నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
రెండు అంశాలు పీఎం-కుసుమ్ పథకం అమలుకు ప్రధాన సవాళ్లుగా నిలిచాయి: కేంద్ర మంత్రి
- రైతులకు తక్కువ ధరకే ద్రవ్య లభ్యత, రాష్ట్ర నిధుల వాటా పీఎం-కుసుమ్ పథకం అమలుకు ప్రధాన సవాళ్లు: కేంద్ర విద్యుత్ & నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్
Posted On:
20 JUL 2023 6:38PM by PIB Hyderabad
పీఎం-కుసుమ్ పథకం మార్చి, 2019లో ప్రారంభించబడింది. నవంబర్, 2020లో అమలు తీరు వేగవంతం చేయబడింది, ఈ క్రింది లక్ష్యాలను కలిగి ఉంది:
i. కాంపోనెంట్ 'A': రైతుల బంజరు/ పోడు భూమిలో 2 మెగా వాట్ల వరకు సామర్థ్యం ఉన్న చిన్న సౌర విద్యుత్ ప్లాంట్ల టు ద్వారా 10 గిగా వాట్ల సామర్థ్యపు విద్యుత్ సాధించడం;
ii. కాంపోనెంట్ 'B': 20 లక్షల స్వతంత్ర ఆఫ్-గ్రిడ్ సోలార్ వాటర్ పంపుల ఇన్స్టాలేషన్; మరియు
iii. కాంపోనెంట్ ‘సి’: ఫీడర్ లెవెల్ సోలారైజేషన్ (ఎఫ్ఎల్ఎస్)తో సహా ఇప్పటికే ఉన్న 15 లక్షల గ్రిడ్-కనెక్ట్ అగ్రికల్చర్ పంపుల సోలరైజేషన్
ఈ మూడు విభాగాలు కలిపి మొత్తం 30.8 గిగా వాట్ల అదనపు సౌర సామర్థ్యాన్ని జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం-కుసుమ్ అనేది డిమాండ్ ఆధారిత పథకం కాబట్టి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి స్వీకరించిన డిమాండ్ ఆధారంగా పథకం యొక్క మూడు భాగాల క్రింద పరిమాణాలు/ సామర్థ్యాలు కేటాయించబడతాయి. రాష్ట్ర ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీలు (ఎస్ఐఏ) నివేదించిన ఇన్స్టాలేషన్ పురోగతి, స్కీమ్ మార్గదర్శకాల నిబంధనల ఆధారంగా పథకం కింద నిధులు విడుదల చేయబడతాయి. 30.06.2023 నాటికి, మొత్తం 113.08 మెగా వాట్ల సామర్థ్యం కాంపోనెంట్ 'A' కింద మరియు చుట్టుపక్కల ఏర్పాటు చేయబడింది. కాంపోనెంట్-బి మరియు కాంపోనెంట్-సి కింద 2.45 లక్షల పంపులు ఇన్‌స్టాల్ చేయడం/ సోలారైజ్ చేయడం జరిగినట్టుగా నివేదించబడింది. ఇది దాదాపు 1323 మెగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యంతో సమానం. ఇప్పటి వరకు రూ.1,646 కోట్లకు పైగా ఎస్‌ఐఏలకు విడుదల చేశారు. రైతులకు తక్కువ ధరకే నిధుల లభ్యత మరియు రాష్ట్ర నిధుల వాటా పీఎం-కుసుమ్ పథకం అమలులో ప్రధాన సవాలుగా నిలిచాయి. దీనికి తోడు 2020-21 మరియు 2021-22 సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమలు వేగం గణనీయంగా ప్రభావితమైంది. ఈ సమాచారాన్ని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధనం & విద్యుత్ శాఖ మంత్రి శ్రీ. ఆర్.కె.సింగ్ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1941331)
Visitor Counter : 129