రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బ్రిటీష్-కాలం నాటి కంటోన్మెంట్ పట్టణాల భావనకు నెమ్మదిగా స్వస్తి

Posted On: 24 JUL 2023 2:35PM by PIB Hyderabad

కంటోన్మెంట్లలోని సివిల్ ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న మునిసిపల్ ప్రాంతాలను నియంత్రించే మున్సిపల్ చట్టాలలో ఏకరూపతను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని కంటోన్మెంట్లలోని పౌర ప్రాంతాలను కుదించి వాటిని పొరుగున ఉన్న రాష్ట్ర మునిసిపాలిటీలతో విలీనం చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగా, 58 కంటోన్మెంట్‌లలోని పౌర ప్రాంతాల ప్రతిపాదిత ఎక్సిషన్ కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం స్వీకరిస్తోంది. రాష్ట్రాల వారీగా ఈ కంటోన్మెంట్ల జాబితా క్రింది విధంగా ఉంది:

 

క్రమ సంఖ్య 

కంటోన్మెంట్ పేరు 

రాష్ట్రం 

1

దానాపూర్ 

బీహార్ 

2

ఢిల్లీ 

ఢిల్లీ 

3

అహ్మదాబాద్ 

గుజరాత్ 

4

అంబాలా 

హర్యానా 

5

బాక్లో 

హిమాచల్ ప్రదేశ్ 

6

దాగ్షై 

హిమాచల్ ప్రదేశ్ 

7

డల్హౌసీ 

హిమాచల్ ప్రదేశ్

8

జుతోగ్ 

హిమాచల్ ప్రదేశ్

9

కసౌలి 

హిమాచల్ ప్రదేశ్

10

సుబాతు 

హిమాచల్ ప్రదేశ్

11

రామ్గఢ్ 

ఝార్ఖండ్ 

12

బెల్గామ్ 

కర్ణాటక 

13

కన్ననూర్ 

కేరళ 

14

జబల్పూర్

 

 మధ్యప్రదేశ్ 

15

మోహ్ 

మధ్యప్రదేశ్

16

మోరర్ 

మధ్యప్రదేశ్

17

పాచ్మర్హి 

మధ్యప్రదేశ్

18

సాగర్ 

మధ్యప్రదేశ్ 

19

అహ్మద్ నగర్ 

మహారాష్ట్ర 

20

ఔరంగాబాద్ 

మహారాష్ట్ర

21

దేహురోడ్డు 

మహారాష్ట్ర

22

దేవులాలీ 

మహారాష్ట్ర

23

కాంపిటీ 

మహారాష్ట్ర

24

ఖడ్కి 

మహారాష్ట్ర 

25

పూణే 

మహారాష్ట్ర

26

షిల్లాంగ్ 

మేఘాలయ 

27

అమృత్ సర్ 

పంజాబ్ 

28

ఫిరోజ్పూర్ 

పంజాబ్ 

29

జలంధర్ 

పంజాబ్ 

30

అజ్మీర్ 

రాజస్థాన్ 

31

నాసిరబాద్ 

రాజస్థాన్ 

32

సెయింట్ థామస్ మౌంట్ 

తమిళనాడు 

33

వెల్లింగ్టన్ 

తమిళనాడు 

34

సికింద్రాబాద్ 

తెలంగాణ 

35

ఆగ్రా 

ఉత్తరప్రదేశ్ 

36

అలాహాబాద్ 

 

ఉత్తరప్రదేశ్

37

బాబీనా 

 

ఉత్తరప్రదేశ్

38

బరేలీ 

 

ఉత్తరప్రదేశ్

39

అయోధ్య 

 

ఉత్తరప్రదేశ్

40

ఫతేగర్ 

 

ఉత్తరప్రదేశ్

41

ఝాన్సీ 

 

ఉత్తరప్రదేశ్

42

కాన్పూర్ 

 

ఉత్తరప్రదేశ్

43

లక్నో 

 

ఉత్తరప్రదేశ్

44

మథుర 

 

ఉత్తరప్రదేశ్

45

మీరట్ 

 

ఉత్తరప్రదేశ్

46

షాజన్పుర్ 

 

ఉత్తరప్రదేశ్

47

వారణాసి 

 

ఉత్తరప్రదేశ్

48

అల్మోరా 

ఉత్తరాఖండ్ 

49

క్లెమెంట్ టౌన్ 

ఉత్తరాఖండ్

50

డెహ్రాడూన్ 

ఉత్తరాఖండ్

51

లాండోర్ 

ఉత్తరాఖండ్

52

లాన్సడాన్ 

ఉత్తరాఖండ్

53

నైనితాల్ 

ఉత్తరాఖండ్

54

రాణిఖేత్ 

ఉత్తరాఖండ్

55

రూర్కీ 

ఉత్తరాఖండ్

56

బారాకపూర్ 

పశ్చిమ బెంగాల్ 

57

జలపహార్ 

పశ్చిమ బెంగాల్ 

58

లెబోంగ్ 

పశ్చిమ బెంగాల్ 

 

ఇప్పటికే ఒక కంటోన్మెంట్ ఖాస్యో 2023 ఏప్రిల్ 27 నుండి డీనోటిఫై అయింది. 

పౌర ప్రాంతాలను తొలగించడం, వాటిని రాష్ట్ర మునిసిపాలిటీలతో విలీనం చేయడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీల సంప్రదింపులు, సమ్మతి ఉంటుంది. అందువల్ల, దాని అమలు కోసం ఎటువంటి కాలపరిమితిని అందించడం సాధ్యం కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నుండి వివిధ ప్రతిపాదనలు వినతులు స్వీకరించడం జరిగింది. కంటోన్మెంట్ల నుండి సివిల్ ప్రాంతాలను తొలగించాలని అభ్యర్థిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా స్వీకరించాము. కంటోన్మెంట్ ప్రాంతాలలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలచే రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎటువంటి అడ్డంకులు లేవు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కంటోన్మెంట్స్‌లోని నివాసితులకు వివిధ పథకాల ప్రయోజనాలను అందజేస్తున్నాయి. ఈ సమాచారాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈరోజు రాజ్యసభలో శ్రీ జగ్గేష్‌కు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

*****


(Release ID: 1942385) Visitor Counter : 120


Read this release in: English , Urdu , Marathi , Tamil