ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డిజిటల్ హెల్త్‌కేర్ మెకానిజంపై నవీకరణ


ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏ బీ హెచ్ ఏ యాప్, ఆరోగ్య సేతు యాప్ వంటి వివిధ అప్లికేషన్‌ల ద్వారా డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికి మద్దతు ఇస్తుంది.

Posted On: 21 JUL 2023 5:46PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించబడింది, ఇది  సమర్థవంతమైన, అందుబాటులో, సమ్మిళితమైన, సరసమైన, సకాలంలో మరియు సురక్షితమైన పద్ధతిలో సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి మద్దతు ఇస్తుంది. డిజిటల్ విభజనను తగ్గించడానికి దేశంలోని సమగ్ర డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన ఆధారత ను అభివృద్ధి చేయడం ఈ మిషన్ లక్ష్యం. ఇది పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా హార్డ్‌వేర్ లేదా రెండూ సమస్యలు ఉన్న ప్రాంతాల కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) సృష్టి కోసం సహాయక & ఆఫ్‌లైన్ మోడ్‌ను అందిస్తుంది. డిజిటల్ అక్షరాస్యత లోపాన్ని పరిష్కరించడానికి ఆభా యాప్, ఆరోగ్య సేతు యాప్ వంటి వివిధ అప్లికేషన్లు బహుళ భాషలలో  ఉపయోగించడానికి సులభతరం గా వుంటాయి.

 

హెల్త్-టెక్ స్టార్టప్‌ల ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) హెల్త్ టెక్ స్టార్టప్‌లతో సహా అన్ని డిజిటల్ ఆరోగ్య సేవా సంస్థలు బహిరంగ ప్రమాణాలను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పరిష్కారాలను ఏ బీ డీ ఎం పర్యావరణ వ్యవస్థకు అనుసంధానించడానికి ప్రభుత్వం ఏ బీ డీ ఎం శాండ్‌బాక్స్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్, మైక్రోసైట్‌లు, ఫార్మసీలు మరియు ల్యాబొరేటరీలతో సహకారం వంటి వివిధ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. డిజిటల్ హెల్త్‌ను వేగవంతం చేయడానికి, ముఖ్యంగా స్టార్టప్‌లతో సహా ప్రైవేట్ రంగంపై దృష్టి సారించింది.

 

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ఎకోసిస్టమ్‌లో పాల్గొనేవారు/లబ్దిదారులు అనుసరించాల్సిన గోప్యత మరియు డేటా రక్షణ కోసం కనీస ప్రమాణాలకు మార్గదర్శక పత్రంగా హెల్త్ డేటా మేనేజ్‌మెంట్ పాలసీ (HDM పాలసీ)ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 14 డిసెంబర్ 2020న విడుదల చేసింది.  హెల్త్ డేటా మేనేజ్‌మెంట్ పాలసీలో వ్యక్తి అనుమతి లేకుండా ఏ ఇతర సంస్థతోనూ డేటా షేర్ చేయరాదని నిర్దేశిస్తుంది.

 

ఏ బీ డీ ఎం యొక్క ప్రభావవంతమైన అమలును నిర్ధారించడానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/ యూ టీ లకు మానవ వనరులు, సమాచార విద్య & కమ్యూనికేషన్ (IEC), మరియు సౌకర్యాలు/ఆరోగ్య నిపుణులకు అవసరమైన చేయూత మద్దతుతో సహా సామర్థ్యం పెంపుదల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరియు ఏ బీ డీ ఎం పర్యావరణ వ్యవస్థ క్రింద ఆరోగ్య కార్యక్రమాలు/పరిష్కారాలను ఆరోగ్య డిజిటల్‌ ఏకీకృతం చేస్తుంది. దేశవ్యాప్తంగా హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) మరియు టెలిమెడిసిన్ సేవల వంటి ఐ టీ సేవల అమలు కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద అన్ని రాష్ట్రాలు/యూ టీ లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తుంది.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1941595) Visitor Counter : 130


Read this release in: English , Urdu