వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎం-కిసాన్ యోజన అమలు
Posted On:
21 JUL 2023 4:08PM by PIB Hyderabad
గృహ అవసరాలు సహా వ్యవసాయ, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చుల కోసం కొన్ని మినహాయింపు ప్రమాణాలకు లోబడి దేశవ్యాప్తంగా సేద్యం చేయదగిన భూములను కలిగి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం- కిసాన్). ఈ పథకం కింద వార్షికంగా మూడు సమాన విడతలలో రూ. 2000/- చొప్పున రూ. 6000ను ఆధార్ అనుసంధానిత రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్షంగా బదిలీ చేస్తారు.
పిఎం- కిసాన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి సరైన, ధృవీకరించిన డేటాను పిఎం-కిసాన్ పోర్టల్‌పై అప్‌లోడ్ చేసే బాధ్యత ఆయా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలది. అనంతరం, ఈ డేటా ఆధార్/ పిఎఫ్ఎంఎస్/ ఆదాయపు పన్ను సహా పలు స్థాయిల్లో ధృవీకరణకు, క్రమబద్ధీకరణకు లోనవుతుంది. ఈ ధృవీకరణ, క్రమబద్ధీకరణ తరువాత, అర్హులైన లబ్ధిదారులకు డిబిటి ద్వారా ఆధార్‌తో అనుసంధానమైన వారి ఖాతాలలో వేయడం జరుగుతుంది. వివిధ విడతల్లో 11 కోట్ల లబ్ధిదారు రైతులకు రూ. 2.42 లక్షల కోట్లను పిఎం-కిసాన్ పథకం కింద పంపిణీ చేశారు.
భూమిని కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పిఎం-కిసాన్ పోర్టల్‌లో భూమి వివరాలు అప్‌లోడ్ చేసిన రైతుల సంఖ్య 9,53 కోట్లపైన ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) యోజన కింద నమోదు చేసుకున్న రైతుల రాష్ట్రాల వారీ వివరాలు అనెక్చర్1లో ఇవ్వడం జరిగింది.
రాష్ట్రాల వారీగా పిఎం-కిసాన్ యోజన కింద లబ్ధి పొందిన రైతుల వివరాలు అనెక్చర్-2లో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు అందించిన భూమి, ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చిన రైతులందరూ కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు.
పిఎం-కిసాన్ యోజన కింద నో యువర్ కస్టమర్ (కెవైసి) పెండింగ్‌లో ఉన్న రైతుల సంఖ్య రాష్ట్రాల వారీగా అనెక్చర్ 3లో ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 1941580)
Visitor Counter : 172