జల శక్తి మంత్రిత్వ శాఖ

తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదా మంజూరు

Posted On: 24 JUL 2023 6:10PM by PIB Hyderabad

తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్సీపీ) కలిసింధ్, పార్వతి, మేజ్ మరియు చకన్ సబ్ బేసిన్‌లలో లభ్యమయ్యే మిగులు రుతుపవనాల జలాలను ఉపయోగించడం ద్వారా చంబల్ బేసిన్‌లో లోటు ఉప-బేసిన్‌లుగా ఉన్న బనాస్, గంభీరి, బంగంగా మరియు పర్బతిలోని తూర్పు జిల్లాలకు త్రాగునీటిని అందించడానికి.. బనాస్, గంభీరి, బంగంగాలకు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడానికి నీటిని  మళ్లిస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 2.82 లక్షల హెక్టార్ల  విస్తీర్ణంలో (2,02,498 హెక్టార్ల కొత్త సాగు చేయదగిన కమాండ్ ఏరియా మరియు 80,000 హెక్టార్లలో నీటిపారుదల స్థిరీకరణ) నీటి అవసరాలను తీర్చొచ్చని ఆశిస్తున్నారు.

భారత ప్రభుత్వ జాతీయ ప్రాజెక్టుల పథకం కింద నిధుల కోసం ప్రాజెక్ట్‌ను చేర్చడం కోసం, దీనిని మొదట సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అంచనా వేయాలి. అంతేకాకుండా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలను నీటిపారుదల, వరద నియంత్రణ మరియు బహుళార్ధసాధక ప్రాజెక్టులపై సలహా కమిటీ  ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి అనుమతి పొందాల్సి ఉంటుంది. తదనంతరం..  ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ స్కీమ్ కోసం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ (హెచ్ పీఎస్సీ)పరిశీలిస్తుంది. హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ ద్వారా సిఫార్సు చేయబడినప్పుడు మరియు నిధుల లభ్యత మొదలైన వాటి ప్రకారం, జాతీయ ప్రాజెక్ట్‌ల పథకం క్రింద ప్రాజెక్ట్‌ను చేర్చడాన్ని భారత ప్రభుత్వం ఆమోదించవచ్చు.

తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్సీపీ) యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను రాజస్థాన్ ప్రభుత్వం 2017, నవంబర్లో సాంకేతిక- ఆర్థిక అంచనా కోసం సెంట్రల్ వాటర్ కమిషన్కి సమర్పించింది. ఏదేమైనప్పటికీ, ప్రాజెక్ట్ 75% డిపెండబిలిటీకి వ్యతిరేకంగా 50% ఆధారపడదగిన దిగుబడిపై ప్రణాళిక చేయబడినందున ప్రాజెక్ట్ యొక్క అంచనా మరింత ముందుకు సాగలేదు. ఈ విధంగా, ఈ మంత్రిత్వ శాఖ యొక్క జాతీయ ప్రాజెక్టుల పథకం కింద చేర్చడానికి నిర్దేశించిన ప్రమాణాలను ఈఆర్సీపీ నెరవేర్చదు

అయితే, నదుల అనుసంధానం కోసం ప్రత్యేక కమిటీ, 2022 డిసెంబర్‌లో, జాతీయ దృక్పథ ప్రణాళికలో భాగంగా ఈఆర్సీపీతో అనుసంధానించబడిన సవరించిన పర్బతి, - కలిసింద్, -చంబల్ (పీకేసీ) లింక్ ప్రాజెక్ట్‌ను పరిగణనలోకి తీసుకునే ప్రతిపాదనను ఆమోదించింది అంతేకాకుండా ప్రాజెక్ట్ యొక్క మొదటి దశను ప్రాధాన్యతా ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. సవరించిన పీకేసీ లింక్ ప్రాజెక్ట్ యొక్క ముసాయిదా ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక మరియు లింక్ ప్రాజెక్ట్ యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయడానికి ఒక ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని జనవరి, 2023లో రాష్ట్రాలు మరియు కేంద్ర జల సంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్) రెండు రాష్ట్రాలకు పంపించింది. ఫిబ్రవరి, 2023లో రాష్ట్రాలతో సంయుక్త సమావేశం నిర్వహించింది మరియు డీపీఆర్సీ యొక్క లింక్ తయారీ పనిని ప్రారంభించడానికి ఫ్రేమ్‌వర్క్ చివరిగా రూపొందించబడింది.

ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***

 



(Release ID: 1942406) Visitor Counter : 100


Read this release in: English , Urdu