పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
57 స్థావరాలలో కార్యకలాపాలు సాగిస్తున్న 36 ఫ్లయింగ్ శిక్షణా సంస్థలు
54 ఎంఎంఇ శిక్షణా సంస్థలను ఆమోదించిన డిజిసిఎ, 2022లో 1165 సిపిఎల్‌ల జారీ
ప్రతి ఏడాది డిజిసిఎ ఆమోదిత ఎఎంఇ శిక్షణా సంస్థల నుంచి దాదాపు 3500 మంది ఇంజినీర్ల సరఫరా
Posted On:
20 JUL 2023 2:37PM by PIB Hyderabad
నేటివరకూ 57 స్థావరాలలో 36 ఫ్లైయింగ్ శిక్షణా సంస్థలు (ఎఫ్‌టిఒ)లు ఉన్నాయి.
డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆమోదించిన 54 ఎఎంఇ శిక్షణా సంస్థలు ఉన్నాయి. మొత్తం 1165 కమర్షియల్ పైలెట్ లైసెన్సు (సిపిఎల్‌లు)లను 2022లో జారీ చేశారు. విమాన యాన పరిశ్రమ డిమాండ్లను తీర్చేందుకు డిజిసిఎ ఆమోదించిన ఎఎంఇ శిక్షణా సంస్థలు ఏడాదికి దాదాపు 3500 మంది ఇంజనీర్లను సరఫరా చేస్తున్నాయని అంచనా.
పౌర విమానయాన రంగంలో శిక్షణా మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు, నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన చొరవలు ఈ విధంగా ఉన్నాయి -
(1) దేశంలో శిక్షణ పొందిన పైలెట్ల సరఫరాను పెంచడం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) సరళీకృత ఫ్లైయింగ్ శిక్షణా సంస్థ (ఎఫ్‌టిఒ) విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల ఎయిర్‌పోర్ట్ రాయల్టీ భావన (ఎఎఐలకి ఎఫ్‌టిఒలు చెల్లించే రెవిన్యూ వాటా) ను రద్దు చేసి, భూమి కిరాయిలను ప్రముఖంగా హేతుబద్ధం చేశారు.
(2) పోటీ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం 2021లో ఎఎఐ ఐదు విమానాశ్రయాలు - బెలగావి (కర్ణాటక), జల్‌గాంవ్ (మహారాష్ట్ర), కాలబుర్గి (కర్ణాటక), ఖజురాహో (మధ్యప్రదేశ్), లీలాబారీ (అస్సాం)లలో తొమ్మిది ఎఫ్‌టిఒ స్లాటలను ప్రదానం చేసింది. రెండవ రౌండ్ బిడ్డింగ్‌లో జూన్ 2022న ఐదు విమానాశ్రయాలలో ఆరు ఎఫ్‌టిఒ స్లాట్లను ఎఎఐ ప్రదానం చేసింది. భావనగర్ (గుజరాత్)కు రెండు స్లాట్లు, హుబ్బళి (కర్ణాటక), కడప (ఆంధ్రప్రదేశ్), కీషన్‌గఢ్ (రాజస్తాన్), సాలెం (తమిళనాడు)లకు ఒక్కొక్క స్లాటు చొప్పున కేటాయించింది.
(3) నవంబర్ 2021 నుంచి అమలులోకి వచ్చేలా డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విమాన నిర్వహణ ఇంజనీర్లు (ఎఎంఇ), ఫ్లైయింగ్ క్రూ (ఎఫ్‌సి) అభ్యర్ధులకు ఆన్‌లైన్ ఆన్ డిమాండ్ ఎగ్జామినేషన్ (ఒఎల్ఒడిఇ)ను ప్రవేశపెట్టింది. అందుబాటులో ఉన్న పరీక్ష స్లాట్లను బట్టి తేదీని, సమయాన్ని అభ్యర్ధులు ఎంచుకునేందుకు ఇది సౌకర్యం కల్పిస్తుంది.
(4) ఎఫ్‌టిఒల వద్ద విమాన కార్యకలాపాలకు అధికారం ఇచ్చే హక్కుతో ఫ్లయింగ్ ఇనస్ట్రక్టర్లకు అధికారం కల్పించేందుకు డిజిసిఎ తన నిబంధనలను సవిరించింది. కాగా, గతంలో దీనిని చీఫ్ ఫ్లయింగ్ ఇనస్ట్రక్టర్ (సిఎఫ్ఐ)లేదా డిప్యూటీ సిఎఫ్ఐలకు మాత్రమే పరిమితం చేశారు.
(5) ప్రాథమిక నిర్వహణ శిక్షణ సంస్థకు సిఎఆర్-147 (ప్రాథమిక) నిబంధనలను డిజిసిఎ జారీ చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిబంధనలు ఉండటమే కాక, ఇఎఎస్ఎ నిబంధనల ప్రకారం సమన్వయం చేసే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. విమాన నిర్వహణ కోసం సమర్ధత కలిగిన/ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సిలబస్, నైపుణ్యాల శిక్షణ అవసరాలను క్రమబద్ధం చేస్తుంది.
ఈ సమాచారాన్ని, పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ సహాయమంత్రి జనరల్ (డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్) నేడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1941193)
Visitor Counter : 88