ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి కార్యక్రమం

Posted On: 24 JUL 2023 3:39PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి కార్యక్రమం (PM-DevINE) కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఇది నూరు  శాతం  కేంద్రప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమం. 2022-23 ఆర్థిక  సంవత్సరంలో తొలుత
1500 కోట్ల రూపాయల కేటాయింపులతో ఏడు ప్రాజెక్టులను  చేపట్టారు.
పిఎం‌‌-డిఇవి ఐఎన్ఇ పథకాన్ని కేంద్ర కేబినెట్  2022 అక్టోబర్ 12న ఆమోదించింది. 2022–23 నుంచి 2025–26 మధ్యగల నాలుగు సంవత్సరాల కాలానికి ( 15 వ ఫైనాన్స్ కమిషన్ కాలానికి  మిగిలిన సంవత్సరాలు) ఈ పథకం కింద రూ 6000 కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని చేపట్టారు.
పిఎం‌‌-డిఇవి ఐఎన్ఇ పథకం లక్ష్యం 1. గతి శక్తి స్ఫూర్తితో  గా మౌలిక సదుపాయాలను సమ్మిళితం చేయడం, 2)ఈశాన్య ప్రాంత అవసరాలకు  అనుగుణం సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతునివ్వడం,
3) యువకులు,  మహిళలకు జీవనోపాథి కార్యక్రమాలు చేపట్టడం 4) వివిధ రంగాలలో అభివృద్ధికి సంబంధించిన లోపాలను చక్కదిద్దడం. ఈ పథకం లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని 1503.44 కోట్ల రూపాయయల విలువకాగల
11 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఇందులో ఏడు  ప్రాజెక్టులు 2022–23 బడ్జెట్లో ప్రకటించినవి ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిధుల విడుదలకు ఎంపిక  చేశారు. ఇందులో 121.10 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.
2022–23 ఆర్థిక  సంవత్సరంలో ఆమోదం  పొందిన ప్రాజెక్టుల వివరాలు  ,రాష్ట్రాల వారిగా కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పథకం కింద 2023–24 లో చేపట్టే ప్రాజెక్టుల ను 2025–26 లోగా పూర్తి చేయవలసి ఉంటుంది

.

రాష్ట్రాలు, ప్రాజెక్టు వారీగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో అనుమతులు. 
 

 క్రమ

సంఖ్య

 ప్రాజెక్టు పేరు

 ప్రాజెక్టు ప్రదేశం, రాష్ట్రం

అమలు చేస్తున్న ఏజెన్సీ,

డిపార్టమెంట్

 ఆమోదించిన

మొత్తం కో.రూ.

1

 ఈశాన్య ప్రాంతం, గౌహతిలో ,పెద్దవారిలో హెమటోలింఫాయిడ్ కాన్సర్ నిరోధానికి ప్రత్యేకంగా సేవలు అందించే వ్యవస్థ ఏర్పాటు, .

.

గౌహతి– మల్టీ స్టేట్

డాక్టర్ బి.బొరూహ్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ , గౌహతి, డిపార్టమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ

 

129

2

ఎన్ఇసిటిఎఆర్ జీవనోపాథి మెరుగుదల ప్రాజెక్టు (బహుళ రాష్ట్రాలు)– అరటి బోదెలతో  విలువ ఆధారిత ఉత్పత్తులు

 

7 రాష్ట్రాలలో 12 ప్రదేశాలు:

అరుణాచల్ ప్రదేశ్ (1), అస్సాం (4), మణిపూర్ (1), మేఘాలయ (1), మిజోరం (1), నాగాలాండ్ (2), త్రిపుర (2)

ఈశాన్య ప్రాంత టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్, రిసెర్చ్

ఎన్.ఇ.సి.టి.ఎ.ఆర్,

డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ

 

67

3

ఈశాన్యప్రాంతంలో (పలు రాష్ట్రాలలో) శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం

 

మేఘాలయ, అస్సాం, త్రిపురలలో డెమో ల్యాబ్లు

 

ఈశాన్య ప్రాంత టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్, రిసెర్చ్

ఎన్.ఇ.సి.టి.ఎ.ఆర్,

డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ

45

4

పశ్చిమ సిక్కింలో పెల్లింగ్ నుంచి సంగ – చోలింగ్ పాసింజర్ రోప్వే సిస్టంకు గ్యాప్ ఫండింగ్ 63.69 కోట్ల రూపాయల వ్యవయంతో చేపట్టడం(58 శాతం). మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ108.39 కోట్లు

 

 

పశ్చిమ సిక్కిం –సిక్కిం

 

టూరిజం,పౌరవిమానయాన విభాగం, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం

64

5

దక్షిణ సిక్కింలో ధప్పెర్ నుంచి భలెయ్దుంగా వరకు పర్యావరణ హిత పాసింజర్ రోప్ వే (కేబుల్ కార్) ప్రాజెక్టు గ్యాప్ ఫండింగ్ వ్యయం రూ 57.82 కోట్లు (28 శాతం),  మొత్తం వ్యయం రూ 209.57 కోట్లు.

 

దక్షిణ సిక్కిం –సిక్కిం

టూరిజం,పౌరవిమానయాన విభాగం, గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం

58

6

పశ్చిమంవైపు ఐజ్వాల్ బైపాస్ రోడ్ నిర్మాణం

.

సిన్హ్ముయి నుంచి ఐజ్వాల్ లుంగ్లెయి రోడ్, మిజోరం వద్ద ఎన్.హెచ్ 108పై 45 కిలోమీటర్లు.

..

పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్, గవర్నమెంట్ ఆఫ్ మిజోరం

500

7

మిజోరంలో పలు జిల్లాలలో వివిధప్రాంతాలలో  వెదురు అనుసంధాన రోడ్ల నిర్మాణం.

1)తుయిరియాల్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఉత్తర చాల్ట్ లాంగ్,(18కి.మీ)వరకు 33.58 కోట్లతో ఏర్పాటు (2) లెంగ్పుయి నుంచి సైఫాల్ వెదురు తోట వరకు (41కి.మి) 66.42 కోట్లతో ఏర్పాటు

...

తుయిరియాల్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఉత్తర చాల్ట్లాంగ్, మిజోరంలోని లెంగ్పుయి నుంచి సెయిఫాల్ వరకు

.

పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్, గవర్నమెంట్ ఆఫ్ మిజోరం

100

8

న్యూషిల్లాంగ్ టౌన్షిప్లో కొత్త నాలుగు లేన్ల రోడ్ నిర్మాణం, ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్గా మార్పు

..

 న్యూషిల్లాంగ్, మేఘాలయ

డిపార్టమెంట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ మేఘాలయ

146.79

9

కామరూప్ జిల్లాలో 20 పాఠశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్పు.

 

 కామరూప్ జిల్లా , అస్సాం

పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్, 

గవర్నమెంట్ ఆఫ్ అస్సాం

132.86

10

త్రిపురలో మారుమూల ప్రాంతాలకు నమ్మకమైన విద్యుత్ సరఫరాకు వీలుగా సూక్ష్మ సౌరగ్రిడ్ ఏర్పాటు

 

 త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా 274 మారుమూల ప్రాంతాలు

 

టిఆర్ఇడిఎ, డిపార్టెమెంట్ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర

 

80.79

11

తూర్పు నాగాలాండ్ ప్రత్యేక అభివృద్ధికి 22  జీవనోపాధి ప్రాజెక్టులు

 

..

 నాగలాండ్ లో4 జిల్లాలు

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విభాగం, గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్

 

180

 

ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి లోక్సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1942404) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Manipuri , Tamil