వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డిజిటల్ వాణిజ్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్
డిజిటల్ కామర్స్‌కు ఓఎన్‌డిసి నెట్‌వర్క్ ప్రవేశ అడ్డంకులను తగ్గిస్తుంది. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను అందిస్తుంది అలాగే కొత్త వ్యాపార నమూనాలు మరియు అవకాశాలను ప్రోత్సహిస్తూ ఇ-కామర్స్ లావాదేవీల యొక్క వివిధ దశలను విడదీస్తుంది.
प्रविष्टि तिथि:
21 JUL 2023 6:14PM by PIB Hyderabad
ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది డిపిఐఐటి చొరవతో డిజిటల్ కామర్స్‌ను ప్రజాస్వామ్యీకరించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సెక్షన్ 8 కంపెనీ. ఓఎన్‌డిసి ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేస్తుంది మరియు నిర్వహిస్తుంది.యూపిఐ,హెచ్‌టిటిపి మరియు ఎస్‌ఎంటిపి మాదిరిగానే ఒక ఓపెన్ టెక్నికల్ స్టాండర్డ్.ఓఎన్‌డిసి ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉన్న ఏవైనా రెండు ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేకంగా ఒకదానికొకటి సిస్టమ్‌లతో ఏకీకృతం కాకుండా పరస్పరం పనిచేయగలవు. ఓఎన్‌డిసి ప్రోటోకాల్ కంప్లైంట్ అప్లికేషన్‌లు కలిసి ఓఎన్‌డిసి నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి.యూపిఐ డబ్బు బదిలీ చేయడానికి బ్యాంకులు మరియు చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ఇంటర్‌ఆపరేబిలిటీని ఎనేబుల్ చేసినట్లే లేదా గ్రహీత ఏ ఇమెయిల్ సేవను ఉపయోగిస్తారనే దాని గురించి చింతించకుండా ఇమెయిల్‌లను మార్పిడి చేసుకోవడానికి ఎస్‌ఎంటిపి వ్యక్తులను అనుమతిస్తుంది.ప్లాట్‌ఫారమ్‌లు ఓఎన్‌డిసి నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నంత వరకు ఓఎన్‌డిసి ప్రోటోకాల్ కొనుగోలుదారులు మరియు విక్రేతలు వారు ప్లాట్‌ఫారమ్‌తో సంబంధం లేకుండా వస్తువులు లేదా సేవలను వ్యాపారం చేయడానికి అనుమతిస్తుంది.
ఓఎన్‌డిసి నెట్‌వర్క్ యొక్క ప్రయోజనాలు డిజిటల్ కామర్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, అన్ని ఇ-కామర్స్ మోడల్‌లకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ను అందించడం మరియు కొత్త వ్యాపార నమూనాలు మరియు అవకాశాలను అనుమతించడానికి వివిధ దశల ఇ-కామర్స్ లావాదేవీలను అన్‌బండ్లింగ్ చేయడం వంటివి ఉన్నాయి. అందువల్ల ఓఎన్‌డిసి డిజిటల్ వాణిజ్యం యొక్క విస్తరణను నిర్ధారిస్తుంది, ఇది మరింత కలుపుకొని ఉంటుంది.
ఓఎన్‌డిసిని స్వీకరించడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటంటే ఓఎన్‌డిసి నెట్‌వర్క్ మొదటి సారి ఆన్‌లైన్‌కి తరలించడానికి ఓఎన్‌డిసి నెట్‌వర్క్ అనుమతిస్తుంది. అందువల్ల ఈ మార్పు సవాలుగా ఉంటుంది. అయితే ఓఎన్‌డిసి ఈ పరివర్తనను సాఫీగా మరియు అవాంతరాలు లేకుండా చేయడానికి సహాయం మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల కోసం వ్యవస్థలను అందిస్తోంది.
ఓఎన్‌డిసి రూపకల్పనతో పాటు ఉచిత మరియు ఓపెన్ సోర్స్ ప్రమాణాలు మరియు వ్యవస్థలు, డిజైన్ ద్వారా వికేంద్రీకరణ మరియు గోప్యత, భాగస్వామ్య విధానం మరియు పారదర్శకత, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, క్లియర్ ఆడిట్ ట్రయిల్ మరియు కొనుగోలుదారు మరియు విక్రేత హక్కులను రక్షించడం వంటి కార్యాచరణ పద్ధతుల ద్వారా పారదర్శకత, నమ్మకం మరియు సమర్థతను ప్రోత్సహిస్తుంది.
ఓఎన్‌డిసి నెట్‌వర్క్ ఓఎన్‌డిసి ప్రోటోకాల్ అనే ఓపెన్ స్పెసిఫికేషన్‌లపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఓఎన్‌డిసి ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉన్న ఏవైనా రెండు ప్లాట్‌ఫారమ్‌లు సందేశాలు మరియు ప్రక్రియలను నిర్వహించడానికి ఇతర ప్లాట్‌ఫారమ్ యొక్క నిర్దిష్ట భాషను నేర్చుకోనవసరం లేకుండా ఒకదానితో ఒకటి సంభాషించవచ్చు.
ఇది ఓఎన్‌డిసి రిజిస్ట్రీ ద్వారా సాధించబడుతుంది. రిజిస్ట్రీ అనేది ఇతర ఓఎన్‌డిసి ప్రోటోకాల్ కంప్లైంట్ ప్లాట్‌ఫారమ్‌లను కనుగొనడానికి ఉపయోగించే ఫోన్‌బుక్ లాంటిది. అన్ని నమోదిత ప్లాట్‌ఫారమ్‌ల వివరాలు ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉన్నట్లు ధృవీకరించిన తర్వాత మరియు పాల్గొనే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత రిజిస్ట్రీలో ఉంటాయి.
ప్రోటోకాల్ మరియు రిజిస్ట్రీ కలిసి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల సేకరణను సృష్టిస్తాయి. ఇవి ఒకదానికొకటి కనుగొనవచ్చు. అలాగే కనెక్ట్ చేయగలవు మరియు పరస్పర చర్య చేయగలవు. ఓఎన్‌డిసి నెట్‌వర్క్‌లో బహుళ కొనుగోలుదారు అప్లికేషన్‌లు మరియు విక్రేత అప్లికేషన్‌లు అన్నీ ఒకదానితో ఒకటి సజావుగా పని చేస్తాయి. ఈ ఓపెన్ నెట్‌వర్క్‌తో కొనుగోలుదారులు తమకు నచ్చిన ఒకే కొనుగోలుదారు అప్లికేషన్ ద్వారా ఏదైనా విక్రేత అప్లికేషన్‌ను ఉపయోగించి విక్రేతల నుండి ఉత్పత్తులు/సేవలను కనుగొనవచ్చు మరియు కొనుగోలు చేయవచ్చు.
కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 1941549)
आगंतुक पटल : 214