కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పరిశోధన విధానం, క్లిష్టమైన ఆలోచన విధానం, ఆవిష్కరణ సరళి, సహేతుక నిర్ణయం అంశంపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించిన ఐఐసిఏ
Posted On:
07 JUL 2023 8:00PM by PIB Hyderabad
పరిశోధన విధానం, క్లిష్టమైన ఆలోచన విధానం, ఆవిష్కరణ సరళి, సహేతుక నిర్ణయం అంశంపై 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఏ) ప్రారంభించింది.
పరిశోధన, థియరీ మరియు డిజైన్‌పై 3 నెలల సర్టిఫికేట్ కోర్సును ఐఐసీఎస్ ప్రారంభించింది. ఆవిష్కరణ, విమర్శనాత్మక ఆలోచన,సాక్ష్యం-ఆధారిత నిర్ణయం తీసుకునే విధానాలు పెంపొందించడానికి అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధన చేపట్టడానికి అవసరమైన ప్రాథమిక శిక్షణ అందించడం లక్ష్యంగా 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది.
కోర్సు వివరాలను ఐఐసిఏ డైరెక్టర్ జనరల్,సీఈఓ శ్రీ ప్రవీణ్ కుమార్ వివరించారు. జ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మరియు పరిశోధన, ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచనలు కీలకంగా ఉంటాయన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించి మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించామన్నారు. అభ్యాసం, బహుముఖ ఆలోచనా సరళి, విభిన్న దృక్కోణాలను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తామని శ్రీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జైపూర్ నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రోషన్ లాల్ రైనా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా రంగంలో పరిశోధన కీలకంగా ఉంటుందన్నారు. పరిశోధనతో ఆవిష్కరణలు పెరుగుతాయన్నారు. పరిశోధన విధానంతో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.వ్యక్తిగత అభిప్రాయలు, అనుభవాలు పంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. పరిశోధన ఆలోచనా సరళిలో మార్పు తీసుకు వస్తుందని, విధానాలపై ప్రభావం చూపిస్తుందని ప్రొఫెసర్ రైనా వివరించారు. సమర్థవంతమైన పరిశోధన రూపకల్పన, సమాచార సేకరణ, విశ్లేషణ, వివరణ అంశాల ప్రాధాన్యతను ఆయన వివరించారు. పరిశోధనను నిర్వహించడంలో విమర్శనాత్మక ఆలోచన, వివరాలకు శ్రద్ధ మరియు నిరంతర అభ్యాసం కీలకంగా వుంటాయని ప్రొఫెసర్ రైనా పేర్కొన్నారు.
నైతిక విలువలు పాటిస్తూ సమగ్ర విధానంలో పరిశోధనలు సాగించాలని ఒలువటోయిన్ ఒయెకెను సూచించారు. సమగ్ర పరిశోధనా ప్రక్రియ విద్యలో కీలక పాత్ర పోషిస్తుందని ఒలువటోయిన్ ఒయెకెను అన్నారు.ఆన్‌లైన్ విధానంలో అందించే కోర్సు అవసరాలకు అనుగుణంగా, అనువైన సమయాల్లో శిక్షణ పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు. అయితే, చర్చల ద్వారా అనుభవాలు పంచుకోవడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఒలువటోయిన్ ఒయెకెను తెలిపారు. వివిధ రంగాల మధ్య సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడికి కోర్సు ఉపయోగపడుతుందని అన్నారు.
మూడు నెలల సర్టిఫికెట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కోర్స్ డైరెక్టర్ డాక్టర్ లతా సురేష్ విద్య, విజ్ఞాన సాధనలో శ్రేష్ఠత అంశాలకు ఐఐసిఏ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పరిశోధన ఆధారిత వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా మూడు నెలల సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించామన్నారు. ఆవిష్కరణ, విమర్శనాత్మక ఆలోచన, సాక్ష్యం-ఆధారిత నిర్ణయం తీసుకునే సామర్ద్యాన్ని పెంపొందించడానికి అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనలు చేపట్టాల్సి ఉంటుందని డాక్టర్ లతా సురేష్ అన్నారు.
***
(Release ID: 1938118)
Visitor Counter : 167