ఆర్థిక మంత్రిత్వ శాఖ
గుజరాత్ లో జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం వద్ద "ఇండియా - ఇండోనేషియా ఆర్ధిక మరియు విత్త విషయాలపై పరస్పర సంభాషణ " (EFD Dialogue) ప్రారంభిస్తున్నట్లు ఇండియా, ఇండోనేషియా ప్రకటించాయి
ఈ సంభాషణ / సంవాదం వల్ల రెండు దేశాల మధ్య సహకారాన్ని బలపఱచడంతో పాటు ప్రపంచ సమస్యలపై పరస్పర అవగాహనను పెంపొందించడమే కాక ఉమ్మడి అధ్యయనానికి మరియు విధాన సమన్వయానికి అపూర్వమైన అవకాశం కల్పిస్తుంది.
Posted On:
16 JUL 2023 4:54PM by PIB Hyderabad
"ఇండియా - ఇండోనేషియా ఆర్ధిక మరియు విత్త విషయాలపై పరస్పర సంభాషణ " ప్రారంభిస్తున్నట్లు ఇండోనేషియా ఆర్ధిక మంత్రి శ్రీ మూల్యాని ఇంద్రావతి మరియు కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు. జి 20 దేశాల ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశంలో ఆవిష్కరించిన ఈ వేదిక రెండు దేశాల మధ్య సహకారాన్ని బలపఱచడంతో పాటు ప్రపంచ సమస్యలపై పరస్పర అవగాహనను పెంపొందిస్తుంది.
" భారత ప్రభుత్వం 1991లో రూపొందించిన 'తూర్పు దేశాలవైపు దృష్టి విధానం' , దాని తరువాత ప్రకటించిన 'తూర్పుదేశాల అనుకూల విధానం' వల్ల ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యంగా వాణిజ్య , సాంస్కృతిక క్షేత్రాలలో శీఘ్రగతిలో అభివృద్ధి జరిగిందని కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. "ఆగ్నేయాసియా (ASEAN) ప్రాంతంలో ఇండోనేషియా మన దేశానికి అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా మారిందని , 2005 నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎనిమిది రేట్లు పెరిగిందని, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అది 38 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరిందని" ఆమె ప్రకటించారు.
పరస్పర సంభాషణ రెండు దేశాలకు చెందిన ఆర్ధిక విధాన నిర్ణేతలు, ఆర్ధిక రెగ్యులేటర్లు ఒకచోట సమావేశం కావడానికి ద్వైపాక్షిక, అంతర్జాతీయ ఆర్ధిక, విత్త విషయాలపై భాగస్వామ్యం పెంపొందడానికి దోహదం చేస్తుంది. డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ శక్తి సామర్ధ్యాలను గుర్తించిన ఇద్దరు ఆర్ధిక మంత్రులు ఈ రంగంలో సహకరించుకోవాలని అంగీకరించారు.
వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థలనే సారూప్యతతో పాటు రెండు దేశాలకు జి20, డబ్ల్యు టి ఓ, తూర్పు ఆసియా కూటమి వంటి బహుజాతీయ సంస్థలలో సభ్యత్వం ఉన్న దృష్ట్యా ఇప్పుడు ఆవిష్కరించిన వేదిక ఉమ్మడి అధ్యయనానికి మరియు విధాన సమన్వయానికి/సహకారానికి అపూర్వమైన అవకాశం కల్పిస్తుంది.
ఈ సంభాషణ / సంవాదం వల్ల ఇండియా, ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత వృద్ధిచేయడమే కాక ఆగ్నేయాసియాలో, ప్రపంచంలో విస్తృత ఆర్ధిక, విత్త సుస్థిరతకు కూడా తోడ్పడగలదని ఇద్దరు ఆర్ధిక మంత్రులు అభిప్రాయపడ్డారు.
****
(Release ID: 1940288)
Visitor Counter : 192