శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశీయ విజ్ఞాన వ్యవస్థను పెంచడానికి కొత్త సాంకేతిక బదిలీ ఏర్పాటు పశువుల సంతాన ఉత్పత్తి వ్యవస్థలో సుస్థిరమైన పద్ధతులను సమీకృతం చేయడంలో సహాయపడుతుంది
Posted On:
19 JUL 2023 3:51PM by PIB Hyderabad
సాంకేతికత బదిలీ ఏర్పాటు రెండు పర్యావరణ అనుకూల సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. తుది వినియోగదారుల కోసం మాస్టిటిస్‌ను వ్యాధిని నియంత్రించే సామర్థ్యంతో కూడిన దేశీయ మూలికా సూత్రీకరణ, పాడి జంతువులలో సాధారణ వ్యాధి మరియు బ్రాయిలర్ కోడిపిల్లల పెరుగుదల పనితీరుపై సానుకూల ప్రభావంతో దేశీయ మూలికా సప్లిమెంట్ లసాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) - భారతదేశం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్త సంస్థ, ఇటీవలే ఈ స్వదేశీ సాంకేతికతలకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన డబ్ల్యు హెచ్ ఓ, జీ ఎం పీ ఔషధ ఉత్పత్తులకు నాణ్యత హామీని నిర్ధారించే ధృవీకరణ సంస్థ అయిన ఇండియన్ జెనోమిక్స్‌తో టెక్నాలజీ బదిలీ ఏర్పాటు. ఈ చొరవ తరతరాలుగా సమాజం కొనసాగిస్తున్న అత్యుత్తమ సాంప్రదాయ జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఒక అడుగు. ఈ సాంకేతికతలు శాస్త్రీయంగా అధ్యయనం చేయబడ్డాయి మరియు పాడి జంతువులలో మాస్టిటిస్ నియంత్రణలో మరియు పౌల్ట్రీ ఫీడ్ సప్లిమెంట్‌లుగా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.
ఎన్ ఐ ఎఫ్ సాధారణ సర్వీస్ ప్రొవైడర్లు లేదా అధికారిక వ్యవస్థల మద్దతుతో అత్యుత్తమ స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలను రైతులతో సమీకృతం చేయడం ప్రారంభించింది. పశువుల సంతాన ఉత్పత్తి వ్యవస్థలలో తక్కువ ఖర్చుతో కూడుకున్న, సుస్థిరమైన పద్ధతుల కోసం రైతులు ఈ విజ్ఞాన వ్యవస్థలపై ఆధారపడతారు.
మాస్టిటిస్ వ్యాధి పాడి రైతులకు భారీ నష్టాన్ని కలిగించే వ్యాధి. వ్యాధి ప్రాథమికంగా బాక్టీరియా వల్ల వస్తుంది, ఇది త్వరగా గుర్తించి చికిత్స చేయవలసి ఉంటుంది. ప్రారంభ రోగనిర్ధారణ, క్షేత్ర స్థాయి చికిత్స లభ్యత మరియు ఔషధ నిరోధకతలో భారతీయ వ్యవసాయ విధానం సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇంకా, క్షేత్ర స్థాయి పరిస్థితిలో సమర్థవంతమైన సాంకేతికత లేకపోవడం ప్రత్యామ్నాయ సాంకేతికతలను అవసరం ఏర్పడింది. ఈ దేశీయ మూలికా సూత్రీకరణ స్టెఫిలోకాకస్ ఆరియస్, సూడోమోనాస్ ఎరుగినోసా వంటి ప్రధాన బ్యాక్టీరియా కారక జీవులను నియంత్రించడానికి కనుగొనబడింది. ఈ ఔషధ మూలికా ఫార్ములేషన్‌లో బహుళ ఫైటో-భాగాలు ఉన్నాయి, ఇవి ఫీల్డ్ బ్యాక్టీరియా జాతులకు వ్యతిరేకంగా ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తాయి. పాడి జంతువులలో క్లినికల్ బాక్టీరియల్ మాస్టిటిస్ చికిత్సలో సమర్థత ప్రభావ శీలతలపై విజ్ఞాన సంస్థల యొక్క ప్రత్యేకమైన సూత్రీకరణలను మూల్యాంకనం చేశారు.
అదేవిధంగా బ్రాయిలర్ పరిశ్రమలో పక్షులకు మెరుగైన జీవక్రియవృద్ధి కోసం పోషకాలు అందించబడతాయి, తద్వారా తక్కువ వ్యవధిలో వాంఛనీయ వృద్ధి ఉంటుంది. ఇది బ్రాయిలర్‌ల జీవక్రియపై భారీ ఒత్తిడిని కలిగిస్తుంది మరియు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి మరియు ఆహార మార్పిడి నిష్పత్తిని పెంచడానికి వాటికి సప్లిమెంట్‌లు అవసరం. బ్రాయిలర్ కోడిపిల్లల పెరుగుదల పనితీరుపై అత్యుత్తమ స్వదేశీ మూలికా సప్లిమెంట్ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఎన్ ఐ ఎఫ్ నిర్వహించిన ఒక అధ్యయనం కనుగొంది. సప్లిమెంటేషన్ మెరుగైన పోషక శోషణ లక్షణాలను సూచించింది (అధిక విల్లీ: క్రిప్ట్ నిష్పత్తికి దారితీసింది). ఇది మెరుగైన ఫీడ్ సామర్థ్యం ఫలితంగా బ్రాయిలర్ శరీర బరువు అధికంగా పెరిగింది.
ఎన్ ఐ ఎఫ్ శాస్త్రీయ ఆధారాలతో ఈ మూలికా విజ్ఞాన అభ్యాసాలకు అదనపు విలువను అందించింది మరియు వాటిని పేటెంట్ చేయడం లో సహాయపడింది. ఇండియన్ జెనోమిక్స్, జంతు ఆరోగ్య సంరక్షణ మరియు పశువైద్య వ్యాధుల కోసం ఉత్పాదక ఉత్పత్తుల రంగంలో ప్రముఖ పరిశ్రమ సంస్థ. ఈ విజ్ఞాన వ్యవస్థలు మార్కెట్ సామర్థ్యాన్ని పొందడం లో సహాయం చేస్తుంది. ఎన్ ఐఎఫ్ -ఇండియన్ జెనోమిక్స్, సమిష్టి ఏర్పాటు అటువంటి సాంకేతికతలను సాధారణ పశువుల సేవా ప్రదాతలతో ఏకీకృతం చేయగలదు, తద్వారా తుది వినియోగదారుల కోసం పర్యావరణ అనుకూల సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. ఎన్ ఐ ఎఫ్ మరియు ఇండియన్ జెనోమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లు స్వదేశీ సాంకేతికతల వాణిజ్యీకరణ కోసం సాంకేతిక బదిలీ ఏర్పాటులోకి ప్రవేశించాయి.
***
(Release ID: 1940900)
Visitor Counter : 138