రక్షణ మంత్రిత్వ శాఖ
వియత్నాంలో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పర్యటన
Posted On:
22 JUL 2023 10:33AM by PIB Hyderabad
వియత్నాంలో అధికార పర్యటనలో ఉన్న నావికదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారతీయ నావికాదళ ఓడ కిర్పాణ్‌ను డీకమిషనింగ్ చేసి, తదనంతరం వియత్నాం పీపుల్స్ నేవీ (విపిఎన్)కు అప్పగించే కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమం వియత్నాంలో 22జులై 2023న కామ్ రాన్‌లో నిర్వహిస్తున్నారు.
దేశీయంగా నిర్మించిన అంతర్గత క్షిపణులు కలిగిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిర్పాణ్‌ను భారతీయ నావికాదళం నుంచి వియత్నాం పీపుల్స్ నేవీకి బదిలీ చేయడం అన్నది భావసారూప్యత కలిగిన భాగస్వాములు తమ శక్తి సామర్ధ్యాలను పెంచుకోవడంలో తోడ్పడాలన్న భారత్ నిబద్ధతను ప్రతిఫలిస్తుంది. అంతేకాకుండా, భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ విధానానికి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ (SAGAR - ప్రాంతంలోని అందరి భద్రత, వృద్ధి) అన్న విధానాలకు అనుగుణంగా ఉంది. పూర్తిస్థాయిలో పని చేస్తున్న యుద్ధ నౌకను స్నేహపూర్వకంగా ఉన్న విదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇది తొలిసారి.
దేశీయంగా నిర్మించిన ఖుక్రీ వర్గపు క్షిపణి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిర్పాణ్‌ను రక్షణ మంత్రి 19 జూన్ 2023న వియత్నాంకు క్షిపణులతో కూడిన యుద్ధ నౌకను కానుకగా ఇస్తామంటూ చేసిన ప్రకటనకు అనుగుణంగా విపిఎన్‌కు అందచేస్తున్నారు. దీనిని అమలు చేసేందుకు, ఐఎన్ఎస్ కిర్పాణ్ తన అంతిమ ప్రయాణాన్ని భారత్ నుంచి 28 జూన్ 2023న త్రివర్ణపతాకం కింద బయలుదేరి 08 జులై 2023న వియత్నాంలోని కామ్ రాన్‌ను చేరుకుంది.
అడ్మిరల్ ఆర్. హరికుమార్ హాయ్ ఫోంగ్‌లోని వియత్నాం పీపుల్స్ నేవీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, వైస్ అడ్మిరల్ ట్రాన్ థాన్ ఘీం, సిఐఎన్‌సి, వియత్నాం పీపుల్స్ నేవీని కలుసుకుని ద్వైపాక్షిక సంభాషణలను నిర్వహిస్తారు. దానితో పాటుగా వియత్నాం దేశ రక్షణ మంత్రిని కూడా మర్యాదపూర్వకంగా కలువనున్నారు.
భారతీయ నావికాదళం, వియత్నాం పీపుల్స్ నేవీ మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక రక్షణ కార్యకలాపాలను, ఈ ప్రాంతంలో ఎసిఇఎఎన్ (ASEAN) కేంద్రీకరణను భారత్ గుర్తిస్తున్న విషయానికి సిఎన్ఎస్ పర్యటన సంకేతాలనిస్తోంది.
***
(Release ID: 1941803)
Visitor Counter : 161