కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఉద్యోగుల భవిష్య నిధి పథకం
Posted On:
24 JUL 2023 4:13PM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్యనిధి మరియు ఇతర నిబంధనల (ఈపీఎఫ్ అండ్ ఎంపీ ) చట్టం, 1952 కింద రూపొందించబడిన మూడు పథకాల్లో ఉద్యోగుల భవిష్య నిధి ( ఈపీఎఫ్) పథకం, 1952 ఒకటి. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పథకం జరుగుతోంది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేస్తూ నెలకు 15,000 రూపాయల వరకు వేతనం పొందుతున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈపీఎఫ్ లో చేరాల్సి ఉంటుంది. ప్రాథమిక వేతనాలు, కరువు భత్యం మరియు రిటైనింగ్ అలవెన్స్ ఏదైనా ఉంటే దానిని కలుపుకుని వేతనంలో 12% మొత్తాన్ని ఈపీఎఫ్ లో జమ చేయాల్సి ఉంటుంది. యజమాని కూడా 12% వేతనాన్నితన వాటాగా జమ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉండే ట్రస్టీల బోర్డుఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహిస్తుంది. నిర్వహించబడుతుంది.
పథకం నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ సభ్యత్వం కలిగిన ప్రతి ఉద్యోగి ఉపసంహరణ, వివిధ ప్రయోజనాల కోసం (అంటే నివాస గృహం కొనుగోలు/నిర్మాణం, అనారోగ్యం, విద్య, వివాహం, కోవిడ్-19 మొదలైనవి) అడ్వాన్స్‌ల ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం అతని/ఆమె తాము చెల్లించిన మొత్తంపై వడ్డీ పొందుతారు.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వారీగా (ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్, ప్రయాగ్‌రాజ్ జిల్లా, మహారాష్ట్రలోని రత్నగిరి మరియు సింధుదుర్గ్ జిల్లాల వివరాలతో సహా) ఉద్యోగుల వివరాలు (యూనివర్సల్ ఖాతా నంబర్‌లు గత ఏడాది వేతన నెల జూలై, 2022 నుంచి జూన్, 2023 వరకు కనీసం ఒక్కసారైనా మొత్తం జమ చేసిన, నిష్క్రమించని ) అనుబంధంలో అందించడం జరిగింది.
ఈపీఎఫ్ పథకం, 1952 లో చేరడానికి వేతన పరిమితి ఎప్పటికప్పుడు సవరించబడుతుంది. 01.09.2014 నుంచి పరిమితి నెలకు రూ.15000/-గా ఉంది.
ఈపీఎఫ్ పథకం 1952లోని పేరా 72(6) ప్రకారం, కొన్ని ఖాతాలు అమలులో లేని ఖాతాలుగా వర్గీకరించబడ్డాయి. అయితే, అటువంటి పని చేయని ఖాతాలన్నింటికీ ఖచ్చితమైన హక్కుదారులు ఉంటారు. 31.03.2022 నాటికి అమలులో లేని ఖాతాల్లో మొత్తం రూ. 4962.70 కోట్లు నిల్వలు ఉన్నాయి.
అనుబంధం
లోక్‌సభలో 24.07.2023న డాక్టర్ సంఘమిత్ర మౌర్య, శ్రీ సంజయ్ జాదవ్, శ్రీమతి కేశరీ దేవి పటేల్ ' ఈపీఎఫ్ పథకం'పై నక్షత్రం లేని ప్రశ్న నం. 586కి ఇచ్చిన సమాధానం పార్ట్‌లు (బి) & (సి) లకు సంబంధించిన వివరాలు అనుబంధంలో పొందుపరచబడ్డాయి.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వారీగా (ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ , ప్రయాగ్‌రాజ్ జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి మరియు సింధుదుర్గ్ జిల్లాల వివరాలతో సహా) ఈపీఎఫ్ లో రెగ్యులర్ ప్రాతిపదికన విరాళాలు అందజేస్తున్న ఉద్యోగుల వివరాలు ( గత ఏడాది వేతన నెల జూలై, 2022 నుంచి జూన్, 2023 వరకు కనీసం ఒక్కసారైనా మొత్తం జమ చేసిన యూనివర్సల్ ఖాతా నంబర్‌లు)
|
క్ర.సం. నం.
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
ఉద్యోగులు
|
1
|
అండమాన్ మరియు నికోబార్ దీవులు
|
20240
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1500966
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
11642
|
4
|
అస్సాం
|
361954
|
5
|
బీహార్
|
1163720
|
6
|
చండీగఢ్
|
594835
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
656683
|
8
|
దాద్రా , నగర్ హవేలి
|
165025
|
9
|
డామన్ మరియు డయ్యూ
|
109811
|
10
|
ఢిల్లీ
|
4007063
|
11
|
గోవా
|
250279
|
12
|
గుజరాత్
|
4187709
|
13
|
హర్యానా
|
3617407
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
435518
|
15
|
జమ్మూ, కాశ్మీర్
|
194754
|
16
|
జార్ఖండ్
|
690022
|
17
|
కర్ణాటక
|
7537917
|
18
|
కేరళ
|
1249560
|
19
|
లడఖ్
|
2356
|
20
|
లక్షదీవులు
|
40
|
21
|
మధ్యప్రదేశ్
|
1453179
|
22
|
మహారాష్ట్ర
|
13431905
రత్నగిరి (37782) & సింధుదుర్గ్ (8422)
|
23
|
మణిపూర్
|
16924
|
24
|
మేఘాలయ
|
41049
|
25
|
మిజోరం
|
4234
|
26
|
నాగాలాండ్
|
11224
|
27
|
ఒడిశా
|
1091497
|
28
|
పుదుచ్చేరి
|
132719
|
29
|
పంజాబ్
|
851871
|
30
|
రాజస్థాన్
|
1725304
|
31
|
సిక్కిం
|
30711
|
32
|
తమిళనాడు
|
6530368
|
33
|
తెలంగాణ
|
3966619
|
34
|
త్రిపుర
|
33572
|
35
|
ఉత్తర ప్రదేశ్
|
3145415
బదౌన్(4287), ప్రయాగ్‌రాజ్(76790)
|
36
|
ఉత్తరాఖండ్
|
734969
|
37
|
పశ్చిమ బెంగాల్
|
3264085
|
|
మొత్తం
|
63223146
|
ఈ సమాచారాన్ని కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ. లోక్‌సభలో రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానంలో అందజేశారు.
***
(Release ID: 1942284)
Visitor Counter : 110