నాడు పోస్టు చేయడమైనది:
21 JUL 2023 4:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) కింద 2016-17 నుంచి 2022-23 వరకు బీమా కంపెనీలు, అవి చెల్లించిన క్లెయిములు, బీమా కంపెనీలు సేకరించిన స్థూల ప్రీమియం వివరాలు సంవత్సరాల వారీగా, కంపెనీలవారీగా, రాష్ట్రాల వారీగా అనెక్చర్‌లో ఇవ్వడం జరిగింది.
ఆమోదయోగ్యమైన క్లెయిముల గనణ కోసం పంట దిగుబడి/ పంట నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధించిన అన్ని ప్రధాన పనులను సంబంధిత రాష్ట్రప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో కూడిన తో కూడిన జాయింట్ కమిటీ నిర్వహిస్తుంది. అయితే, పిఎంఎఫ్‌బివై అమలు సందర్భంలో క్లెయిముల చెల్లింపులు చేయకపోవడం, చెల్లింపులలో జాప్యం గులరించి కొన్ని బీమా కంపెనీలపై ఫిర్యాదులు, బ్యాంకులు బీమా ప్రతిపాదనలను తప్పుగా / ఆలస్యంగా ఇవ్వడం వల్ల తక్కువ క్లెయిముల చెల్లింపులు; దిగుబడి డేటాలో వ్యత్యాసం & రాష్ట్ర ప్రభుత్వం, బీమా కంపెనీల మధ్య అనంతర వివాదాలు; రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను అందించడంలో జాప్యం, బీమా కంపెనీలలో తగినంతమంది సిబ్బందిని నియమించకపోవడం తదితర ఫిర్యాదులు గతంలో దేశవ్యాప్తంగా అందుకోవడం జరిగింది. అనేక ఫిర్యాదులను తగినవిధంగా పరిష్కరించడం జరిగింది.
పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కనుక, బీమా చేసుకున్న రైతుల క్లెయిములకు సంబంధించిన ఫిర్యాదులు/ ఇబ్బందులను పరిష్కరించేందుకు సవిరించిన పథకపు కార్యాచరణ మార్గదర్శకాలలో స్తరీకరించిన ఫిర్యాదుల పరిష్కార మెకానిజం, అంటే జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీ (డిజిఆర్‌సి), రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీ (ఎస్‌జిఆర్‌సి)లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలకు ఫిర్యాదులు/ ఇక్కట్లు వినేందుకు నిర్ణీత ప్రకారం వాటిని పరిష్కరించేందుకు కార్యాచరణ మార్గదర్శకాలలో వివరించిన విధంగా వివరణాత్మక ఆదేశం ఇవ్వడం జరిగింది.
***