పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
జూలై 1, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషేధించబడ్డాయి
Posted On:
24 JUL 2023 4:54PM by PIB Hyderabad
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 12 ఆగస్టు 2021న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నియమాలు, 2021ని 12 జూలై 2021న నోటిఫై చేసింది, ఈ క్రింది గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతులు, నిల్వలు, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది.
(i) ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్‌లకు ప్లాస్టిక్ కర్రలు, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి పుల్లలు, ఐస్‌క్రీం పుల్లలు, అలంకరణ కోసం పాలీస్టైరిన్ [థర్మోకోల్];
(ii) ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, గడ్డి, ట్రేలు, స్వీట్ బాక్స్‌ల చుట్టూ ఫిల్మ్‌లు చుట్టడం లేదా ప్యాకింగ్ చేయడం, ఆహ్వానం కార్డులు మరియు సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ లేదా పీ వీ సీ బ్యానర్లు, స్టిరర్లు వంటి కత్తిపీటలు.
31 డిసెంబర్ 2022 నుండి నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని కూడా నోటిఫికేషన్ నిషేధిస్తుంది.
1 జూలై 2022 నుండి నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లపై భారత ప్రభుత్వ కెమికల్ మరియు పెట్రోకెమికల్స్ విభాగం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా గుర్తించబడ్డాయి.
ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఉత్పత్తిదారు అదనపు బాధ్యతలను మార్గదర్శకాలు జారీచేయబడింది. గుట్కా, పొగాకు మరియు పాన్ మసాలా నిల్వ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి లేదా విక్రయించడానికి ప్లాస్టిక్ మెటీరియల్‌ని ఉపయోగించే సాచెట్‌లు మరియు స్వీట్ బాక్స్‌లు, ఇన్విటేషన్ కార్డ్‌లు మరియు సిగరెట్ ప్యాకెట్‌ల చుట్టూ ఫిల్మ్‌లు చుట్టడం లేదా ప్యాకింగ్ చేయడం వంటివి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం నిషేధించబడ్డాయి.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు దిగుమతిని నియంత్రించడానికి, మానవ వినియోగానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి మరియు దానితో అనుసంధానించబడిన లేదా దానికి సంబంధించిన విషయాల కోసం సైన్స్ ఆధారిత ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్, 2018ని నోటిఫై చేసింది. ఇది ప్లాస్టిక్‌లతో సహా వివిధ ఆహార ప్యాకేజింగ్ వస్తువులకు సాధారణ మరియు నిర్దిష్ట అవసరాలను నిర్దేశిస్తుంది. కాగితం, గాజు, లోహాలు మరియు ప్లాస్టిక్ పదార్థాలు, ఆహార పదార్థాలను ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించినట్లయితే, ఉత్తమ తయారీ పద్ధతులు మరియు వివిధ జాతీయ/అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలని కూడా ఈ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇంకా ప్లాస్టిక్ ఆధారిత ప్యాకేజింగ్ వస్తువులు సూచించిన స్థూల మైగ్రేషన్ పరిమితులు మరియు నిర్దిష్ట మైగ్రేషన్ పరిమితులను దాటడం అవసరం.
ఆహార మరియు పానీయాల పరిశ్రమ వారి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ క్రింది నియంత్రణ చర్యలు తీసుకుంది:- (i) వెదురును ఆహార సంపర్క పదార్థంగా ఉపయోగించడం కోసం మార్గదర్శకాలను జారీ చేసింది; (ii) కొన్ని షరతులకు లోబడి హోటల్ ప్రాంగణంలో సొంత ఉపయోగం కోసం పేపర్-సీల్డ్ పునర్వినియోగ గాజు సీసాలలో తాగునీటిని అందించడానికి అనుమతించబడింది; (iii) కృత్రిమంగా తియ్యటి పానీయాల ప్యాకేజింగ్ కోసం తిరిగి వచ్చే సీసాల వాడకంపై పరిమితిని తొలగించారు; (iv) త్రాగునీటి ప్యాకేజింగ్ సమయంలో పెట్ సీసాలలో ద్రవ నైట్రోజన్ డోసింగ్ వాడకాన్ని అనుమతించారు; (v) ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌లు కాకుండా తాగునీటిని ప్యాకేజింగ్ చేయడానికి ఇతర ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఉపయోగించడానికి అనుమతించబడింది; (vi) ఈట్ రైట్ ఇండియా చొరవలో భాగంగా నేలలో కలిసి పోయే ప్యాకేజింగ్‌ను ప్రోత్సహించింది. ఫుడ్ బిజినెస్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని తగ్గించేందుకు ప్రోత్సహించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార సంపర్క సందర్భాలలో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై ఈ పీ ఆర్ మార్గదర్శకాలు ఘన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను సూచించిన నిబంధనలకు లోబడి తిరిగి ఉపయోగించడాన్ని తప్పనిసరి చేస్తాయి. ఈ పీ ఆర్ మార్గదర్శకాలు సుస్థిరమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తాయి. తద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది. అంతేకాకుండా, నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్టార్టప్‌లు మరియు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం “ఇండియా ప్లాస్టిక్ ఛాలెంజ్ - హ్యాకథాన్ 2021” నిర్వహించింది. ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ మెటీరియల్‌ని అభివృద్ధి చేసిన రెండు స్టార్టప్‌లకు అవార్డు లభించింది. ఒక స్టార్టప్ వరి గడ్డి వ్యర్థాల నుండి థర్మాకోల్‌కు పూర్తిగా బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసింది. ఇతర స్టార్టప్ సముద్రపు నాచుని ఉపయోగించి ప్యాకేజింగ్ మెటీరియల్‌ని అభివృద్ధి చేసింది.
కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పాలుపంచుకుంది. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 5 ఏప్రిల్ 2022న ప్రకృతి మస్కట్‌ను ప్రారంభించింది. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ల తొలగింపుపై ప్రకృతి మూడు వీడియోలు రూపొందించారు. ఈ వీడియోలు 19 భాషల్లోకి అనువదించారు. రాష్ట్రాలు మరియు యూ టీ ల భాగస్వామ్యం తోదీనిపై విస్తృత ప్రచారం, లబ్దిదారుల ఉపయోగం కోసం అన్ని అంశాలతో సమాచార సామగ్రి , వీడియోలతో కూడిన వెబ్‌పేజీ రూపొందించారు. నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు పర్యావరణ ప్రత్యామ్నాయాలపై నేషనల్ ఎక్స్‌పో మరియు స్టార్టప్‌ల కాన్ఫరెన్స్ - 2022 ను తమిళనాడు ప్రభుత్వంతో కలిసి 26-27 సెప్టెంబర్ 2022న చెన్నైలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 150 మందికి పైగా పర్యావరణ ప్రత్యామ్నాయాల తయారీదారులు ఎక్స్‌పోలో పాల్గొన్నారు. కొబ్బరి, బగాస్, బియ్యం మరియు గోధుమ ఊక, మొక్క మరియు వ్యవసాయ అవశేషాలు, అరటి మరియు అరేకా ఆకులు, జనపనార మరియు వస్త్రం వంటి పలు పర్యావరణ ప్రత్యామ్నాయాలు తయారు చేయబడ్డాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1942297)
Visitor Counter : 163