కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 20 ప్రదేశాలు వాటి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైవ్ పై నివేదిక విడుదల చేసిన ట్రాయ్
Posted On:
19 JUL 2023 9:22PM by PIB Hyderabad
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఇరవై ప్రదేశాలలో, పరిసర ప్రాంతాలలో మార్చి 2023తో ముగిసే త్రైమాసికంలో డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహించింది. టెస్ట్ నిర్వహించిన ప్రాంతాలు. బాలాసోర్, ఈరోడ్, విజయనగరం, గ్యాంగ్‌టక్, ఐజ్వాల్, దిమాపూర్, షిల్లాంగ్, ఇటానగర్, జబల్‌పూర్, ప్రయాగ్‌రాజ్, వాయనాడ్, గాంధీధామ్, కాండ్లా ఓడరేవు, బికనీర్, అమృత్‌సర్, మైసూరు, మైసూరు-బెంగళూరు హెచ్‌డబ్ల్యు, జబల్‌పూర్-చక్‌ఘాట్ హెచ్‌డబ్ల్యూ, ప్రయాగ్‌రాజ్-బీకాన్- నాగౌర్ హెచ్‌డబ్ల్యూ మరియు అమృత్‌సర్-పఠాన్‌కోట్ హెచ్‌డబ్ల్యూ.
వాయిస్, డేటా సేవల కోసం సెల్యులార్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అందించిన నెట్‌వర్క్ నాణ్యతను అంచనా వేయడానికి డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ వివరాలు:
క్రమ సంఖ్య
|
ప్రదేశం
|
లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఏ)
|
1. |
బాలాసోర్
|
ఒడిశా
|
2. |
ఈరోడ్
|
తమిళనాడు
|
3. |
విజయనగరం
|
ఆంధ్రప్రదేశ్
|
4.
|
గాంగ్టక్
|
ఈశాన్య రాష్ట్రం
|
5. |
ఐజ్వాల్
|
ఈశాన్య రాష్ట్రం
|
6.
|
దిమాపూర్
|
ఈశాన్య రాష్ట్రం
|
7.
|
షిల్లాంగ్
|
ఈశాన్య రాష్ట్రం
|
8.
|
ఇటానగర్
|
ఈశాన్య రాష్ట్రం
|
9.
|
జబల్పూర్
|
మధ్యప్రదేశ్
|
10.
|
ప్రయాగరాజ్
|
యు.పి (తూర్పు)
|
11.
|
వాయనాడ్
|
కేరళ
|
12.
|
గాంధీధామ్, కాండ్ల పోర్ట్
|
గుజరాత్
|
13.
|
బికానెర్
|
రాజస్థాన్
|
14. |
అమృత్ సర్
|
పంజాబ్
|
15. |
మైసూరు
|
కర్ణాటక
|
16.
|
మైసూరు-బెంగళూరు హైవే
|
కర్ణాటక
|
17.
|
జబల్పూర్-చక్ ఘాట్ హైవే
|
మధ్యప్రదేశ్
|
18.
|
ప్రయాగరాజ్ -బందా హైవే
|
యు.పి (తూర్పు)
|
19.
|
బికనేర్ - నాగౌర్ హైవే
|
రాజస్థాన్
|
20.
|
అమృత్ సర్ హైవే
|
పంజాబ్
|
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ల కీలక పనితీరు సూచికలు (కేపిఐలు) అంచనా వేశారు. వాయిస్ సేవలకు, కేపిఐలు కవరేజ్; కాల్ సెటప్ సక్సెస్ రేట్ (సిఎస్ఎస్ఆర్); డ్రాప్ కాల్ రేట్; బ్లాక్ కాల్ రేట్, హ్యాండ్‌ఓవర్ సక్సెస్ రేట్; Rx నాణ్యత. డేటా సేవల కోసం కేపిఐలు డౌన్‌లోడ్, అప్‌లోడ్ థ్రూపుట్‌లు, వెబ్ బ్రౌజింగ్ ఆలస్యం, వీడియో స్ట్రీమింగ్ జాప్యం వంటి అంశాలను ఈ డ్రైవ్ లో పరిశీలించారు.
పూర్తి నివేదిక ట్రాయ్ వెబ్‌సైట్ www.analytics.trai.gov.inలో అందుబాటులో ఉంది.
******
(Release ID: 1940892)
Visitor Counter : 125