సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య రంగాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన ఇండియా చాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్

Posted On: 20 JUL 2023 5:59PM by PIB Hyderabad

భారతదేశంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య రంగాల అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి  ఇండియా చాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మధ్య అవగాహన కుదిరింది. అవగాహన ఒప్పందంపై  ఇండియా చాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేశాయి. 

ఆరోగ్యం,ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ హబ్ గా అభివృద్ధి చేయడానికి రెండు సంస్థలు కృషి చేస్తాయి. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే సమక్షంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

రెండు సంస్థల పట్ల కుదిరిన అవగాహన పట్ల శ్రీ రాణే హర్షం వ్యక్తం చేశారు. నూతన ఒప్పందం వల్ల వైద్య పరికరాల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానం సాధిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో స్వావలంబన సాధించడానికి రెండు సంస్థలు కృషి సహకరిస్తుందన్నారు. తమ మంత్రిత్వ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని మంత్రి హామీ ఇచ్చారు.  చేసిన  

అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన డిహెచ్ఆర్ కార్యదర్శి, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం వ్యవస్థలో మార్పు రావాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల వైద్య పరికరాలు, వైద్య ఉత్పత్తి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి ఆరోగ్య సంరక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన వల్ల ఆవిష్కరణలు, సాంకేతిక రంగాలలో అంతర్జాతీయ సహకారం పెరుగుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు మెరుగు పడడానికి, విద్య పారిశ్రామిక రంగాల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు కుదిరి  సామర్థ్యం పెంపు, ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. 

ఒప్పందంపై సంతకం చేసిన ఇండియా చాంబర్ ప్రెసిడెంట్  సిఇఒ శ్రీ నితిన్ పంగోత్రా మాట్లాడుతూ  భారతదేశాన్ని ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రపంచ హబ్ గా అభివృద్ధి  చేయడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అభివృద్ధి కోసం  కృషి చేస్తామన్నారు.  భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ డిజిటల్ విధానంలో ఉంటుందన్నారు.  స్మార్ట్ హెల్త్ కేర్ డెలివరీ, సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు, నాణ్యతతో కూడిన ఉత్పత్తులు, క్రిటికల్ హెల్త్ కేర్ ఎక్విప్ మెంట్ , వైద్య పరీక్షలు, డ్రగ్ పార్కులు మొదలైనఅంశాలు విద్య సంరక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలు , సాంకేతిక విధానాలు అమలు చేయడం,  ఆరోగ్య రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్ గా మార్చడానికి, భారతీయ ఆరోగ్య సంరక్షణ తయారీ, సేవల రంగంలో పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ సహకారం, సృజనాత్మకత, వ్యవస్థాపకత ప్రోత్సహించడానికి అంతర్జాతీయ వేదికను అభివృద్ధి చేసి, వ్యాపార పర్యావరణ వ్యవస్థనుప్రోత్సహించడానికి ఒప్పందం ద్వారా కృషి జరుగుతుందని వివరించారు. 

ఐసీఎంఆర్ సీనియర్ సైంటిస్ట్, ఇండియా హెల్త్ డైలాగ్ కో-చైర్మన్ డాక్టర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఒప్పందం ద్వారా  ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య రంగాల్లో  జ్ఞాన అంతరాన్ని పూరించడానికి కృషి జరుగుతుందన్నారు.  భవిష్యత్తులో ప్రపంచ స్థాయి మెడికల్ పార్కులు , మౌలిక సదుపాయాలు  అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించడానికి కీలకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

భవిష్యత్తుఅవసరాలకు అనుగుణంగా  ఆరోగ్యం , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థ రూపొందించడానికి   ఐసిఎంఆర్, ఐఎంఎ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సహకారంతో  ఇండియా ఛాంబర్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్ అమలు చేస్తున్న ఇండియా హెల్త్ డైలాగ్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా రెండు సంష్తల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

 

***



(Release ID: 1941285) Visitor Counter : 97


Read this release in: English , Hindi