ యంత్రాలు/వనరుల పరిరక్షణ యంత్రాలు/ఉపకరణాలు, సమర్థవంతమైన నీటి వినియోగ సాధనాలు, సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై రైతులకు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సహాయం అందించబడుతుంది. 2015-16లో 163.20 లక్షల టన్నుల నుంచి 2022-23లో 275.04 లక్షల టన్నులకు (3వ ముందస్తు అంచనాల ప్రకారం) మరియు నూనె గింజలు 252.50 లక్షల టన్నుల నుంచి 409.97 లక్షల టన్నులకు పెరిగాయి. పప్పు దినుసుల దిగుమతి 2015-16లో 58 లక్షల టన్నుల నుంచి 2022-23 నాటికి 24.96 లక్షల టన్నులకు తగ్గింది.

వీటికితోడు ఈ మిషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్‌) & స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలు (ఎస్‌ఏయులు)/కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు)కి కూడా సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్‌లు/శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాంకేతికతను అందించడం మరియు సాంకేతికతను రైతులకు బదిలీ చేయడం కోసం మద్దతునిస్తుంది. 2021-22లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఆయిల్ పామ్) అనే పేరుతో ఆయిల్ పామ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ను కూడా ప్రారంభించింది. నూనెగింజలు & ఆయిల్ పామ్ ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం ద్వారా కూరగాయల నూనెల లభ్యతను పెంపొందించే లక్ష్యంతో దేశంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం- నూనెగింజలు మరియు ఎన్‌ఎంఈఓ (ఓపి) మిషన్ భాగాలు రెండూ అమలు చేయబడుతున్నాయి. ఇంకా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద టార్గెటింగ్ రైస్ ఫాలో ఏరియా (టిఆర్‌ఎఫ్‌ఏ) 12 రాష్ట్రాల వరి పంటలో పప్పుధాన్యాలు & నూనెగింజల సాగు కోసం అమలు చేయబడింది. ఆర్‌కెవివై రాష్ట్రాల్లో పప్పుధాన్యాలు మరియు నూనె గింజల ఉత్పత్తికి కూడా మద్దతు ఇస్తుంది.

వివిధ రాష్ట్రాలలో రైతులకు విక్రయించబడుతున్న పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ధరలు, అధిక దిగుబడినిచ్చే రకాలు (హెచ్‌వైవిలు) పప్పుధాన్యాలు మరియు నూనెగింజల (నువ్వులు మినహా) యొక్క ధృవీకరించబడిన విత్తనాల పంపిణీపై ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కార్యక్రమం కింద భారత ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను కలిగి ఉంటుంది. క్వింటాల్‌కు రూ. 5000 , క్వింటాల్‌కు రూ. 4000 మరియు నూనెగింజలు మరియు నువ్వుల రకాల్లో హైబ్రిడ్‌లకు క్వింటాల్‌కు రూ.8000తో పాటు పప్పుధాన్యాలు మరియు నూనెగింజల హెచ్‌వైవిల విత్తన మినీకిట్‌లను కూడా ప్రభుత్వం రైతులకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

 

*****



(Release ID: 1942631) Visitor Counter : 102


Read this release in: English , Urdu