గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందిన ప్రజల సంఖ్య
Posted On:
25 JUL 2023 2:27PM by PIB Hyderabad
మహాత్మాగాంధీ నరేగా పథకం డిమాండ్-ఆధారిత పథకం, నమోదిత కుటుంబాలు ఈ పథకం నిబంధనల ప్రకారం పని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2020-21 ఆర్థిక సంవత్సరం వరకు, 18-30 సంవత్సరాల వయస్సు గల వాళ్లు 2.95 కోట్ల మంది పేరు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 3.06 కోట్ల మందికి పెరిగింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు లోక్‌సభలో ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు.
****
(Release ID: 1942453)