జల శక్తి మంత్రిత్వ శాఖ

ఇంటింటికీ నీరు పథకం అమలు తీరు

Posted On: 20 JUL 2023 6:05PM by PIB Hyderabad

దేశ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కొళాయి నీటి సదుపాయం కల్పించేందుకు, జల్ జీవన్ మిషన్ (జేజేఎం) - హర్ ఘర్ జల్‌ పథకాన్ని అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. నీరు అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కాబట్టి, ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా కోసం పథకాలను రూపొందించడం & అమలు చేయడం వంటి ప్రాథమిక బాధ్యత సంబంధిత రాష్ట్రం/యూటీది.

2019 ఆగస్టులో జల్ జీవన్ మిషన్‌ను ప్రకటించే సమయానికి, దేశంలోని 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సరఫరా ఉంది. అప్పటి నుంచి, మరో 9.34 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీటి సరఫరా అందించడం జరిగింది. 17.07.2023 నాటికి, దేశంలోని 19.46 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో 12.57 కోట్ల (64.61%) కుటుంబాలకు కొళాయి నీటి సరఫరా అందించడం జరిగింది.

17.02.2023 నాటికి తమ రాష్ట్రం/యూటీలోని ప్రతి గ్రామీణ గృహానికి కొళాయి నీటి సరఫరా అందించినట్లు గోవా, గుజరాత్, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించాయి. ఈ పథకం వ్యవధి లోపు అన్ని గ్రామీణ గృహాలకు కొళాయి నీటి సరఫరా జరిగేలా చూడాలని మిగిలిన రాష్ట్రాలు/యూటీలకు సూచించడం జరిగింది. గ్రామీణ కుటుంబాలకు అందించిన కొళాయి నీటి సరఫరా వివరాలను రాష్ట్రాల వారీగా అనుబంధంలో చూడవచ్చు.

కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సమాచారాన్ని ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలిపారు.

 

****



(Release ID: 1941288) Visitor Counter : 119


Read this release in: English , Urdu