ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్ర ఆరోగ్య నిధికి సంబంధించిన అప్‌డేట్


దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద రోగులకు ఏదైనా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు / ఇన్‌స్టిట్యూట్‌లలో చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది

Posted On: 21 JUL 2023 5:44PM by PIB Hyderabad

రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్..)  అనేది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద రోగులకు మరియు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ మొదలైన వాటికి సంబంధించిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఒకే గొడుకు కింద ఏదైనా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు/ఇన్‌స్టిట్యూట్‌లలో చికిత్స కోసం ఒకేసారి ఆర్థిక సహాయం అందించే కేంద్ర రంగ పథకం. రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం క్రింది విధంగా మూడు భాగాలను కలిగి ఉంది:

రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్) - సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులు/ఇన్‌స్టిట్యూట్‌లలో గుండె, మూత్రపిండాలు, కాలేయం మొదలైన వాటికి సంబంధించిన ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు గరిష్టంగా 15 లక్షల రూపాయల దాకా ఆర్థిక సాయం అందిస్తారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖ యొక్క క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (హెచ్ఎంసీపీఎఫ్) - ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు (ఆర్సీసీలు)/ తృతీయ సంరక్షణ క్యాన్సర్ కేంద్రాలు (టీసీసీసీలు) మరియు రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు (ఎస్సీఐలు)లో క్యాన్సర్ చికిత్సకు గరిష్టంగా  15 లక్షల రూపాయల దాకా ఆర్థికసాయం అందిస్తారు.

అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పేద రోగులకు ఆర్థిక సహాయం.. - సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రులు/ఇన్‌స్టిట్యూట్‌లలో చికిత్స కోసం పేర్కొన్న అరుదైన వ్యాధుల కోసం గరిష్టంగా 20 లక్షల రూపాయల దాకా ఆర్థికసాయం అందిస్తారు.

రాష్ట్రీయ ఆరోగ్య నిధి యొక్క స్కీమ్ గురించి మరింత సమాచారాన్ని https://main.mohfw.gov.in/Major-Programmes/poor-patients-financial-support లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

పేద మరియు బలహీనవర్గాల్లో అర్హులైన కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై)  పథకం సంవత్సరానికి 5 లక్షల రూపాయల దాకా ఆరోగ్య రక్షణను అందిస్తుంది.  భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎంప్యానెల్ ఆసుపత్రులలో సెకండరీ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి మరింత సమాచారాన్ని https://pmjay.gov.inలో లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఈ మేరకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు

 

***


(Release ID: 1941682) Visitor Counter : 180


Read this release in: English , Urdu