గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - పట్టణ (PMAY-U)

Posted On: 24 JUL 2023 5:48PM by PIB Hyderabad

         'అందరికీ ఇళ్లు' ఆదర్శ కార్యక్రమం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన - పట్టణ (PMAY-U) పథకాన్ని అమలు చేస్తోంది.  అన్ని వాతావరణాల్లో తట్టుకొని నిలిచే పక్కా గృహాలను ప్రాథమిక పౌర సౌకర్యాలతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా పట్టణాలలో ఉండే అర్హులైన  లబ్ధిదారులకు అందించడానికి కేంద్ర సహాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు రుణంతో జోడించిన సబ్సిడీ స్కీము (CLSS) మినహా  ప్రధానమంత్రి ఆవాస్ యోజన - పట్టణ అమలు వ్యవధిని 31.12.2024 వరకు పొడిగించారు.   గతంలో 25.06.2015 నుండి 31.03.2022 వరకు అమలులో ఉన్నది.   ఈ  పథకం కింద మంజూరైన అన్ని గృహాలను నిధుల పద్ధతిని,  అమలు చేసే పద్ధతిని మార్చకుండా పూర్తి చేయవలసి ఉంటుంది.  
         గృహాల నిర్మాణానికి భారత ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదు.  ఎందుకంటే PMAY-U డిమాండ్ ఆధారిత పథకం.  
మొత్తం 112.24 లక్షల ఇళ్ల డిమాండ్‌ ఉన్నట్లు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు PMAY-U కింద  డిమాండ్ సర్వే చేపట్టి అంచనా వేసి కేంద్రానికి నివేదించాయి.  గృహాల డిమాండ్ చలనశీల స్వభావం కలిగినది. రాష్ట్రాలు/యుటిలు సమర్పించిన ప్రాజెక్టు  ప్రతిపాదనల ఆధారంగా, 2023 జూలై 10వ తేదీ నాటికి 118.90 లక్షలకు పైగా గృహాలు మంజూరు చేశారు. మంజూరైన ఇళ్లలో 112.22 లక్షల గృహాలు నిర్మాణం పనులు మొదలయ్యాయి.  వీటిలో 75.31 లక్షల గృహాలు  పూర్తికావడం  లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.  ఈ పథకం కోసం తాము ఇస్తామని ప్రకటించిన  ₹ 2.00 లక్షల కోట్ల (సుమారుగా) సహాయంలో కేంద్ర ప్రభుత్వం ₹ 1.47 లక్షల కోట్లు విడుదల చేసింది.   PMAY-U కింద గత మూడేళ్లలో (2020-21 నుండి 2022-23 వరకు) పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం వారీగా అనుబంధంలో ఉన్నాయి
         పొడిగించిన స్కీమ్ వ్యవధిలో అంటే 31.12.2024 లోగా మంజూరైన గృహాలన్నింటినీ  పూర్తి చేయడం కోసం PMAY-U అమలు స్థితిని తెలుసుకోవడానికి రాష్ట్రాలు/యూటీలతో మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది.  
 
          మంజూరు చేసిన  గృహాల నిర్మాణం కోసం ఇంతకుముందు విడుదల చేసిన నిధుల  వినియోగం, స్కీమ్ మార్గదర్శకాల అమలుచేయడం ఆధారంగా  రాష్ట్రాలు/యుటిలకు తగినంత కేంద్ర సహాయం విడుదలైంది.  గత మూడు సంవత్సరాలలో
సంవత్సరం వారీగా  PMAY-U కింద కేటాయించిన బడ్జెట్  వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

ఆర్థిక సంవత్సరం      బడ్జెట్ కేటాయింపు  (₹ కోట్లలో)

2020-21                                                    21,000.00

2021-22                                                    27,023.97

2022-23                                                    28,000.00

       కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

 

***

 



(Release ID: 1942495) Visitor Counter : 88


Read this release in: English , Urdu , Tamil