ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా ప్రభుత్వం పలు చర్యలు

Posted On: 24 JUL 2023 6:31PM by PIB Hyderabad

 

ఉక్కు నియంత్రణ లేని రంగం. ఉక్కు ఉత్పత్తి, దేశీయ వినియోగం మరియు ఎగుమతుల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించలేదు. ఉక్కు ఉత్పత్తి, దేశీయ వినియోగం, ఎగుమతులకు సంబంధించిన నిర్ణయాలు మార్కెట్ డిమాండ్ మరియు ఇతర వాణిజ్యపరమైన అంశాల ఆధారంగా వ్యక్తిగత ఉక్కు ఉత్పత్తిదారులచే తీసుకోబడతాయి. గత మూడు సంవత్సరాలు మరియు ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి, వినియోగం  ఎగుమతి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: -

(మిలియన్ టన్నులలో గణాంకాలు)

 

ముడి ఉక్కు

తుది ఉక్కు

సంవత్సరం

ఉత్పత్తి

ఎగుమతులు

వాస్తవ వినియోగం

2020-21

103.54

10.78

94.89

2021-22

120.29

13.49

105.75

2022-23

127.20

6.72

119.89

April-June 2023-24*

33.63

2.05

30.29

(మూలం: జాయింట్ ప్లాంట్ కమిటీ) *తాత్కాలిక

 

Sఉక్కు ఉత్పత్తి,  ఎగుమతిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు:

దేశీయ అవసరాల కోసం దేశంలోనే స్పెషాలిటీ స్టీల్ తయారీని ప్రోత్సహించడానికి మరియు మూలధన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దిగుమతిని తగ్గించడానికి రూ.6,322 కోట్లతో స్పెషాలిటీ స్టీల్ కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐపథకం నోటిఫికేషన్.

·         ఉక్కు ఉత్పత్తిదారులకు విధాన మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం కోసం 2017లో జాతీయ ఉక్కు పాలసీ నోటిఫికేషన్.

·         ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల ద్వారా మేడ్ ఇన్ ఇండియా స్టీల్ సేకరణను ప్రోత్సహించడానికి దేశీయంగా తయారు చేయబడిన ఇనుము & ఉక్కు ఉత్పత్తుల (డీఎంఐ&ఎస్.పిపాలసీ నోటిఫికేషన్.

·         దేశీయంగా ఉత్పత్తి చేయబడిన స్క్రాప్ లభ్యతను పెంచడానికి స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ విధానం యొక్క నోటిఫికేషన్.

 సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీఫగ్గన్ సింగ్ కులస్తే ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు

ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

******



(Release ID: 1942405) Visitor Counter : 84


Read this release in: English , Urdu