మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐఐటీ గాంధీనగర్‌లో జరగనున్న విద్యార్థులు , స్టార్టప్‌ల కోసం జీ-20 సింగపూర్-ఇండియా హ్యాకథాన్ 2023 ముగింపుకు హాజరుకానున్న విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సింగపూర్ ఉప ప్రధాన మంత్రి శ్రీ లారెన్స్ వాంగ్
Posted On:
15 JUL 2023 6:54PM by PIB Hyderabad
సింగపూర్-ఇండియా (ఎస్ఐ) హ్యాకథాన్ మూడవ ఎడిషన్ ఫైనల్స్ ఐఐటీ గాంధీనగర్ క్యాంపస్‌లో 2023 జూలై 16న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( ఏఐసీటీఈ ) , సింగపూర్ కి చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్ టి యు) ఆధ్వర్యంలో జరగనున్నాయి. కార్యక్రమంలో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ,సింగపూర్ ఉప ప్రధాన మంత్రి , ఆర్థిక మంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ పాల్గొని ప్రసంగిస్తారు. సింగపూర్-ఇండియా (ఎస్ఐ) హ్యాకథాన్ విజేతలను సన్మానిస్తారు. వాతావరణ మార్పు, ఆర్థిక చేరిక అంశాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి విజేతలు మార్గాలను అన్వేషించడానికి పోటీ పడతారు.
ఐఐటీ గాంధీనగర్‌లో జరిగే హ్యాకథాన్ ముగింపు కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ సంస్థలు, విద్యావేత్తలు హాజరవుతారు. సింగపూర్-ఇండియా హ్యాకథాన్ 2023 ఫైనల్స్‌లోభారతదేశానికి చెందిన రెండు విద్యార్థి బృందాలు సింగపూర్ చెందిన విద్యార్థులతో కూడిన 12 బృందాలు పోటీ పడతాయి. విజేతలకు 12 లక్షల రూపాయలను బహుమతిగా అందిస్తారు.
ఆర్థిక మోసాలు కనిపెట్టడానికి, ఆర్థిక చేరిక, రుణ పరపతి, పెరుగుతున్న సముద్ర మట్టాలు, వరదలు, ఆహార పదార్థాల పునర్ వినియోగం, కర్బన ఉద్గారాలు. సింగపూర్-భారతదేశం మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచడానికి అమలు చేయాల్సిన చర్యలను సూచించడానికి భారతదేశం, సింగపూర్ లకు చెందిన స్టార్టప్‌లు,విద్యార్థులను సిద్ధం చేయాలని సింగపూర్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్‌ను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు ఎస్ఐ హ్యాకథాన్ రూపొందింది.
సింగపూర్-ఇండియా హ్యాకథాన్ 2023 లో ఎన్ టి యు సింగపూర్, ఐఐటీ గాంధీనగర్ వంటి విద్యా సంస్థలు, రెండు దేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు, రెండు దేశాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం వహించి పోటీకి సిద్ధం చేశాయి. వాతావరణ మార్పు ఆర్థిక చేరిక కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సవాళ్లపై హ్యాకథాన్ దృష్టి సారించింది.
సింగపూర్ ఇండియా హ్యాకథాన్ 2023 ముగింపు కార్యక్రమం కోసం లింక్‌ని క్లిక్ చేయండి:
(Release ID: 1940059)
Visitor Counter : 175