పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

దేశీయ గ్యాస్ ఉత్ప‌త్తికి ప్రోత్సాహం

Posted On: 24 JUL 2023 6:12PM by PIB Hyderabad

ప్రభుత్వ ఆమోదిత ధ‌ర‌ల‌ను అందించే ఉత్ప‌త్తి ఒఎన్‌జిసి/ ఒఐఎల్ నియామ‌క క్షేత్రాలు, నూత‌న అన్వేష‌ణ లైసెన్సింగ్ విధానం (ఎన్ఇఎల్ పి) బ్లాకులు, ఎన్ఇఎల్‌పి ముంద‌స్తు బ్లాకులు  ప్ర‌భుత్వ ఆమోదిత ధ‌ర‌ల‌కు అనుకూల‌మైన ఉత్ప‌త్తి పంపిణీ కాంట్రాక్టుకు  (పిఎస్‌సి) సంబంధించి ఉత్ప‌త్తి చేసిన గ్యాసుకు స‌వ‌రించిన దేశీయ  స‌హజ‌వాయువు ధ‌ర‌ల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను  7.04.2023న గెజెట్ నోటిషికేష‌న్ ద్వారా  ప్ర‌భుత్వం ఆమోదించింది.  అటువంటి స‌హ‌జ వాయువు ధ‌ర భార‌తీయ క్రూడ్ బాస్కెట్ (ముడి చ‌మురు) నెల‌వారీ స‌గ‌టులో 10% ఉంటుంది. దీనిని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న నోటిఫై చేస్తారు. . త‌మ నియ‌మిత బ్లాకుల నుంచి ఒఎన్‌జిసి/ ఒఐఎల్ ఉత్ప‌త్తి చేసిన వాయువు, అడ్మిన‌స్ట‌ర్డ్ ప్రైజ్ మెకానిజం (ఎపిఎం- నియంత్రిత ధ‌ర‌ల ప‌ద్ధ‌తి) అన్న‌ది ఫ్లోర్ & సీలింగ్ (భూమి, పైక‌ప్పు)కు లోబ‌డి ఉంటుంది. కొత్త బావుల నుంచి ఉత్ప‌త్తి చేసిన గ్యాస్ లేక ఒఎన్‌జిసి/ ఒఐఎల్ నియ‌మిత క్షేత్రాల ప్ర‌మేయం ఉంటే, ఎపిఎం కంటే 20% ప్రీమియంను అనుమ‌తిస్తారు. ఈ సంస్క‌ర‌ణ‌లు గృహాల‌కు పైప్డ్ నాచుర‌ల్ గ్యాస్ (పిఎన్‌జి), ర‌వాణాకు కంప్రెస్డ్ నాచుర‌ల్ గ్యాస్ ధ‌ర‌లు చెప్పుకోద‌గిన విధంగా త‌గ్గేందుకు దారి తీశాయి. 
దేశీయ గ్యాస్ ఉత్ప‌త్తిని పెంచ‌డం కోసం భార‌త ప్ర‌భుత్వం హైడ్రోకార్బ‌న్ ఎక్స్‌ప్లోరేష‌న్ అండ్ లైసెన్సింగ్ పాల‌నీ (హెఇఎల్‌పి - హైడ్రోక‌ర్బ‌న అన్వేష‌ణ & లైసెన్సింగ్ విధానం)ని 2016 మార్చి 30న నోటిఫై చేసింది. ఉత్ప‌త్తి భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తి నుంచి రెవిన్యూ భాగ‌స్వామ్య విధానానికి మారుతున్న అన్వేషిత విస్తీర్ణాన్ని ప్ర‌దానం చేసేందుకు దీనిని ప్ర‌క‌టించింది. 
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్స‌హించేందుకు అనేక ప్ర‌క్రియ‌లు, అనుమ‌తుల‌ను స‌డ‌లించిన విధాన సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌భుత్వం 2019 ఫిబ్ర‌వ‌రి 28 నోటిఫై చేసింది.  కేట‌గిరీ  II & III వ‌ర్గ‌పు బేసిన్ల రాబ‌డి వాటాను ఆక‌స్మిక లాభాల సంద‌ర్భంలో మిన‌హా తొలిగించింది. లోతైన & అత్యంత లోతైన బ్లాకుల‌కు 7 ఏళ్ళ రాయ‌ల్టీ హాలిడేను, నీటి లోతుల్లో అన్వేష‌ణ‌కు 3.5% రాయ‌ల్టీ  రాయితీ రేటు, అత్యంత లోతైన నీటి బ్లాకులకు 1.4%, స‌హ‌జ వాయువు కోసం  మార్కెటింగ్‌, ధ‌ర‌ల స్వేచ్ఛ‌తో పాటు క్షేత్రాల తొలి మానిటైజేష‌న్ కోసం ఆర్థిక ప్రోత్సాహ‌కాల‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 
ఇంధ‌న మిశ్ర‌మంలో స‌హ‌జ‌వాయువు వాటాను ఇప్పుడు 6.7% నుంచి 2030 నాటికి 15%కి పెంచాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.  ఈ దిశ‌లో  నేష‌న‌ల్ గ్యాస్ గ్రిడ్ పైప్‌లైన్ విస్త‌ర‌ణ‌, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ (సిజిడి) నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ‌, లిక్విఫైడ్ నేచుర‌ల్ గ్యాస్ (ఎల్ఎన్‌జి) టెర్మిన‌ళ్ళ ఏర్పాటు, కంప్రెస్డ్ నేచుర‌ల్ గ్యాస్ (ర‌వాణాకి) దేశీయ గ్యాస్ కేటాయింపులు పీడ‌నం/ అధిక ఉష్ణోగ్ర‌త ప్రాంతాలు, నీటి లోతులు & నీటి లోతులు, బొగ్గు పొర‌లు, బ‌యో సిఎన్‌జిని ప్రోత్స‌హించ‌డానికి అందుబాటులో ర‌వాణా దిశ‌గా నిల‌క‌డైన ప్ర‌త్యామ్నాయం (ఎస్ఎటిఎటి) కార్య‌క్ర‌మాలు మొద‌లైన వివిధ చ‌ర్య‌లు ప్ర‌భుత్వం తీసుకుంది. 
ఈ స‌మాచారాన్ని సోమ‌వారం రాజ్య‌స‌భ‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో పెట్రోలియం & స‌హ‌జ‌వాయువుల మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి ఇచ్చారు. 

 

***



(Release ID: 1942387) Visitor Counter : 71


Read this release in: English , Urdu