పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఐసిఎఒ అభివృద్ధి చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స్వీక‌రించిన డిజిసిఎ

Posted On: 24 JUL 2023 2:51PM by PIB Hyderabad

ఎఫ్ యు ఎ కింద గ‌గ‌ర‌త‌లాన్నిఎఎఐ అనుకూల‌ప‌రిచిన ఫ‌లితం కర్బ‌న ఉద్గారాలు త‌గ్గాయి. 
భార‌త్ ఐసిఎఒ సభ్య‌దేశ‌మైనందున‌, 2027 నుంచి సిఒఆర్ఎస్ఐఎ ద‌శ‌కు త‌ప్ప‌నిస‌రిగా క‌ట్టుబ‌డి ఉండ‌వ‌ల‌సిన బాధ్య‌త‌ను క‌లిగి ఉంది. 
నిల‌క‌డైన విమాన‌యాన ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు, విమాన‌యాన రంగం నుంచి హరిత వాయు ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌లో -
 1) త‌న ప్ర‌మాణాలు, సిఫార్సు చేసిన ప‌ద్ధ‌తులు (ఎస్ ఎఆర్‌పి)ల ద్వారా అంత‌ర్జాతీయ పౌర విమాన‌యాన సంస్థ (ఐసిఎఒ) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం  అభివృద్ధి చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజిసిఎ అనుస‌రించి, పౌర విమాన‌యాన నిబంధ‌న‌ల (సిఎఆర్‌)ను జారీ చేసింది. 
2) విమాన‌యాన రంగంలో డీకార్బొనైజేష‌న్ ల‌క్ష్యాల‌ను సాధించ‌డం కోసం పెట్రోలియం, స‌హ‌జ‌వాయువుల మంత్రిత్వ శాఖ (ఎంఒపి & ఎన్‌జి) దేశంలో స్వ‌చ్ఛ ఇంధ‌నాల వినియోగాన్ని దేశంలో ప్రోత్స‌హించేందుకు బ‌యో-ఎటిఎఫ్ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు బ‌యో- ఏవియేష‌న్ ట‌ర్బైన్ ఫ్యూయెల్ (ఎటిఎఫ్‌) కార్య‌క్ర‌మానికి క‌మిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీ ఉల్లేఖ‌న నిబంధ‌న‌ల‌లో ముడి స‌రుకు ఉత్ప‌త్తి/  డిమాండ్‌, సాంకేతిక‌త‌, బిఐఎస్ ప్ర‌మాణాలు, ఇంజిన్ ప‌నితీరుపై ప్ర‌భావాలు త‌దిత‌రాలు ఉన్నాయి. త‌న సిఫార్సుల‌తో క‌మిటీ ఈ నివేదిక‌ను ఎంఒపి &ఎన్‌జికి  స‌మ‌ర్పించింది. 

3) సూచిత కార్య‌క‌లాపాలు క‌లిగిన నూత‌న విమానాశ్ర‌యాలు (బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌)ల ఆప‌రేట‌ర్ల‌కు, నూత‌నంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యాల డెవ‌ల‌ప‌ర్ల‌కు ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ఎసిఐ/ ఐఎస్ ఒ 14064 నియ‌మిత ధృవీక‌ర‌ణక‌ర్త‌లు) నుంచి అక్రెడిటేష‌న్ పొందేందుకు క‌ర్బ‌న్ న్యూట్రాలిటీ (క‌ర్బ‌న స‌మ‌తుల్య‌త‌)ను, నిక‌ర సున్నా ల‌క్ష్యాల‌ను సాధించే దిశ‌గా ప‌ని చేయ‌డ‌మే కాకుండా, క‌ర్బ‌న్ నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక‌ల‌తో పాటు కార్బ‌న్‌ను మితం చేసే చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 

4) ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉనికిలో ఉన్న ప్రారంభం కానున్న విమానాశ్ర‌య ప్రాజెక్టుల‌లో ఇంధ‌న సాంద్ర‌త‌ను త‌గ్గించే ల‌క్ష్యంతో ఇంధ‌న సాంద్ర‌త డేటాను  ప్ర‌చురించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ల‌కు కార్బ‌న్ న్యూట్రాలిటీ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ప్ర‌వేశ/  నియామ‌క‌ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో భాగంగా శిక్షణా మాడ్యూల్‌ను సృష్టించింది. 

5) భార‌త‌వైమానిక ద‌ళంతో సంప్ర‌దించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్లెక్సిబుల్ యూజ్ ఆఫ్ ఎయిర్‌స్పేస్ ( గ‌గ‌న‌త‌లాన్ని స‌ర‌ళంగా వినియోగంచ‌డం) కింద గ‌గ‌న‌త‌ల వినియోగాన్ని అనుకూలం చేసింది. ఫ‌లితంగా క‌ర్బ‌న (సిఒ2) ఉద్గారాలు త‌గ్గాయి. 

6) ఐసిఎఒ ఆకాంక్షిత ల‌క్ష్య‌మైన క‌ర్బ‌న త‌ట‌స్త వృద్ధిని 2020 నుంచి సాధించేందుకు, ఐసిఎఒ అంత‌ర్జాతీయ విమాన‌యాన నుంచి క‌ర్బ‌న ఉద్గారాల‌ను త‌గ్గించేందుకు క‌ర్బ‌న ఆఫ్ సెట్టింగ్ త‌గ్గింపు ప‌థ‌కాన్ని (సిఒఆర్ఎస్ఎఐ_ కోసం మార్కెట్ ఆధారిత ప్ర‌మాణాల కార్బ‌న్ ఆఫ్ సెట్టింగ్ త‌గ్గింపు ప‌థ‌ఖాన్ని స్వీక‌రించింది. అంత‌ర్జాతీయ పౌర విమాన‌యాన సంస్థ (ఐసిఎఒ)లో స‌భ్య‌దేశంగా ఉన్న భార‌త‌దేశం 2027 నుంచి సిఒఆర్ఎస్ఎఐ త‌ప్ప‌నిస‌రి అవ‌స్థ‌ను పాటించాల్సిన బాధ్య‌త‌ను క‌లిగి ఉంది. 
ఈ స‌మాచారాన్ని పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి జ‌న‌ర‌ల్ (డాక్ట‌ర్‌) వి.కె. సింగ్ (రిటైర్డ్‌) రాజ్య‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు సోమ‌వారం లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధాన‌మిస్తూ వివ‌రించారు. 

 

***


(Release ID: 1942305) Visitor Counter : 94


Read this release in: English , Urdu , Tamil