పర్యటక మంత్రిత్వ శాఖ
జీ20 అద్యక్ష హోదాలో దేశంలో నిర్వహించిన అన్ని సమావేశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అంతేకాకుండా ప్రపంచ పర్యాటక పటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించాయి: శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
20 JUL 2023 7:00PM by PIB Hyderabad
జీ20 అద్యక్ష హోదాలో భాగంగా భారతదేశంలో నిర్వహించిన అన్ని సమావేశాలు ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. అంతేకాకుండా ప్రపంచ పర్యాటక పటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించాయి. జీ20 సమావేశాలు భారతదేశాన్ని సందర్శించే జీ20 దేశాల ప్రతినిధులకు చిరస్మరణీయ అనుభవాన్ని అందించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మరియు ఇతర వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించాయి. ఆతిథ్య నగరాల్లో మౌలిక సదుపాయాలు నవీకరించబడ్డాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఆతిథ్య నగరాల్లో మరియు చుట్టుపక్కల ఉన్న వివిధ వారసత్వ స్మారక చిహ్నాలు కూడా జీ20 ప్రతినిధుల ద్వారా విహారయాత్ర కోసం రూపొందించబడ్డాయి. అంతేకాకుండా భారతదేశం యొక్క గొప్ప సహజ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని చూసే అవకాశాన్ని వారికి అందించాయి. విహారయాత్రలు, లీనమయ్యే అనుభవాలతో పాటు సదరు ప్రాంతం యొక్క కళ, సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించడానికి జీ20 సమావేశాలు గొప్ప వేదికగా నిలిచాయి. స్థానిక హస్తకళలు మరియు కళాకారుల ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ సమాజ భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తూ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్‌లను ఏర్పాటు చేశాయి. స్థానిక కళలు మరియు హస్తకళల అనుభవాన్ని అందిస్తూ క్రాఫ్ట్ బజార్‌లో నిర్వహించిన ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్’ కార్యక్రమాలలో ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రతినిధులకు అందించిన సావనీర్ బహుమతులు ప్రాంతీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి.
పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యాటక వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా అనేక ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది, దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి మరియు ప్రచారానికి మార్గం సుగమం చేసింది. ఫిల్మ్ టూరిజం యొక్క అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి, దాని ప్రచారం మరియు అభివృద్ధి కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో ఎకో టూరిజం యొక్క ప్రచారం మరియు అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తో మరొక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్టీడబ్ల్యూఓ) మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ మధ్య టూరిజం ప్రమోషన్ మరియు డెవలప్‌మెంట్‌కి సంబంధించిన కీలకమైన ప్రోగ్రామాటిక్ రంగాలపై సహకారం మరియు ప్రోత్సాహాన్ని పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.
గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 1941303)
Visitor Counter : 143