పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రపంచ జీవ ఇంధన కూటమిపై ప్రత్యక మంత్రివర్గ సంప్రదింపులు, సిఫార్సులు
Posted On:
22 JUL 2023 9:59PM by PIB Hyderabad
ఇంధన పరివర్తన మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యతా అంశాలలో ఒకదానిగా భవిష్యత్తుకు ఇంధనాలను (3ఎఫ్)ను పట్టి చూపింది. ఈ నేపథ్యంలో, ఇంధన పరివర్తన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ప్రపంచ జీవ ఇంధన సమాశ్రయం కోసం సంప్రదింపులు, సిఫార్సుల కోసంప్రత్యేక కార్యక్రమాన్ని 22జులై 2023న గోవాలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జి20లో ఉన్న దేశాలు, ఆవల ఉన్న దేశాల నుంచి కూడా బలమైన మద్దతును పొందింది.
ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పదిహేను దేశాలు, తొమ్మిది అంతర్జాతీయ సంస్థలతో కూటమిలో ప్రారంభ సభ్యులుగా ఉండేందుకు పందొమ్మిది దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. బహుళ వాటాదారుల ప్రపంచ కూటమి ద్వారా జీవ ఇంధనాల అభివృద్ధి, విస్తరణను ముందుకు తీసుకువెళ్ళడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
జీబిఎ కార్యక్రమంలో పదమూడు దేశాలకు చెందిన ఇంధన మంత్రులు, తొమ్మిది అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన భారత్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, కెనెడా, ఇటలీ, కెన్యా, మారిషస్, పరాగ్వే, సీషెల్స్, యునైటెడ్ స్టేట్స్, యుఎఇ, ఉగాండాతో పాటుగా బయో ఫ్యూచర్ ప్లాట్‌ఫాం వంటి అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, అంతర్జాతీయ ఇంధన ఫోరం, అంతర్జాతీయ పునారవృత ఇంధన ఏజెన్సీ, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ బయోగ్యాస్ అసోసియేషన్, ప్రపంచ ఆర్ధిక ఫోరం ఈ చొరవను ఆహ్వానించాయి.
జీవ ఇంధనాలు & భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ, ప్రపంచ జీవ ఇంధన కూటమి నిజమైన విజయం ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి ప్రజల కోసం ప్రాజెక్టుగా ముందుకు తీసుకువెళ్ళడంపై ఆధారపడి ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు & పట్టణ & గృహ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ అన్నారు. అనేక ఇతర దేశాలకు చెందిన మంత్రులు కూడా తక్కువ కార్బన్‌కి మార్గంగా జీవ ఇంధనాల అపీల్ ను పట్టి చూపుతూనే, స్వచ్ఛమైన ఇంధన చొరవలలో నిమగ్నమవ్వవలసిన కీలక అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధికి కీలకమైన స్వల్ప కార్బన్ మార్గంగా జీవ ఇంధనాలకు భారీ సంభావ్యత ఉన్నప్పటికీ, వాటి స్వీకరణకు అనేక సవాళ్ళు ఆటంకంగా ఉన్నాయని నాయకులు పట్టి చూపారు.
తమ జీవ ఇంధనాల ప్రయాణంలో ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటును అమెరికా గుర్తించిందని, అది టెస్ట్ ట్యూబ్ బేబీ నుంచి టెస్ట్ డ్రైవ్ & క్షేత్రం నుంచి ఇంధనాలకు పయనించేందుకు ఎదురు చూస్తున్నామని ఎస్ ఇంధన మంత్రి జెన్నిఫర్ గ్రాన్‌హోం పేర్కొన్నారు.
నిలకడైన ఇంధన అవసరాలను తీర్చేందుకు అనేక రూపాలలో ఇంధనం అవసరమని, ఈ నేపథ్యంలో కూటమి ప్రాముఖ్యతను బ్రెజిల్ గనులు, ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ అలెగ్జాండ్రా సిల్వేరియా డి క్లివేరా బలపరిచారు.
బ్రెజిల్, ఇటలీ, కెన్యా, యుఎఇ సహా పలు దేశాలు విధాన, సాంకేతికత, అమలులో ఉత్తమ కార్యాచరణలను పంచుకోవలసిన ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు.
ఫీడ్ స్టాక్ (పారిశ్రామిక ప్రక్రియలకు ఇంధనాన్ని అందించడం) నిర్వహణ, ప్రమాణాల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన సవాళ్ళను అధిగమించేందుకు ఒక సమన్వయ పద్ధతి అవసరమని గుర్తిస్తూ, ప్రపంచ కూటమిని సృష్టించేందుకు భారతీయ అధ్యక్షత చేపట్టిన చొరవను ఫోరం ఆహ్వానించింది.
ఐఇఎ, ఐఇఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇతర దేశాలకు జీవ ఇంధనాల విస్తార సంభావ్యతను బలోపేతం చేసి, ప్రమాణీకరణ, వ్యర్ధాల రీసైక్లింగ్, ఇంకా వినియోగంలోకి రాని సంభావ్యతలపై పెట్టుబడుల ప్రాముఖ్యతను పట్టి చూపాయి.
అన్ని శిలాజ ఇంధనాలను భర్తీ చేయడానికి 600 బిలియన్ లీటర్ల ఎస్ఎఎఫ్‌లు అవసరమని, దీనికి 2050 నాటికి 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల కు పైగా అవసరమవుతాయని ఐసిఎఒ నొక్కి చెప్పింది. దీనికి వాటాదారుల మధ్య సన్నిహిత సహకారం అవసరం.
ప్రస్తుతం 2% వ్యర్ధాలు మాత్రమే రీసైకిల్ చేయడం జరుగుతుండగా, వినయోగించదగిన ఉత్పత్తులకు రీసైక్లింగ్ లేకపోవడం అన్నది మిథేన్ ఉద్గారాలకు దోహదపడుతుందని ప్రపంచ బయోగ్యాస్ అసోసియేషన్ పట్టి చూపింది. ఈ కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్టు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రకటించాయి.
ఈ సంప్రదింపుల ప్రక్రియ ఫలితంగా ఇంధన మంత్రులు జి 20 నాయకులు జిబిఎ ఏర్పాటుకు సిఫార్సు చేశారు.
***
(Release ID: 1941842)
Visitor Counter : 113