బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి గతిశక్తి, జాతీయ లాజిస్టిక్‌ విధానంపై తూర్పు జోనల్‌ సదస్సు

प्रविष्टि तिथि: 24 JUL 2023 2:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి గతిశక్తి, జాతీయ లాజిస్టిక్‌ విధానంపై తూర్పు జోనల్‌ సదస్సు 16.02.2023లో భువనేశ్వర్‌ లో జరిగింది. ఈ సదస్సు లక్ష్యం, లాజిస్టిక్స్‌ మౌలికసదుపాయాల రంగంలో సమన్వయంతో కూడిన అభివృద్ధిని సాధించడం, సమీకృత ప్రణాళిక, వివిలలధ మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాలు, రాష్ట్రాలు పరిశ్రమలను సమన్వయ పరచడం. అందులోనూ ప్రత్యేకించి ఒడిషా, జార్ఖండ్‌ , పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధచూపడం దీని లక్ష్యం .అలాగే లాజిస్టిక్‌ సమర్దత పెంపు, లాజిస్టిక్‌ల ఖర్చు తగ్గింపు కూడా ఇందులో ఉంది.
పి.ఎం. గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ పోర్టల్‌ అనేది ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫారం. దీనిని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఒడిషా, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమీకృత ప్రణాళిక, సమన్వయం, దేశంలో మౌలికసదుపాయాల ప్రాజెక్టుల అనుసంధానత ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ సమాచారాన్నఇ కేంద్ర బొగ్గు,గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 1942300) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Bengali , Tamil , Kannada